Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్Poverty and childhood: పేదరికం కౌగిట్లో ప్రపంచ బాలలు

Poverty and childhood: పేదరికం కౌగిట్లో ప్రపంచ బాలలు

ఆన్‌లైన్‌ బోధనలో టీచర్స్‌ పర్యవేక్షణ లేకపోవడం వల్ల ప్రతి 10 మందిలో, 8 మంది బాలలు ఏమి నేర్చుకోలేదు

నేటి బాలలే రేపటి పౌరులు, బాలలు జాతీయ సంపద, భవిష్యత్తు మానవ వనరులు. వారి శ్రేయస్సు దేశాభివృద్ధికి మూలం అందుకే ‘నేటి బాలలే రేపటి పౌరులు’ అన్నారు పెద్దలు. బాలల సంక్షేమం అభివృద్ధిపై పెట్టుబడి దేశాభివృద్ధికి సూచిక. బాల్యాన్ని ఆనందంగా అనుభవించడం ప్రతిబిడ్డ జన్మ హక్కు. సమా జంలో మంచి పౌరులుగా ఎదగాలంటే బాల్యదశ కీలక మైంది. పిల్లల మనసులు చాలా సున్నితమైనవి బాల్యదశలో వారు ఎదురుకున్న ఇబ్బందులు కష్టాలు వారి భవిష్యత్తు జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయని మానసిక శాస్త్రవేత్తలు తమ అధ్యయనాల్లో పేర్కోన్నారు. ఇంటిలో బడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు పెరగడానికి కావలసిన పరిస్థితులు కలిపించి వనరులు సమకూర్చవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద సమాజం మీద వుంటుంది.
బాలలు కరోనా ప్రభావం
కరోనా మహమ్మారి విజృంభణ వల్ల, ప్రపంచ ఆర్థిక ‘వ్యవస్థ విద్యా వ్యవస్థ తీవ్ర ప్రభావానికి గురైంది. మూత బడిన స్కూల్స్‌ ఊడిన ఉద్యోగాలు’ ‘స్తంభించిన ప్రజాజీ వనం’ మూతబడిన పరిశ్రమలు ‘పెరిగిన నిరుద్యోగం’ తగ్గిన ఆదాయం పిల్లల జీవితాలను ప్రభావితం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది బాలలు మధ్య తరగతి పేద వర్గాలకు చెందిన బాలలు కనీస సౌకర్యాలు లేక ప్రాథ మిక అవసరాలు తీర్చుకోలేని కటిన దారిద్య్రంలోకి నెట్టి వేయబడ్డారనీ ఇటీవల ‘యూనిసెఫ్‌’ నివేదిక పేర్కొంది.
యూనిసెఫ్‌ నివేదిక బాలల స్థితి
‘యూనిసెఫ్‌’ అధ్యయనం ప్రకారం కోవిడ్‌ కారణాన అభివృధి చెందిన అభివృధి చెందుతున్న దేశాల్లో బాలలకు కావలసిన విద్యా ‘వైద్య ఆరోగ్య’ గృహ వసతి ‘పోషకా హారం పారిశుద్ధ్యం’ తాగు నీరు అందుబాటులో లేని బాలల సంఖ్య 125 కోట్లు వుండగ వీరికి అదనంగ మరో15 కోట్ల మంది చేరారని ఈ పరిస్థితులు పేదరికం పెరగడానికి దారితీసింది. ‘ప్రపంచ బాంక్‌ యూనిసెఫ్‌’ నివేదిక ప్రకారం భారత దేశంలో 30 శాతం పైగా కఠిన పేదరికంలో బాలలు వున్నారని తేలింది. ప్రపంచ వ్యాప్తం గా జరిగిన గణనీయమైన అభివృద్ధి వల్ల పేదరికం తగ్గిన ప్పటికీ దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్న కుటుంబాలలో బాలలు పేదరికాన్ని అనుభవిస్తుండం శోచనీయం. ప్రపం చ బ్యాంకు నివేదిక ప్రకారం ప్రపంచ దేశాలలో 1981 సంవత్సరంలో వున్న పేదలు 2010సంవత్సరం నాటికి పేదలుగానే వున్నారని తేలింది. పేదరికములో జీవిస్తున్న బాలల సంఖ్య మారలేదని ‘ప్రపంచ బ్యాంకు అధ్యక్షులు జిమ్‌ యాంగ్‌ కింగ్‌’ అన్నారు. పేదరికం నిరుద్యోగం బాల కార్మికల సంఖ్యపెరగడానికి దోహదపడిందని ప్రపంచ బ్యాంకు ‘ఆర్థిక వేత్త కౌశిక్‌ బసు’ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే 30 శాతం పైగా అత్యంత పేదరికంలో నివసించే బాలలు భారత దేశములో ఉండడం గమనార్హం.
