భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పేరు చెప్పగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది తలపై గాంధీ టోపీ, ఒక చేతిలో స్వేఛ్చగా గాలిలోకి వదిలేందుకు సిద్ధంగా ఉన్న శ్వేత పావురం, షేర్వానీలో అందంగా ఇమిడి ఉన్న ఎర్ర గులాబీ. అలాగే మన ప్రాచీన భారత చరిత్రలో కూడా పావురాలకు గొప్ప స్థానం ఉందని తెలిపే ఉదంతాలు కోకొల్లలు. ఆ రోజుల్లో రాజులు, రాణుల ప్రేమ సందేశాలను ఒకరి నుండి మరొ కరికి చేరవేయడం, శత్రు దేశాల్లో ఉండే వేగుల (గూఢ చారులు) ద్వారా రహస్య సమాచారాన్ని రాజులకు చేర వేయడంతో పాటు సాధారణ పౌరుల ఉత్తరాల బట్వాడా లో కూడా పావురాలు అమోఘమైన సేవలు అందించేవి. ఈ సేవలు అందించడానికి పావురాలకు అప్పట్లో ప్రత్యేక మైన శిక్షణ కూడా ఇచ్చేవారని చెబుతారు. అయితే, ఇటీ వలి కాలంలో పావురాల వలన మనుషులలో హైపర్సెన్సి టివిటీ న్యుమోనైటిస్, ఇతర ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు ఎక్కు వగా సంభవిస్తుండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
పావురాల గురించిన కొన్ని నిజాలు
పావురాలు గ్రహం మీద అత్యంత తెలివైన పక్షులలో ఒకటిగా పరిగణించబడతాయి. ఒక రకమైన పక్షి జాతికి చెందిన పావురాలు కొలంబిఫార్మిస్ క్రమంలో కొలంబిడే కుటుంబానికి చెందినవి. వీటిలో పెద్దగా ఉండే జాతులను కపోతాలు అని, చిన్నగా ఉండే జాతులను పావురాలు అని అంటారు పావురం ‘శాంతి’కి చిహ్నం. వంకరగా ఉండే ఈకలతో కూడిన బూడిద రంగు పావురం, ఫ్రిల్‌బ్యాక్ వంటి ఫ్యాన్సీ పావురాలతో సహా ఈ రోజు 300 కంటే ఎక్కువ జాతుల పావురాలు ఉన్నాయి. హోమింగ్ పావు రాన్ని మెసెంజర్ లేదా క్యారియర్ పావురం అని కూడా పిలుస్తారు. ఈ పక్షులను పావురం రేసుల్లో ఉపయోగి స్తారు. పెళ్లిళ్లలో విడుదల చేసే తెల్ల పావురాలు హోమింగ్ పావురాలు. పావురాలు నిరంతరాయంగా 13 గంటల పాటు ఓకే రోజులో 1100 మైళ్ల దూరం ప్రయాణించ గలవు. అయితే, వాతావరణంతో పాటు గాలి వేగం తది తర అంశాలు వీటి ప్రయాణ దూరం, వ్యవధిని ప్రభావితం చేస్తాయి. ఇవి రెక్కలు ఆడించే సమయంలో కొంత వ్యవధి తీసుకోవడంతో చాలా శక్తి ఆదా అవడమే కాక ఎగిరే సమయంలో అవి ఎక్కువ ఆక్సిజన్‌ను తీసుకోవడం వలన తక్కువ అలసట చెందుతాయి.
