‘మణికర్ణిక’ కలం పేరుతో విభిన్న ప్రక్రియలలో అనేక రచనలు చేస్తూ పలువురి సాహితీ వేత్తలచేత ప్రశంసలు అందుకుంటున్న శ్రీ వడ్ల నరసింహాచారి రచించిన ఆణిముత్యమే ‘తెలుసుకో ఓ మనిషి.’ శతకం. ఈ పుస్తకం వడిచర్ల సత్యం సృష్టించిన మణిపూసల కవితా ప్రక్రియలో కూర్చారు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైన మణికర్ణిక ప్రవృత్తిపరంగా మంచి కవి, రచయిత. భాష పట్ల పరిపూర్ణమైన అవగాహనతో ప్రభోదాత్మకమైన పద్ధతిలో తెలుసుకో ఓ మనిషి మణిపూసల శతకమును తీర్చిదిద్దారు.
ఈ చిన్ని సంపుటిలో కవి ఎన్నో అంశాలను స్పృశించాడు. ప్రకృతి, పర్యావరణం, స్త్రీల ఔన్నత్యం, విద్య మొదలగు సామాజిక విషయాలను పరిగణలోకి తీసుకొని రాయడం జరిగింది. మన నిత్య జీవితంలో జరిగే సంఘటనలను ఉదాహరిస్తూ, అద్భుతమైన శతకాన్ని అందించారు. ‘తెలుసుకో ఓ మనిషి‘ అనే మకుటాన్ని మూడవ పాదంగా పెట్టుకుని కవితా రచన చేశాడు. మొత్తం నాలుగు పాదాలు ఉంటాయి. ‘శతకమంతా పది మాత్రల్లో పొదుగడం ఒక విశేషం.’ చక్కని అంత్యప్రాసలతో గాన యోగ్యమైన లయలో రాశారు మణికర్ణిక.
శతకంలో ప్రప్రథముగా గణేషుని ప్రార్థనను శ్రీకారముతో ప్రారంభించారు. ఆ తర్వాత అమ్మానాన్నలను, గురువులను ప్రస్తుతించాడు. ఈ మణిపూసలన్ని ఏదో ఒక నీతిని బోధించేలా, మనిషికి సన్మార్గం చూపించేలా ఉన్నా యి. మచ్చుకు కొన్ని పరిశీలిద్దాం…..
ఉదయించును సూర్యుడు
వర్షించును మేఘుడు
తెలుసుకో ఓ మనిషి
సాయపడు సజ్జనుడు!
అంటూ అలతి అలతి పదాలతో స్వభావసిద్ధమైన దోరణిలో అందరికీ అర్థమయ్యేలా వర్ణించిన తీరు సుంద రంగా ఉంది.
క్రింద పడిన కెరటము
పైకి లేచు తథ్యము
తెలుసుకో ఓ మనిషి
అది మన కాదర్శము!
ఒక్కోసారి మనము అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకో లేక పోయినా, నిరుత్సాహ పడకూడదని, మళ్లీ ప్రయత్నం చేయాలని అందుకు కెరటం మనిషికి ఆదర్శమని చక్కగా వివరించారు.
గురువు మాట మీరకు
దారి తప్పి నడవకు
తెలుసుకో ఓ మనిషి
అమితంగా పలుకకు!
గురువు మాట విని సన్మార్గంలో నడవాలని సూటిగా, స్పష్టంగా చెప్పిన విధం విద్యార్థులకు హితబోధ చేసేలా ఉంది.
భేద భావము వద్దు
మతములన్నవి హద్దు
తెలుసుకో మనిషి
మానవత్వం ముద్దు!
మనుషులంతా కుల మత భేదాలు విడిచి పెట్టి, మాన వత్వంతో, సమానత్వంతో కలిసి జీవించాలన్నారు.
పనియె దైవము సుమ్ము
నిజంబిదియే నమ్ము
తెలుసుకో ఓ మనిషి
రాత మారును లెమ్ము!
పనియే మనిషికి నిజమైన దైవమని, శ్రమ ద్వారా మా త్రమే జీవితంలో అభివృద్ధి మార్పు సాధ్యమని నమ్మారు.
నింగి నంటెను ధరలు
భారమాయెను ధరలు
తెలుసుకో ఓ మనిషి
మోయలే మీ ధరలు!
ప్రస్తుత పరిస్థితులకు సరిపోయేలా ధరల పెరుగుదల వలన సామాన్యుడు పడే బాధల గురించి పేర్కొనడం కవికున్న జనజీవన స్పృహను తెలియ జేస్తుంది.
నైతిక విలువలతో కూడిన మంచి నీతి శతకం ఇది. ఆధ్యాత్మిక చింతన, చదువు ప్రాముఖ్యత, దేశభక్తి, మాన వతా విలువలు, మొదలైన అంశాలు, మానవుడు తెలుసు కోవాల్సిన మరెన్నో సంగతులు ఈ కృతిలో చోటు చేసుకు న్నాయి. సుమారు మూడు వేల మణిపూసలు లిఖించి, ‘మణిపూసల కవిశిరో మణి’గా ప్రఖ్యాతి గాంచిన వడ్ల నరసిం హాచారి కలం నుండి మరిన్ని మంచి రచనలు రావాలని, ప్రేక్షకుల మ దిని దోచుకోవాలని ఆశి స్తూ… అభినందనలు!
సమీక్షకులు…
- కందుకూరి భాస్కర్,
9703487088.