కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రం ప్రారంభించి నేటికి వంద రోజు లు పూర్తవుతోంది. వంద రోజుల పాటు సుదీర్ఘంగా కాలినడకన దేశవ్యాప్త యాత్ర చేయడమంటే రాజకీయ జీవితంలో చిన్న విషయమేమీ కాదు. రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపట్టడం అటు దేశ రాజకీయాలనే కాక, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత రాజకీయాలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తోంది. పన్నెండు రాష్ట్రాలలో దేశ సమైక్యతే ప్రధాన ధ్యేయంగా జరుపుతున్న ఈ యాత్రకు ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి స్పందన లభిస్తుండడం అంత తేలికగా తీసిపారే యాల్సిన అంశం కాదు. అంతేకాదు, కాంగ్రెస్ అధికారంలో లేని రాష్ట్రాలలో కూడా ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తుండడం పార్టీని సంభ్రమా శ్చర్యాలలో ముంచెత్తుతోంది. కాంగ్రెస్ అనుకూల మేధావి వర్గం ఈ యాత్ర ఫలితాలను భూతద్దంలో చూస్తూ, గత కొద్ది కాలంగా ప్రస్తుత ప్రభుత్వ అప్రజాస్వామిక కార్యకలాపాలతో విసుగెత్తిపోయి ఉన్న ప్ర జానీకానికి రాహుల్ యాత్ర ఒక ఆశాకిరణంలా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.
రాహుల్ గాంధీ మీద ఇంతవరకూ అటు పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ ఉంటూ వచ్చిన దురభిప్రా యాలు, అపోహలు యాత్ర విజయంతో పటాపంచలవుతున్నాయని పార్టీలోని సీనియర్ నాయకులు భావిస్తున్నారు. పార్టీ పగ్గాలను తన చేతుల్లోకి తీసుకోవ డానికి విముఖత ప్రదర్శించి, అదే సమయంలో పార్టీని తెర వెనుక నుంచి నడిపించడానికి ప్రయత్నించిన రాహుల్ గాంధీ వల్ల పార్టీ బలహీనపడడంతో పాటు, పార్టీకి సరైన సారథి లేకుండా అయిపోయిందని, ఫలితంగా పార్టీ వరుస వైఫల్యాలను ఎదుర్కోవాల్సి వచ్చిం దని పార్టీ సీనియర్ నాయకులు కొందరు బహిరంగంగానే గతంలో వ్యాఖ్యలు, వ్యాఖ్యా నాలు చేశారు. అయితే, భారత్ జోడో యాత్ర సందర్భంగా రాజకీయాలకు అతీతంగా రాహుల్ వ్యవహరిస్తున్న తీరు ఆయనలోని రాజకీయ పరిపక్వతకు, నాయకత్వ లక్షణా లకు అద్దం పడుతోందని వారు అభిప్రాయపడుతున్నారు. ఎంతో నిబద్ధతతో ఈ యాత్రను నిర్వహించడం, దారి పొడవునా ప్రజల సా ధక బాధకాలను వినడం వంటివి ఆయన ఏ స్థాయిలో పరిణామం చెందుతున్నదీ చెప్పకనే చెబుతున్నా యని వారు అంటున్నారు.
