Tuesday, October 8, 2024
Homeఇంటర్నేషనల్Canada: నోవా మల్టీ ఫెస్ట్ లో తెలుగువారి సందడి

Canada: నోవా మల్టీ ఫెస్ట్ లో తెలుగువారి సందడి

భారతీయ పండుగలన్నీ ఒకే వేదికపై జరిపిన తీరు ఆకర్షణీయం

కెనడా  హాలిఫాక్స్ లో అత్యద్భుతంగా సాగాయి నోవా మల్టీఫెస్ట్ వేడుకలు. ఈ వేదికపైనే తెలుగు భాషకు అత్యున్నత వైభవం దక్కేలా మనవారు తెలుగు సంస్కృతిని చాటారు. దేశ, విదేశాలకు తెలుగు కట్టుబొట్టును పరిచయం చేయటం విశేషం.

- Advertisement -

మనమంతా పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం కాదు,  మేము ఎక్కడ ఉంటే  అక్కడే పండుగ అంటూ మన సంస్కృతి సంప్రదాయాలను కెనడా లో చాటి చెబుతున్నారు మన భారతీయులు. అందునా మన తెలుగు వారు ఈ విషయంలో మరింత ముందున్నారు.

విశాల్ భరద్వాజ్ టీం భ్యారి, టీనా, సెలెస్ట్ ఆధ్వర్యంలో కెనడా NS లీడర్ పార్టీ లీడర్ అండ్ యార్మౌత్ MLA  జాక్ చర్చిల్, NDP లీడర్ క్లాజుడై చందర్, క్లేటొన్  పార్క్ MLA రఫా డీకోస్తాంజో ముఖ్య అతిథులుగా విచ్చేసి నోవా మల్టీఫెస్ట్ సంబరాలు కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు.  ఈ కార్యక్రమానికి 8000 మంది ప్రజలు హాజరయ్యారు. శ్రీహరి చల్లా దంపతులు మన దేశం / రాష్ట్రం తరఫున కార్య కలాపాలు నిర్వహించారు.   శ్రీహరి బృందం, ఫణి వంక దంపతులు, శివ మారెళ్ళ దంపతులు, చంద్రా తాడేపల్లి దంపతులు, వెంకట్ వేలూరి దంపతులు, శ్రీనివాస చిన్ని దంపతులు, పృద్వి కాకూరు , క్రిష్ట్న వేణి, రత్నం దంపతులు, జయ, ప్రియాంక, లావణ్య, శ్రీలేఖ, జనని కృష్ణ, జ్యోత్స్నా శ్రీజ, దీపికా కర్ణం,  జయశ్రీ కర్ణం, సియ శివకుమార్, చిరంజీవి. రిషిన్త్ శివకుమార్, చిరంజీవి శిబి నాన్తం ఆట్రియం & చిరంజీవి రోహిత్ సాయి చల్లా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.


కెనడా లో హాలిఫాక్స్ నగరంలో జరిగిన “నోవా మల్టీఫెస్ట్” సంబరాలలో మన తెలుగు వారు, ఇతర రాష్ట్రాల వారు కలిసి మన పండుగలు (ఉగాది- తెలుగు కొత్త సంవత్సరం, కర్వా చౌత్ (అట్ల తదియ), రాఖీ -రక్షాబంధన్,  తెలుగు పండుగ సంక్రాంతి (ముగ్గులు, గాలిపటాలు, ధాన్యం, పాలు కలిపి వండిన నైవేద్యం), దీపావళి ( దీపాల వరుస, ఆనందం, విజయం, సామరస్యానికి గుర్తుగా జరుపుకునే పండుగలు) వాటి ప్రాముఖ్యతను కెనడా వాసులకి వివరించి  కన్నుల విందు చేశారు.

వాతావరణం అనుకూలించక మా నోవా మల్టీఫెస్ట్ సంబరాలు ఒక్క రోజు మాత్రమే జరిగింది, అయినప్పటికీ 8000 మంది వేడుకలలో పాల్గొనడం విశేషం.   వివిధ భాషలు, వివిధ సంస్కృతులు నివాసమైన కెనడాలో భారతీయులు అత్యధికంగా ఉంటున్నారు. ఇక్కడ తెలుగువారి జనాభా కూడా ఎక్కువే. దీంతో మనవారి సంప్రదాయాలు, వేషభాషలను కెనడాలో చాలా సులువుగా అర్థం చేసుకుంటారు. రెండు  రోజులు హోరున వర్షాలు ఈదురు గాలుల కారణంగా ఈ కార్యక్రమం జరగకపోయినప్పటికీ మూడవ రోజు వాతావరణం అనుకూలించడంతో ప్రారంభమైన వేడుకలు నభూతో నభవిష్యసి అన్నంత ఘనంగా సాగటం విశేషం. కెనడా వాసులలో మన ఇండియా పండుగల ప్రాముఖ్యత గుర్తించి 8,000 మందికి పైగా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటం హైలైట్.

కెనడా హెలి fax – సుప్రజ మాట్లాడుతూ ఏ దేశమేగినా ఎందు కాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని అంటూ, మన ప్రాచీన కళలైనటు వంటి భరతనాట్యం ( కుమారి.జనని కృష్ణ్ణ ), కూచిపూడి (కుమారి .జ్యోత్స్న శ్రీజ చల్లా), కర్రసాము (చిరంజీవి.శిబి నాన్తం ఆట్రియం ) మరియు జానపద నృత్యాలతో (కుమారి.దీపీకా కర్ణం కుమారి.జయశ్రీ కర్ణం ) కెనడా ప్రజలను ఆశ్చర్య చకితులను చేసింది.  అలాగే మన సాంప్రదాయ వస్త్రాలతో  కెనడా వాసులని అలంకరించింది.
వివాహ భోజనంబు వింతైన వంటకంబు అంటూ రకరకాల దేశాల వారి విందు భోజనాలు అందరూ ఆరగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News