Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్పడకేసిన పరిశోధన

పడకేసిన పరిశోధన

ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద విద్య సంస్థలను కలిగి దేశం మనది

మనిషి మనుగడే ఓ పరిశోధన అన్నాడు ఓ మహర్షి.. అలాంటిది దేశ మనుగడను ప్రపంచ పటములో నిలపాలంటే నిఖార్సయని పరిశోధ కులు దేశానికి ఎంతో అవసరం అవ్వక తప్పదు, భారత దేశము ఇప్పుడు కొత్త దారిలో పయనిస్తుంది. అది ఇంక్యూ బేషన్‌ ఇన్నోవేషన్‌ అని వక్తలు ప్రసంఘాలు వల్లిస్తుంటే ఎక్కడ ఏ ఇన్నోవేషన్‌ ఎంత సాఫ ల్యమైందో లేక ఎన్ని రీసెర్చ్‌ సంస్థలు ప్రపంచ ర్యాంకింగ్‌ వ్యవస్థలో బరి గీసి నిలబడ్డాయో వేలు ఎత్తి చూపడం కష్టమే.
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ భారత ప్రభు త్వంలో రక్షణ శాఖకు చెందిన ప్రముఖ సంస్థ. ఇది భారత రక్షణ మంత్రిత్వ శాఖలోని రక్షణ పరిశోధన, అభివృధ్థి విభాగము పరిధిలోనిది. దేశవ్యాప్తంగా డీఆర్‌డీఓకు 51 పరిశోధనాలయాలున్నాయి. జాతీయ భద్రతకు సంబంధిం చిన వైమానిక అవసరాలు, ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్‌, మానవ వనరుల అభివృద్ధి, జీవశాస్త్రం, పదార్థశాస్త్రం, మిసై ల్‌లు, యుద్ధశకటాలు, యుద్ధనౌకలు వంటి విషయాలపై ఈ పరిశోధనాలయాలలో పరిశోధనలు జరుగుతుంటా యి. మొత్తం డీఆర్‌డీ.. సంస్థలో 5,000 పైగా సైంటిస్టులు, షుమారు 25,000 మంది సహాయక సిబ్బంది ఉన్నారని ఆ సంస్థ నివేదిక అలంటి నిగూఢమైన సంస్థలో కూడా ఓ శాస్త్రవేత్త హనీట్రాప్‌లో చిక్కుకుని దేశ భద్రతను ప్రమాదం లో నెట్టేందుకు ప్రయత్నించాడు. ముంబైలోని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగం చేస్తు న్న ఒక శాస్త్రవేత్తను పాకిస్థానీ ఏజెంట్‌తో రహస్య సమా చారాన్ని పంచుకున్నారనే ఆరోపణలపై మహారాష్ట్ర యాం టీ టెర్రరిజం సాక్వ్‌డ ఈ మధ్యనే అరెస్టు చేసింది
2022-2023 కేంద్ర బడ్జెట్లో కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు రూ.14,217 కోట్లు కేటా యించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 3.9 శాతం తక్కువ. ఇది మౌలిక వస్తువులకు కూడా సరిపోదని పరి శోధకుల మాట. ఇందులో నుండి డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (డీఎస్టీ), డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నా లజీ (డీబీటీ), డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండ స్ట్రియల్‌ రీసెర్చ్‌ (డీఎస్‌ఐఆర్‌)లకు వరుసగా రూ.6,000 కోట్లు, రూ.2,581 కోట్లు, రూ.5,636 కోట్లు ఇందులో నుండే వెచ్చిస్తున్నారు. సవరించిన అంచనాల ప్రకారం డీఎస్టీ, డీబీటీ, డీఎస్‌ఐఆర్లకు వరుసగా రూ.5,240 కోట్లు, రూ.2,961 కోట్లు, రూ.5,297 కోట్లు వచ్చాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత మంది ప్రతిభావంతులను ఆకర్షించడానికి పాఠశాల, కళాశాల విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అంతే కాకుండా పల్లె పరిశో ధనలు గుర్తించి ఆ ప్రతిభను గుర్తించి పేటెంట్స్‌ వైపు మర ల్చడం ప్రభుత్వ బాధ్యత . ప్రస్తుతం పరిశోధన కొన్ని విశ్వ విద్యాలయాలలో కేంద్రీకృతమై ఉంది. అలా కాకుండా ప్రతి స్కూల్‌ కాలేజీ విద్యాలయాలు అన్ని కూడా పరిశోధన లో భాగమైతే తప్ప సంపూర్ణమైన పరిశోధన సాధ్యమయ్యే పనికాదు అని అనుభజ్ఞుల మాట. ఆధునిక విద్య విధా నాన్ని ఇప్పటి తరానికి అనువదించి ఓ తరమే మరెలా అకాడమిక్‌ కరికలంలో మార్పులు జరగాలి.