వాస్తవానికి, దేశంలో రాజకీయ నాయకులు ఇటువంటి యాత్రలు చేసి, రాజకీయం గా లబ్ది పొందడం. కొత్తేమీ కాదు. రాజకీయ నాయకులు వివిధ లక్ష్యాలతో తరచూ పాద యాత్రలు చేస్తూ ఉండడం పరిపాటి. దండి యాత్ర పేరుతో మహాత్మా గాంధీ మొదటి సారిగా యాత్ర చేసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు వందలాది మంది నాయకులు తమ రాజకీయ ప్రతిష్ఠను పెంచుకోవడానికి యాత్రలు చేస్తూనే ఉన్నా రు. దండి యాత్ర జరిగిన కొన్ని దశాబ్దాల తర్వాత బీజేపీ నాయకుడు ఎల్.కె. అద్వానీ దేశవ్యాప్త రథ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇది బీజేపీకి పునర్జన్మను ఇవ్వడమే కాకుండా, హిందుత్వ సిద్ధాంతానికి 23 వజీవాలు సమకూర్చింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి రాష్ట్రవ్యాప్త పాదయాత్ర జరిపి, తిరిగి అధికారానికి రాగలిగారు. అదే విధంగా ఆయన కుమారుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర జరిపి, ప్రజాభిమానం చూరగొని అధికారం చేపట్టారు. ఈ మధ్య రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వివాదాస్పద వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా పాదయాత్ర జరిపి, తమ లక్ష్యాన్ని సాధించుకున్నారు.
అయితే, ఈ పాదయాత్రలన్నిటి వెనుకా సామాజిక, రాజకీయ లక్ష్యాలున్నా యన్న విషయాన్ని విస్మరించకూడదు. కానీ, రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్ర మాత్రం వీటన్నిటికీ కొద్ది భిన్నంగా కనిపిస్తోంది. భారత్ జోడో యాత్రలో ఆయన ఎక్కడా రాజ కీయాలను ప్రస్తావించడం లేదు. ప్రజల సమస్యలు, సాధక బాధకాలను వినడానికి మాత్రమే తన యాత్రను పరిమితం చేశారు. యాత్రంతా సాత్విక మార్గంలో సాగి పోతోందే తప్ప ఎక్కడా విప్లవాత్మక ప్రకటనలు వినిపించడం లేదు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామిక సంస్థలు, వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయని, వాటిని పునరుద్ధరించి బలోపేతం చేయ డమే కాంగ్రెస్ ధ్యేయమని ఈ యాత్ర సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు పదే పదే ప్రకటనలు జారీ చేస్తున్నారు. వీటిని పునరు ద్ధరించడమో, బలోపేతం చేయడమో రాజకీయాలకు అతీతంగా సాధించడం సాధ్యం కాని పని. రాజకీయ ప్రమేయం వీటికి తప్పనిసరి. పైగా ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడడా నికి చాలా ఏళ్ల ముందు నుంచే ప్రజాస్వామిక సంస్థలు, వ్యవస్థలను బలహీనపరచడం ప్రారంభమైపో యిందనే వాస్తవం ప్రజలందరికీ తెలిసిన విషయమే.
అంతేకాదు, సీనియర్ రాజకీయ నాయకులయి ఉండి, ప్రజల సాధక బాధకాలను, సమస్యలను కొత్త గా తెలుసుకుంటున్నామనడం సరి కాదు. దేశంలోని ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కుంటున్నార న్నది తెలియని రాజకీయ నాయకుడు ఉండరు. వీటిని పాదయాత్రల ద్వారానే తెలుసుకోవాల్సిన అవస రం లేదు. అంతేకాదు, భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ రాజకీయాలను ప్రస్తావించక పోయినా ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలను ప్రస్తావించడానికి అభ్యంతరమేమీ ఉండన క్కర లేదు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రాభవం క్షీణిస్తున్న మాట నిజం. ఇటువంటి కాంగ్రెస్కు మళ్లీ ప్రాణం పోసి, రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడానికి చేస్తున్న యాత్ర ఇది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఆ లక్ష్యానికి ఆదర్శమనే ముసుకు తొడగనక్కర లేదు. రాజకీయ లక్ష్యం లేకుండా అటు రాహుల్ గాంధీలో గానీ, ఇటు కాంగ్రెస్లో గానీ మార్పు వస్తుందని, పూర్తి పరిణామం సాధ్యమవు తుందని ఆశించలేం. పాదయాత్రతో సంబంధం లేకుండా రాహుల్ గాంధీ, కాంగ్రెస్లలో ఇతర అనేక అంశాలలో పరిపక్వత, పరిణామం చోటు చేసుకోవాల్సి ఉంది.