పావురాల వలన శ్వాసకోశ వ్యాధులు
ఒక పావురం సంవత్సరానికి 12 కిలోల మలాన్ని ఉత్పత్తి చేయగలదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పావురాల విసర్జన ఆమ్ల స్వభావం కలిగి ఉండటంతో పాటు ఇవి సాల్మొనెల్లా క్రిములను కూడా వ్యాపింప చేస్తాయి. క్లామిడియోసిస్, హిస్టోప్లాస్మోసిస్, యెర్సినియో సిస్, సాల్మొనెలోసిస్, టాక్సోప్లాస్మోసిస్, క్షయ వ్యాధితో సహా ప్రాణాంతకమైన వ్యాధులను పావురాలు ప్రసారం చేస్తాయి. వారి మలంలో తరచుగా ఫంగల్ వ్యాధి క్రిప్టోకో కోసిస్ ఉంటుంది, ఇది ముఖ్యంగా బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులకు ప్రమాదకరం. పావు రాలు దాదాపు విశ్వవ్యాప్తంగా ఒక విసుగుగా మరియు పట్టణ తెగులుగా పరిగణించబడుతున్నాయి. ఆరోగ్య నిపు ణుల అభిప్రాయం ప్రకారం, పావురం రెట్టలు, ఈకలు శ్వాసకోశ వ్యాధులకు, గాలి ద్వారా సంభవించే వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు ప్రధాన హేతువులు. ఫైబ్రోటిక్ ఊపిరితి త్తుల వ్యాధి, ఉదాహరణకు, హైపర్సెన్సిటివిటీ న్యుమో నైటిస్ లేదా బర్డ్ బ్రీడర్స్ ఊపిరితిత్తుల వ్యాధి పావురం రెట్టల వల్ల వస్తుంది. పావురాల రెట్టలు ఎండిపోయి దుమ్ముగా మారినప్పుడు అవి సులభంగా వాతావరణంలో కలిసిపోయి మనుషులు గాలి పీల్చినప్పుడు వారి ఊపిరితి త్తులకు చేరుకుంటాయి. అత్యధిక నష్టం ప్రధానంగా హిస్టో ప్లాస్మా క్యాప్సులాటం అనే ఫంగస్ ఉనికి నుండి పుడు తుంది, ఇది సాధారణంగా పావురం రెట్టలలో కనిపిస్తుంది. హిస్టోప్లాస్మా క్యాప్సులాటం హిస్టోప్లాస్మోసిస్ అని పిలువ బడే ఊపిరితిత్తుల సంక్రమణకు కారణమవుతుంది. ఈ ఫంగస్ యొక్క బీజాంశాలను పీల్చినప్పుడు, అవి ఊపిరితి త్తులకు చేరుకొని తాపజనక ప్రతిచర్యను కలిగిస్తాయి. చాలా సందర్భాలలో, హిస్టోప్లాస్మోసిస్ తేలికపాటి ఫ్లూ లాంటి లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థలు లేదా అధిక మోతాదులో బీజాంశాలకు గురయ్యే వ్యక్తులలో, సంక్రమణ తీవ్రమవడంతో పాటు శరీరం అంతటా వ్యాపిస్తుంది. ఆస్థమా రోగగ్రస్తులకు కూడా పావురాలు అత్యంత ప్రమాదకరంగా పరిణమి స్తాయి. పావురాల జనాభా గణనీయంగా వృద్ధి చెందుతుం డటంతో సాధారణ పిచ్చుకల లాంటి ఎన్నో పక్షులు పర్యావరణంలో కనుమరుగవుతున్నాయి. పావురాలు రెట్ట ల వలన భవనాలు, స్మారక చిహ్నాల సౌందర్యం దెబ్బ తినడమే కాక ఆ ప్రాంతంలో పరిశుభ్రమైన గాలిపై ప్రతి కూల ప్రభావం కలిగిస్తుంది.
దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా, హైదరాబాద్, బెంగళూరు, పూణే లాంటి జన సమ్మర్ధమైన నగరాలలో పావురాల వల్ల ఊపిరితిత్తుల వ్యా ధి కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ సమస్య నుండి గట్టెక్కడానికి పావురాల పెంపకానికి దూరంగా ఉండాలంటున్నారు వైద్యులు. బర్డ్ బ్రీడర్ లేదా పావురాల పెంపకందారులు ప్రత్యక్షంగా వాటి ద్వారా గాలిలో వ్యాపించే ఏవియన్ యాంటిజెన్‌ల కారణంగా ఊపిరి తిత్తుల వ్యాధికి గురి అవుతుండగా, వాటి మలవిసర్జన కార ణంగా వాయు కాలుష్యం ఏర్పడడంతో పాటు వాటి రెట్టల నుండి ఉత్పన్నమయ్యే వివిధ రకాల ఫంగస్‌లు సామాన్య ప్రజలను తాము పీల్చే గాలి ద్వారా ఊపిరితిత్తుల వ్యా ధులు, దగ్గు, ఆస్థమాలకు గురిచేస్తున్నాయి. ప్రతి యేటా అమెరికాలో ప్రతి లక్ష మందిలో 6 నుండి 21 వేల మంది పావురాల పెంపకందారులు వాటి వలన ఏర్పడే శ్వాసకోశ సంబంధిత వ్యాధిగ్రస్తులవుతున్నట్లు అధ్యయనాల ద్వారా వెల్లడి అయినప్పటికీ భారత దేశానికి సంబంధించి ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులో లేవని డాక్టర్ వడ్డేపల్లి ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్.కామ్‌కు ఇచ్చిన ఇంట ర్వ్యూలో అన్నారు. సీటీ ఛాతీ, పీఈటీ కొన్ని రోగనిరోధక పరీక్షల వంటి పరిశోధనలతో పాటు ఒక వ్యక్తి పావురా లతో సాన్నిహిత్యంగా గడిపే అవకాశాలు సహా వివరణా త్మక క్లినికల్ చరిత్ర ఆధారంగా కూడా రోగనిర్ధారణ ఆధా రపడి ఉంటుందని డాక్టర్ వడ్డేపల్లి సూచించారు. వ్యాధి నుండి రోగిని కాపాడడానికి ప్రారంభ రోగ నిర్ధారణ చాలా ముఖ్యమని, సరైన సమయంలో చికిత్స చేయకపోతే కోలు కోలేని ఊపిరితిత్తుల నష్టం, శ్వాసకోశ లోపాలతో పాటు మరణానికి కూడా దారితీయవచ్చన్నది ఆయన అభిప్రాయం.
వ్యాధి లక్షణాలు
ప్రజల్లో విస్తృతంగా అవగాహన లేకపోవడం వల్ల మానవులలో హైపర్‌సెన్సిటివిటీ న్యుమోనైటిస్, ఇతర ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా నమోదవుతున్నాయని పలువురు పల్మోనాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా పావురాలు లేదా వాటి రెట్టల వద్ద సన్నిహి తంగా గడిపే వారిపై దీర్ఘకాలంలో ప్రభావం చూపుతుం దని అంటున్నారు. ఈ అలెర్జీతో జ్వరం, దగ్గు, కీళ్ల నొప్పు లు, శ్వాస ఆడకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. పావురాల మూత్రం, మలం కలిపి ఒకేసారి విసర్జిస్తాయి. ఇది ప్రమాదకరం. రెట్ట ఎండిపోయాక అది కణాలుగా విడిపోయి గాలిలో కలిసి పోతాయి. అవి పావురాలకు గింజలు వేసేందుకు వెళ్లిన వారికి శ్వాస ద్వారా ఊపిరితి త్తుల్లో చేరి అలెర్జీకి, ఇన్ఫెక్షన్‌కు కారణం అవుతుంది. అది ముదిరి ఊపిరితిట్టులపై ప్రభావం చూపిస్తాయి. పావురా లకు ఆహారం ఇవ్వడం మానేయడం, అవి ఉన్న చోటికి వెళ్ల కుండా ఉండటం ఉత్తమ చికిత్స అని వైద్యులు చెబుతు న్నారు. ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు నగరాలలో పావురాల కారణంగా ఆందోళనకరమైన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి.