కేంద్ర విద్యామంత్రిత్వ శాఖకు కేంద్రం రూ.10,42 77.72 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.63,449. 37 కోట్లు పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖకు, రూ.40, 828.35 కోట్లు ఉన్నత విద్యాశాఖకు అందనున్నాయి. కేంద్ర బడ్జెట్‌ లో విద్యా బడ్జెట్‌ కేవలం 2.6 శాతమేనని ప్రతి వాది గ మమతా బెనర్జీ పార్లమెంట్‌ లో గర్జించిన సందర్బని గుర్తు చేసుకోవచ్చు. కేంద్ర బడ్జెట్‌ లో కనీసం 10 శాతం, రాష్ట్ర బడ్జెట్‌లో 30 శాతం విద్యకు కేటాయించాలని గతంలో శాస్త్ర వేత్తల సమాజం ప్రభుత్వాన్ని కోరింది.
పాఠశాల స్థాయి విద్య విషయానికొస్తే, పీఎం ఇ-విద్యా పథకం కింద ‘వన్‌ క్లాస్‌-వన్‌ టీవి ఛానల్‌’ కార్య క్రమాన్ని 12 నుండి 200 టీవి ఛానెళ్లకు విస్తరిస్తామని ప్రభుత్వం తెలిపింది. పీఎం ఈ-విద్యా పథకానికి గత ఏడాది మాదిరిగానే రూ.1,00,000 కోట్లు మంజూరు చేశారు. ‘వన్‌ క్లాస్‌-వన్‌ టీవీ ఛానల్‌’ కార్యక్రమం 1 నుంచి 12 తర గతులకు సప్లిమెంటరీ బోధనను అందిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. కోవిడ్‌ కారణంగా పాఠశాలల మూసివేత గ్రామీణ పిల్లలను, ముఖ్యంగా షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర బలహీన వర్గాలను ప్రభావితం చేసిందని ఆమె అన్నారు. కానీ ఈ ఇ -క్లాస్‌ విద్యను ఒంట బట్టుచున్నవారెందరు అనే లెక్కలు లేవు. ముఖ్యంగా డిజిటల్‌ డివైడ్‌ సమస్యను భారత్‌ ఇంకా పరిష్కరించనప్పుడు విద్యను డిజిటలైజేషన్‌ చేయడాన్ని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. 2020లో మొత్తం వయోజన మహిళా జనాభాలో 25 శాతం, వయోజన పురుషులలో 41 శాతం మంది మాత్రమే స్మార్ట్‌ఫోన్స్‌ కలిగి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో అందరికి డిజిటల్‌ లిటరసీ కష్టమే.
జాతీయ పరిశోధన సంస్థ: జాతీయ పరిశోధన, అభివృద్ధి సంస్థలు / విశ్వవిద్యాలయాల నుండి వెలువడే సాంకేతికతలు / పరిజ్ఞానం / ఆవిష్కరణలు / పేటెంట్లు / ప్రక్రియలను ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం వాణి జ్యీకరించడం అనే ప్రాథమిక లక్ష్యంతో భారత ప్రభుత్వం 1953లో నేషనల్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఆర్డిసి)ను స్థాపించింది. ప్రస్తుతం సైన్స్‌ అండ్‌ టెక్నా లజీ మంత్రిత్వ శాఖకు చెందిన శాస్త్రీయ, పారిశ్రామిక పరి శోధన విభాగం పరిపాలనా నియంత్రణలో పనిచేస్తోంది. అయితే ఈ జాతీయ పరిశోధన సంస్థ అందించే పతకాలు కానీ ఆ సంస్థతో చేయగలిగిన పరిశోధనలు కానీ చాలా విద్య సంస్థలకు తెలియదు.