‘ఎండింగ్‌ ఎక్స్ట్రీమ్‌ పావర్టీ ఫోకస్‌ ఆన్‌ చిల్డ్రన్‌’ నివేదిక ప్రకారం పేదరికంలో నివసించే పెద్దల కంటే బాలలు రెం డు రెట్లు ఎక్కువ వుండే అవకాశం ఉందని తేలింది. జనా భాలో 3.వ వంతు ఉన్న బాలల్లో అందులో సగం మంది పేదరికంలో వున్నట్లు పలు అధ్యయనాలు తెలుపు తున్నాయి. 2013 నాటికి అభివృధి చెందుతున్న దేశాలలో తలసరి ఆదాయం 1.90 డాలర్లు సంపాదిస్తున్న కుటుంబా లలో19.5 శాతం బాలలు పేదరికంలో వున్నట్లు తేలింది.7 దశబ్దాల స్వాతంత్ర భారత్‌ సాధించిన అభివృధి పథకాల ఫలితాలు భారత దేశములో గ్రామీణ ప్రాంతాలలో ఎస్సీ ఎస్టీ పేద బడుగు బలహీన వర్గాలకు అందక పోవటం వల్ల ఈ వర్గాల్లో 80 శాతం బాలలు పేదరికాన్ని అనుభవిస్తు న్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో 5 యేళ్ల లోపు బాలల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు అత్యంత పేదరిక కుటుంబాలలో నివసిస్తున్నారు.
కరోనా మహమ్మారి పేద మధ్య, అల్ప ఆదాయ దేశాల మీద ఎక్కువ ప్రభావం చూయించింది. ప్రపంచ దేశాలతో పాటు బాలల జనాభా ఎక్కువ ఉన్న దేశాలలో వర్ధమాన దేశాలు భారత దేశం బాలల అభివృద్ధి సంక్షేమ పట్ల ప్రతేక శ్రద్ధ పెట్టాలి.
కరోనా బాలల భద్రత
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విసిరిన పంజాకు సామాజిక, ఆర్థిక, విద్య, వైద్య రంగాలు కుదే లైనాయి. పరిశ్రమలు మూతపడ్డాయి ఉద్యోగం లేక అనేక కుటుంబాల ఆదాయాలు తగ్గాయి.ఈ ప్రభావం బాలల మీద పడింది. విద్య, వైద్య, ఆరోగ్య సౌకర్యాలు ప్రాథమిక అవసరాలు తీర్చుకోలేని స్థితిలో బాలలు కూరుకు పోవటం వల్ల వారి శారీరక మానసిక వికాసం కుంటుపడింది.
కరోనా వల్ల బాలల్లో లింగపరమైన అసమానతలు విద్యా పరమైన అంతరాలు పెరిగాయి. బాలల జీవనంపై కరోనా మహమ్మారి ప్రభావంపై ఇటీవల సేవ్‌ ది చిల్డ్రన్‌ అనే సంస్థ ప్రతేక అధ్యయనాలు చేసింది. కరోనా వల్ల 93 శాతం కుటుంబాలు సగానికి పైగా ఆదాయం కోల్పోవడంతో ఆరోగ్య సేవలు పొందలేదని 62 శాతం కుటుం బాలు బాలలకు పౌష్టికాహారం అందించలేక పోయాయని 37.శాతం పేద కుటుంబాల బాలలు చదువు కోవడానికి అభ్యసన పరికరాలను కొనలేక పోయారని సర్వేలో తేలింది. కరోనా ‘లాక్‌డౌన్‌ ’వల్ల స్కూల్స్‌ మూతబడ్డాయి. ఆన్‌లైన్‌ బోధన వల్ల టీచర్స్‌ పర్యవేక్షణ లేకపోవడం వల్ల ప్రతి 10 మందిలో, 8 మంది బాలలు ఏమి నేర్చుకోలేదని గృహ హింస పెరిగిందని బాలికలపై ఇంటి పని పిల్లల సంరక్షణ భారం ఒత్తిడి పెరిగి మానసిక ఆరోగ్యం దెబ్బతిని ప్రతికూల భావనలు పెరిగాయని సర్వే పేర్కొంది. విద్యా రంగములో అత్యవసర పరిస్థితిని పాటించడం వల్ల ఈ సంవత్సరం దాదాపు కోటి మంది పిల్లలు స్కూల్స్‌ కు తిరిగి రాక పోవచ్చును అన్న అంచనాలు విద్యావేత్తల్లో తీవ్ర ఆం దోళన కలిగిస్తుంది. ప్రపంచ బ్యాంక్‌ అంచనాల ప్రకారం భారత దేశములో కరోనా మహమ్మారి ప్రభావం వల్ల1.2 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన చేరే అవకాశం వుం దనీ పేర్కోవడం బాలల భద్రతకు పెను సవాలుగా పరిణమించింది.
ప్రభుత్వాలు బాలల అభివృద్ధి