నివారణోపాయాలు
పావురాలు దాల్చినచెక్క లేదా వేడి మిరియాల రసం వంటి బలమైన వాసనలను ఇష్టపడవు. మీరు పావురం కాలనీలో నివసించే, గూడు కట్టుకునే ప్రాంతాలకు సురక్షి తంగా చేరుకోగలిగితే, పక్షులను తరిమికొట్టడానికి మీరు ఈ పదార్ధాలను పిచికారీ చేయవచ్చు, పూయవచ్చు. పావు రాలు అత్యంత సాధారణంగా ద్వేషించే రంగులు తెలుపు, ఎరుపు, నీలం, లోహ రంగులు. ఈ రంగులను వాడడం ద్వారా పావురాలను దూరంగా ఉంచవచ్చు. బహుళ అంత స్తుల భవనాలు అపార్ట్మెంట్స్ ఎక్కువగా ఉండే నగర పట్టణ ప్రాంతాలలోని బాల్కనీలలో పావురాలు సాధారణంగా వస్తుంటాయి. వీటి రాకను అరికట్టడానికి వైర్ కాయిల్ లేదా స్టెయిన్‌లెస్-స్టీల్ వైర్‌ను, మార్కెట్లో పక్షులను బాల్క నీల నుండి దూరంగా ఉంచడానికి అందుబాటులో ఉండే ‘షాక్ ట్రాక్’ వ్యవస్థ, తాళ్ళతో వల ఏర్పాటుచేయడం, పక్షులను బెదరగొట్టే ప్రత్యెక ధ్వనుల ఏర్పాటు, మిరుమిట్లు గొలిపే ప్రతిబింబాలు, ప్లాస్టిక్ గుడ్లగూబ లేదా రబ్బరు పాము లాంటి వాటిని వుపయోగించి పావురాల సమస్య నుండి బయట పడవచ్చు. ఇవే కాకుండా అల్త్రాసోనిక్ ధ్వనులు, కృత్రిమంగా గద్దలు, గుడ్లగూబల శబ్దాలను చేయడం ద్వారా పావురాల బెడదను అరికట్టవచ్చు. అయి తే పావురాల బెడదను తప్పించుకునే విషయంలో భార తీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 428, సెక్షన్ 429 ప్రకారం పావురాలకు రక్షణ ఉందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి.
పెంపుడు జంతువుల విషయంలో జాగ్రత్త
సాధారణంగా ప్రతి ఒక్కరి ఇళ్లల్లో పెంపుడు జంతు వులు ఉండడం ఈ రోజులలో సర్వసాధారణం. పెంపుడు జంతువులుగా చాలా మంది కుక్కలు, పిల్లులు, కొన్ని రకాల పక్షులను పెంచుకుంటూ ఉంటారు. అయితే ఎలాం టి వాటిని పెంచుకున్నా పర్లేదు కానీ పావురాలను పెంచు కునే విషయంలో మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచిం చాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పావురాలు విసర్జించే మలం ద్వారా దాదాపు 60 రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. పరాన్నజీవులైన పావురాలు వాటి రెట్టల్లో పేలు, ఈగలను మోసుకుపోతాయని, వాటి ద్వారా వ్యాధులను వ్యాప్తి చేస్తాయని పావురాల ద్వారా సంక్రమించే వ్యాధులపై అధ్యయనం జరుపుతున్న పరిశోధకులు పేర్కొంటున్నారు. పావురాల వంటి పక్షులు యూరికోటెలిక్ అయినందున యూరియా,అమ్మోనియాకు బదులుగా యూరిక్ యాసిడ్ రూపంలో నత్రజని వ్యర్థాలను విసర్జిస్తాయి. పక్షులకు మూత్రాశయం లేనందున, యూరిక్ యాసిడ్ వాటి మలం తో పాటు విసర్జిస్తాయి. దీని వల్ల శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రళయతాండవం తరు వాత ఇప్పుడిప్పుడే ప్రజారోగ్యం కాస్త కుదుటబడుతున్న ఈ తరుణంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి పావురాల పెంపకం విషయమై పక్షిప్రియులు పునరాలోచించాల్సిన విషయం ఆసన్నమైంది.
-యేచన్ చంద్ర శేఖర్
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్ స్కౌట్స్, గైడ్స్, తెలంగాణ
8885050822
9866656907
Pigeons causing diseases: శాంతి కపోతాలా? యమపాశాలా?
క్లామిడియోసిస్, హిస్టోప్లాస్మోసిస్, యెర్సినియో సిస్, సాల్మొనెలోసిస్, టాక్సోప్లాస్మోసిస్, క్షయ వ్యాధితో సహా ప్రాణాంతకమైన వ్యాధులను పావురాల వల్ల వ్యాపిస్తాయి