దేశంలో పరిశోధన వ్యవస్థను బలోపేతం చేయడానికి నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ (ఎన్‌ఆర్‌ఎఫ్‌) ఏర్పాటు చేయా లని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆర్‌ అండ్‌ డి అకాడెమి, పరిశ్రమల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు అవసరమైన సంస్థగా ఎన్‌ఆర్‌ఎఫ్‌ ప్రతిపాదించబడింది. నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ యొక్క మొత్తం ప్రతిపాదిత వ్యయం ఐదేళ్ల కాలంలో రూ .50,000 కోట్లు. విద్యా సంస్థలలో ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలలలో పరిశోధన సామర్థ్యం పెంపుతో పాటు పరిశోధనలను సుల భతరం చేయడం ఎన్‌ఆర్‌ఎఫ్‌ యొక్క ప్రధాన లక్ష్యాలలో ఒకటి. ఇది అధిక ప్రభావ, పెద్ద స్థాయి, బహుళ పరిశోధ కుడు, బహుళ సంస్థ మరియు కొన్ని సందర్భాల్లో సంబం ధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ఇతర ప్రభుత్వ, ప్రభు త్వేతర సంస్థల సహకారంతో ఇంటర్‌ డిసిప్లినరీ లేదా బహుళ దేశ ప్రాజెక్టులకు ముఖ్యంగా పరిశ్రమల్లో నిధులతో పాటు మద్దతు అందిస్తుంది.

- Advertisement -


పరిశోధన, అభివృద్ధిపై భారత్‌ చేస్తున్న వ్యయం ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది. 2022లో, భారతదేశం జిడిపిలో 0.65% పరిశోధన, అభివృద్ధి కోసం ఖర్చు చేసింది. ఇది బ్రిక్స్‌ దేశాల కంటే తక్కువ, ప్రపంచ సగటు 1.8% కంటే చాలా తక్కువ. ఈ సవాళ్లను ఎన్‌ఆర్‌ఎఫ్‌ పరిష్కరిస్తుందని భావిస్తున్నారు.
ఆజాదికా అమృత మహాహోత్సవ్‌ జి 20-వేదికల ద్వారా ఎన్నో హకతన్‌లు ఇన్నోవేటివ్‌ ఐడియా ఛాలెంజ్‌ కాంఫరెన్సులు జరుగుతున్నా ఎన్ని ప్రొడకట్స్‌ కామర్శియ లీజషన్‌కి వచ్చాయి అనేది ప్రస్నార్దకామే. సైన్స్‌ ఇంజ నీరింగ్‌ గ్రాడ్యుయేట్ల యొక్క నాణ్యమైన భారీ సమూహం, ప్రయోగశాలలు పరిశోధనా సంస్థల యొక్క పెద్ద నెట్వర్క్‌, శాస్త్రీయ పరిశోధన యొక్క కొన్ని ఫ్రంట్‌ లైన్‌ రంగాలలో చురుకైన ప్రమేయం లేని కారణంగా లోతైన శాస్త్రీయ సామ ర్థ్యాలు కలిగిన ప్రముఖ దేశాలతో పోలిస్తే భారతదేశాన్ని వెనుక వరుసలోనే చూడచ్చు. ఏదేమైనా, తులనాత్మక పరం గా, భారతదేశం అనేక దేశాల కంటే వెనుకబడి ఉండడా నికి కారణం పరిమిత వనరులు, పరిశోధన వసతుల వెసులుబాటు ఇటీవల కేబినెట్‌ ఆమోదించిన నేషనల్‌ రీసె ర్చ్‌ ఫౌండేషన్‌ (ఎన్‌ఆర్‌ఎఫ్‌) తన పరిశోధన పర్యావరణ వ్యవస్థను క్రమబద్ధీకరించే ప్రయత్నాలలో కీలకమైన దశగా పయనిస్తుంది . నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ యుఎస్‌ఎ నుండి వచ్చిన డేటా ప్రకారం, శాస్త్రీయ ప్రచురణలతో పాటు పీహెచ్‌డీ విద్యార్థుల సంఖ్యలో భారతదేశం ప్రపంచంలో 3వ స్థానంలో ఉందట ఆదర్శవంతమైన సృజనాత్మకతో కూడిన