Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Kerala: కేరళలో అవినీతి రాజ్యం?

Kerala: కేరళలో అవినీతి రాజ్యం?

అవినీతికి సంబంధించిన ఆరోపణలు క్రమక్రమంగా పెరుగుతుండడం పినరాయి విజయన్‌ ప్రభుత్వానికి, మార్క్సిస్టు పార్టీ నాయకత్వంలోని ఎల్‌.డి.ఎఫ్క ఆందోళనకర విషయమే. ఎఐతో నడిచే ట్రాఫిక్‌ మానిటరి ంగ్‌ సిస్టమ్లో అవకతవకలు జరిగాయంటూ తాజాగా ఒక కొత్త ఆరోపణ ఊపందుకుంటోంది. నిజానికి ఈ సిస్టమ్‌ వల్ల ప్రభుత్వ ఖ్యాతి ఇబ్బడిముబ్బడిగా పెరగాల్సింది. ఈ సిస్టమ్కు సంబంధించిన వస్తు సామగ్రి ని సేకరించి, ఇన్స్టాల్‌ చేసేందుకు కాంట్రాక్టులు ఇవ్వడంలో నిబంధనల ఉల్లంఘన, అవినీతి, అవకతవక లు చోటు చేసుకున్నట్టు ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం ప్రారంభించాయి. నిప్పు లేనిదే పొగ రాదన్నట్టుగా, కొ న్నయినా ఆధారాలు లేనిదే సందేహాలు ప్రారంభమయ్యే అవకాశం లేదు. ఈ 232 కోట్ల రూపాయల ప్రాజె క్టును అమలు చేయాల్సిందిగా ప్రభుత్వ రంగ సంస్థ కెల్టాను ఆదేశించినప్పుడు ఆ సంస్థ బెంగళూరుకు చె ందిన కంపెనీకి ఈ కాంట్రాక్టును అప్పగించింది. ఆ కంపెనీకి ఈ రంగంలో పెద్దగా అనుభవం గానీ, నైపు ణ్యంగానీ లేనట్టు ఆ తర్వాత వెల్లడైంది. ఈ కంపెనీ కేరళకు చెందిన కొన్ని సంస్థలకు సబ్‌ కాంట్రాక్టులను ఇచ్చింది. ఈ సంస్థలకు, కేరళలో సీపీఎం నాయకత్వంలోని ఉరలుంగళ్‌ లేబర్‌ కాంట్రాక్ట్‌ కోపరేటివ్‌ సొసై టీకి దగ్గర సంబంధాలున్నాయి. ఈ సబ్‌ కాంట్రాక్టులు, ఇతర ఒప్పందాల కారణంగా దీని ఖర్చు తడిసి మోపెడయింది. మూడు రెట్లు పెరిగిందని అంచనా.
ఈ వ్యవహారం మీద క్షుణ్ణంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందనడంలో సందేహం లేదు. అయితే, ఇప్పటికే దెబ్బతిన్న ప్రభుత్వ ప్రతిష్టను ఇది మరింత దెబ్బతీసింది. పినరాయి విజయన్‌ రెండవ దఫా పాలన లో ఇదే మొట్టమొదటి అతి పెద్ద అవినీతి కుంభకోణం కాగా, మొదటి దఫా పాలనలో అనేక అవినీతి ఆరో పణలు వెల్లువెత్తడం జరిగింది. సంచలనం కలిగించిన బంగారం అక్రమ రవాణా కేసులో ఆయన మాజీ ప్రిన్సపల్‌ సెక్రటరీ ఎం. శివశంకర్‌ ప్రధాన నిందితుడు కాగా, ఆయన అదనపు వ్యక్తిగత కార్యదర్శి సి.ఎం. రవీంద్రన్‌ కూడా అనుమానితుల జాబితాలో ఉన్నారు. ఇక లైఫ్‌ మిషన్‌ హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ ముడుపు ల కేసులో మరింత తీవ్రస్థాయి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందులో విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించినట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. శివశంకర్ను అరెస్టు చేయడం, రవీంద్రను విచారించడం జరిగింది. అంతకు ముందు మరొక సంఘటన కూడా చోటు చేసుకుంది. కోవి్‌డ క్వారంటైన్‌ కింద కేరళ ప్రజల వివరాలను సేకరించడానికి అమెరికాకు చెందిన స్ప్రింక్లర్‌ అనే సంస్థతో ఒప్పందం కుదర్చుకోవడం కూడా వివాదాస్పదమైంది. ఇక బంగారం అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితురాలైన స్వప్నా సురేశ్‌ ఈ వ్యవహారమంతా నడిపించింది, ఇందుకు ప్లాన్‌ వేసింది పినరాయి విజయన్‌ కుమార్తె వీణా విజయన్‌ అ ని బయటపెట్టడం సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి ఆపత్కాల సహాయ నిధి విషయంలో కూడా అనే క అవకతవకలు, అవినీతి జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి.
ఈ ఆరోపణలన్నీ తీవ్రస్థాయికి చెందినవే. ప్రభుత్వం వీటిని తోసేయడానికి వీల్లేని పరిస్థితిలో ఉంది. అ భివృద్ధికి అనుకూలమైన ప్రభుత్వంగా, చరిత్రలో నిలిచిపోయే ప్రభుత్వంగా ఉండాలని భావించిన ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ ప్రస్తుతం అత్యంత అవినీతి ప్రభుత్వానికి అధిపతిగా చరిత్రలో నిలిచిపోయే పరిస్థి తి ఏర్పడింది. ఆయనకు ఇంకా మూడేళ్ల పదవీ కాలం ఉంది. ఈలోగా ఆయన పరిస్థితుల్ని చక్కదిద్దాల్సి ఉ ంది. ఆ పనిని వెనువెంటనే ప్రారంభించడం మంచిది. మొదటగా ట్రాఫిక్‌ ప్రాజెక్టులో ఆయన నిర్దోషిగా ని రూపించుకోవాల్సి ఉంది. మంత్రులు, అధికారుల కార్యకలాపాల మీద కన్ను వేసి ఉండక తప్పదు. ఒప్పం దాలు కుదర్చుకోవడంలోనూ, ప్రజా సంబంధమైన ప్రాజెక్టులను ఇతరులకు అప్పగించడంలోనూ పారదర్శక త పాటించడం మంచిది, తన చేతులు కూడా కల్మషరహితమని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News