Sunday, May 19, 2024
Homeఓపన్ పేజ్Psychological problems: మానసిక సమస్య ఉంటే భయపడాలా ?

Psychological problems: మానసిక సమస్య ఉంటే భయపడాలా ?

ప్రతీ నలుగురిలో ఒకరికి మానసిక సమస్యలు

ప్రస్తుత యాంత్రికమైన జీవన విధానంలో మనిషి మరమనిషి గా మారాడు. అతని శక్తి యుక్తులను ఫణంగా పెట్టి విశ్రాంతి లేకుండా పని చేస్తూ కుటుంబ సభ్యులతో గడపాల్సిన సమయాన్ని, పిల్లలకు అందించాల్సిన అనురాగం ఆప్యాయతలను గాలికి ఒది లేసి ఏదో సాధిస్తానని పరుగులు తీసే వారు ఒక్కసారి ఆలోచించండీ… ఎవరి కోసం యంత్రం వలే పనిచేస్తూ సంతోషకరమైన జీవితాన్ని వదులుకుంటున్నారు. నీ వారు, నీ కుటుంబ సభ్యులు నీవు సంతోషంగా వారితో గడపాలని, ఆ మధుర క్షణాలను అను భూతి పొందాలని, జీవితాంతం నెమరువేసుకోవాలని కోరుకుంటు న్నారని గుర్తించండీ. మానసికంగా ఏర్పడే సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
మానసిక సమస్య ఉంటే భయపడాల్సిన పని లేదు
ఇటీవల సినిమాలలో, టీ.వీలలోని ధారావాహికలలో , పత్రి కలలో మానసిక సమస్యలపై వచ్చిన కథనాలతో, వ్యాసాలతో, పుస్తకాలలో చదివిన జ్ణానముతో పెద్దలు, పొరుగువారు, మిత్రులు ఒక్కరొక్కరుగా మానసిక సమస్యపై చర్చిస్తున్నారు. మానసిక సమ స్య అనగానే భయంతో, అనుమానాలతో సమస్య తీవ్రత అధికమ వుతుంది. మానసిక సమస్య ఉందని తెలిస్తే అందరూ వింతగా చూస్తారనే అపోహలను విడనాడాలి. మానసిక సమస్య ఉందని అనిపిస్తే ముందుగా పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితిలలో ఆప్తులతో మీ అనుభవాలను పంచుకోవాలి. మానసిక దైర్ఘ్యం పెంచుకోవాలి.
మానసిక సమస్య వాస్తవాలు
ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వీటివల్ల వాళ్ల కుటుంబ సభ్యులు కూడా బాధ పడుతున్నారు. ప్రతీ నలుగురిలో ఒకరు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మానసిక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. మానసిక వ్యాధుల్లో ఎక్కువ మందిలో కనిపించేది డిప్రెషన్‌, ఒత్తిడి, ఆందోళనలే. మానసిక వ్యాధులతో చాలామంది బాధపడుతున్నా వాటిని బయటకు చెప్పడం లేదు, సరైన సహాయం తీసుకోవడం లేదు, మానసిక సమస్య ఉన్న వాళ్లను చులకనగా చూస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన సర్వే ద్వారా తెలుపుతోంది.