బాలల సర్వతోముఖ అభివృద్ధి కొరకు ప్రభుత్వాలు సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికలను అమలు చెయ్యాలి. బాలల కనీస అవసరాలు తీర్చి వారి వికాసానికి కృషి చేయ డం ప్రభుత్వాల బాధ్యత ఐక్యరాజ్య సమితి బాలల హక్కు ల రక్షణ కోసం 1989 నాటి అంతర్జాతీయ ఒడంబికను ప్రపంచ దేశాలు క్షేతరస్థాయిలో పటిష్టంగా అమలు చెయ్యాలి. స్త్రీ శిశు సంక్షేమానికి ప్రాధాన్యత కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు గర్భిణీ స్త్రీల ఆరోగ్య సంరక్షణ మతా శిశు సంక్షేమ పథకాలు ఇమ్మునైజెషన్‌ పరిశుభ్రమైన నీరు పౌష్ఠి కాహార పంపిణీ ప్రాథమిక.వసతులు ఏర్పాటు చెయ్యాలి. ప్రభుత్వాలు పేదవర్గాలకు సామాజిక రక్షణ పథ కాలు చెయ్యాలి. పేద కుటుంబాలకు నేరుగా నగదు బదిలీ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చెయ్యాలి. పేద వర్గాలకు ఉచిత విద్య, వైద్యం తాగునీటి సౌక ర్యం గృహవసతి ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతులు మెరుగు పరచాలి. అవస్థాపన పెట్టుబడులు పెంచాలి. కరువులు అంటువ్యాధుల నివారణ ఆర్థిక అస్థిరత అరికట్టాలి సుస్తిరాభివృద్ధికి దారితీసే అభివృధి కార్యాచరణ కు పూనుకోవాలి. బాలల సర్వతోమఖాభివృద్ధి లక్ష్యంగ ప్రయోజన కరమైన ఆర్థికవృద్ధిని పెంచే బహుముఖ ‘అభి వృద్ధి వ్యూహాన్ని’ అమలు చెయ్యాలి.
2010 నుండి అమలు అవుతున్న ప్రాథమిక నిర్భంధ విద్యా హక్కును అమలు చేయడంలో ప్రభుత్వ యంత్రాం గం ముఖ్య పాత్ర పోషించాలి. గ్రామీణ ప్రాంతాలలో నగరాలలో ‘మురికి వాడల్లో’ నివసించే పేదలను అక్షరా స్యులను చెయ్యాలి. పేదల కుటుంబాల ఆర్థిక స్థితిని మెరు గు పరచాలి. ఉపాధి అవకాశాల కల్పన విస్త రణ పేదరిక నిర్మూలన ఉత్పత్తి ఉత్పాదకత పెంపు ఆదాయ సృష్టి ఆదా య పంపిణీ ఏకకాలములో జరిగే విధంగా ప్రభుత్వాల పాలన యంత్రాంగం చర్యలు చేపట్టాలి.
మనదేశంలో ప్రభుత్వం పేదరికం నిరుద్యోగం ‘ఆర్థిక’ అసమానతల ఆకలి చావులు లింగ వివక్ష సమస్యల పరిష్కారానికి కృషి చెయ్యాలి ఆరో గ్య భీమా పెన్షన్‌ సౌకర్యాలు కల్పించాలి. బాలల్లో పౌష్ఠికా హారం కొరతను అధిగమించేందుకు మధ్యాన్న భోజనం ఉచిత ఆరోగ్య సంరక్షణ పరీక్షలు ‘విటమిన్‌ టాబ్లెట్స్‌’ ఉచి తంగా అందించాలి. బాలల హక్కుల రక్షణలో పౌరసమా జం స్వచ్ఛంద సంస్థలు క్రియాశీలక పాత్ర పోషించాలి.
రాజ్యాంగం బాలల హక్కుల రక్షణ
మహిళా శిశు సంక్షేమ శాఖ కార్మిక మంత్రిత్వ శాఖ సమిష్టిగా బాలల అభివృధి సంక్షేమ చట్టాలను పథకాలను ప్రజల్లోకి తీసుకవెళ్ళాలి పేద వర్గాల ప్రజలను సామాజిక ఆర్థిక అభివృధి ప్రణాళికలో భాగస్వాములను చెయ్యాలి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్‌ 23 ప్రకారం అన్ని రకాల బలవంతపు వెట్టి చాకిరీ ప్రమాదకరమైన గనుల్లో పనుల్లో బాలల చేత పని చేయించడం నిషేధాన్ని అమలు చేసి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 39 ప్రకారం బాలలకు స్వే చ్ఛ గౌరవం ఆహ్లాదకరమైన వాతావరణంలో బాలలకు ఎదిగే అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసు కోవాలి. పేదవర్గాల బాలకు ఉచితంగా డిజిటల్‌ టెక్నాలజీ పరికరాలు అందించాలి. బాలల హక్కుల సంరక్షణ చట్టాలు సమర్ధ వంతంగా అమలు చెయ్యాలి. ‘బాలల అభి వృద్ధే దేశాభివృద్ధి’ లక్ష్యంగా ప్రభుత్వాలు సమగ్రమైన అభివృద్ధి వ్యూహలతో బాలలకు బంగారు భవితను కలిపించాలి.

- Advertisement -

నేదునూరి కనకయ్య
తెలంగాణ ఎకనామిక్‌ ఫోరం అధ్యక్షుడు

  • 9440245771
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News