- Advertisement -


మానసిక సమస్య అంటే……….
మానసిక సమస్య అంటే సరిగ్గా ఆలోచించలేకపోవడం, ప్రవ ర్తించలేకపోవడం, కోపం, సంతోషం, దుఃఖం లాంటివి వచ్చిన ప్పుడు విపరీతంగా ప్రవర్తించడం, ఎదుటి వాళ్లను అర్థం చేసుకోలేక పోవడం, అందరిలా ఉండలేక పోవడం, రోజువారీ పనుల్ని సరిగా చేసుకోలేకపోవడం, తొందర పడి నిర్ణయాలు సరిగా తీసుకోక పోవడం. చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించుకోలేక వాటి నే పెద్దవిగా ఊహించుకోవడం.
మానసిక సమస్య ఆలోచనలు
కొన్నిసార్లు భయం వల్ల కొన్ని పనులు ఇక చేయలేను అనిపి స్తుంది. ఇంకొన్నిసార్లు కనీసం సరిగ్గా మనసుపెట్టి చదవలేను. బాధ తీవ్రత పెరిగినప్పుడు ఎవ్వరితో కనీసం స్నేహితులతో కూడా మాట్లాడాలనిపించదు. కొంతమంది పరిస్థితులు మారతాయని, పరిస్థితులు అంత ఘోరంగా లేవని ఏదో సహాయం చేయడానికి చెబుతుంటారు. ఇంకొంత మంది జీవితంలో మంచి విషయాల గురించి మాత్రమే అలోచించమని చెబుతారు. ఇవన్ని కూడా ఎన్నోసార్లు చేసి చూసాను అయినా కాని ఎందుకూ పనికిరాననీ, ఏమీ చేయలేననీ, నాలో ఏదో తప్పుందనీ ఇంకా ఎక్కువగా ఆలో చనలూ వస్తూ ఉంటాయి.
మానసిక సమస్యలకు (వ్యాధులకు) చికిత్స

  • మానసిక సమస్యను గుర్తించడం. దగ్గరలోని కౌన్సెలర్‌ ను గాని, సైకాలజిస్ట్‌, క్లినకల్‌ సైకాలజిస్ట్‌, సైక్రియాట్రిస్ట్‌ ను సంప్ర దించి సమస్య ఉందా లేదా? ఆ సమస్య తీవ్రత ను గుర్తించాలి. మానసిక సమస్యలు ఏవి లేకపోయినా ఉన్నాయని ఊహించడం, భయపడటం కూడా సైకాలజికల్‌ డిజార్డరే.
  • కౌన్సెలర్‌, సైకాలజిస్ట్‌, సైక్రియాట్రిస్ట్‌ ఇచ్చిన సలహాలను, సూచనలను పాటించాలి. సమస్య గురించి ఏమీ దాచిపెట్టకుండా చెప్పాలి. మీ సమస్య ఏంటో, రోజూ మీకు ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో కౌన్సెలింగ్‌ ద్వారా పరిష్కారం దొరుకుతుంది
  • మానసిక సమస్య పరిష్కారం కోసం వెళ్తున్నప్పుడు మీకు ధైర్యం చెప్పే వాళ్లను తోడుగా తీసుకువెళ్లాలి. సమస్యల వల్ల వచ్చే ఇబ్బందులను మెల్లమెల్లగా పరిష్కరించు కుంటూ పరిస్థితికి తగినట్లు ఎలా మారాలో కౌన్సెలింగ్‌ ద్వారా సాధ్యమవుతుంది.
    సూచనలు సలహాలు
    ప్రతీరోజు పనుల్ని సమయానికి చేయడం అలవాటు చేసుకోవాలి. మానసిక రంగ నిపుణుల సూచనలు, సలహాలు పాటించాలి. రోజులో కనీసం 10 నిమిషాలు వ్యాయామ (ఎక్సర్‌సైజ్‌) చేయాలి. ప్రతి రోజు సరిపడినంత నిద్రపోవాలి. ప్రతీ రోజు కొంచెం సమయం సరదాగా గడపండి. కుటుంబ సభ్యులతో వారాంతాలలో కొత్త ప్రదేశాలకు వెల్లి గడపండి. ప్రతి రోజు సంతులితమైన, పౌష్టిక ఆహారం తీసుకోండి. మద్యం తాగడం తగ్గించడం చేయాలి. ఒంటరిగా ఉండకుండా మీకు ఇష్టమైన వాళ్లతో మిమ్మల్ని చూసు కునే వాళ్లతో ఉండండి. మానసిక సమస్య తీవ్రత పెరుగక ముందే కౌన్సెలింగ్‌ తీసుకోవడం మంచిది. ప్రతీది చేయలేము కానీ ప్రయత్నిస్తే కష్టంగా అనిపించే వాటిని కూడా పరిష్కరించుకోవచ్చు.
  • డాక్టర్‌ అట్ల శ్రీనివాస్‌ రెడ్డి
    సైకాలజిస్ట్‌ ఫ్యామిలీ కౌన్సెలర్‌
    9703935321
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News