ప్రభుత్వం లేదా పరిశ్రమ నిధులతో పరిశోధనతో ప్రారంభమవుతుంది, కానీ స్పష్టమైన సమస్య ప్రకటనతో సామాన్య సమాజ సమస్యలను తీర్చే పరిశోధనలేవీ, వారు సరైన పరిష్కారాన్ని కనుగొన్నప్పుడు, ఆలోచనను పేటెంట్‌ గ మార్చే మార్గాలేవి నాలుగు లక్షలకు పైగా స్వయం సహాయ సమూహాల (ఎస్‌హెచ్‌జిస్‌)కు దాదాపుగా 1625 కోట్ల రూపాయల మేరకు మూలధనీకరణకు సంబంధిం చిన తోడ్పాటు నిధులను కూడా ప్రధాన మంత్రి విడుదల చేశారు. దీనికి అదనంగా, ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రి త్వ శాఖ కు చెందిన పిఎమ్‌ఎఫ్‌ఎమ్‌ఇ పథకం లో భాగం గా ఉన్న 7500 ఎస్‌హెచ్‌జి సభ్యులకు సీడ్‌ మనీ రూపం లో 25 కోట్ల రూపాయలను, మిషన్‌లో ప్రోత్సాహాన్ని అం దిస్తున్న 75 ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేశన్స్‌ (ఎఫ్‌ పిఒస్‌) కు నిధుల రూపంలో 4.13 కోట్ల రూపాయలను ఆయన విడుదల చేశారు. నిర్భర్‌ భారత్‌ సంకల్పాన్ని ఆచరణలోకి తీసుకు రావడంలో మహిళలలో నవ పారిశ్రామికత్వం తాలూకు పరిధిని పెంచడానికి, వారు ఈ ప్రక్రియలో మరింత ఎక్కువగా పాలుపంచుకోవడానికి గాను ఈ రోజున రక్షా బంధన్‌ పర్వదినాని కంటే ముందు 4 లక్షల కు ఎస్‌హెచ్‌జిలకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయాన్ని అందిం చడమైందని ప్రధాన మంత్రి అన్నారు. స్వయం సహాయ సమూహాలు, దీన్‌ దయాళ్‌ అంత్యోదయ యోజన.. ఇవి భారతదేశం గ్రామీణ ప్రాంతాలలో ఒక సరికొత్త క్రాంతిని తీసుకు వచ్చాయని ఆయన అన్నారు. ఈ మహిళా స్వయం సహాయ సమూహాల ఉద్యమం గడిచిన ఆరేడేళ్లలో బాగా విస్తరించిందని కూడా ఆయన అన్నారు. ప్రస్తుతం దేశం అంతటా 70 లక్షల స్వయం సహాయ సమూహాలు ఉన్నా యని, ఈ సంఖ్య గత 6-7 సంవత్సరాలలో ఉన్న సంఖ్య తో పోలిస్తే మూడింతలకు పైబడిందని ఆయన తెలిపారు. అయితే ఇన్ని సంస్థలు సవాళ్ల మధ్య ఈ సంస్కరణలపైనా ప్రయోగాలు చేస్తుంటే సఫలీకృమవుతున్నదేవేరు అన్నది సందేహమే ప్రతి పరిశోధన విజ్ఞాన వ్యాప్తి కోసం శాస్త్రీయ పత్రంగా ప్రచురించబడాలి, అయితే పేటెంట్లను సంస్థలు రాయల్టీ లేదా పరిశ్రమలు లేదా స్టార్టప్‌లతో లైసెన్సింగ్‌ ఒప్పందాల ద్వారా వాణిజ్యపరంగా ఉపయోగించుకుం టున్న ప్రచురణ సంస్కృతి నుంచి పరిశోధన ప్రపంచం నెమ్మదిగా పేటెంట్‌, ప్రచురణ, అభివృద్ధి సంస్కృతి వైపు అడుగులు వేయాలన్నది ఆలోచన.
వచ్చే దశాబ్ద కాలంలో దేశీయ ఔషధ పరిశ్రమకు బయో సిమిలర్ల తయారీ పెద్ద అవకాశం కాగలదని చెబు తున్నారు. పెద్ద, పెద్ద కంపెనీలు బయోఫార్మసీ విభాగంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తు న్నాయి. భవిష్యత్తులో ఔషధ పరిశ్రమలో డిజిటల్‌ ట్రాన్స్‌ ఫర్మేషన్‌ వేగం పుంజుకోనుందని.. పరిశోధన, అభివృద్ధిలో రోబోటిక్స్‌, డేటా ఎనలిటిక్స్‌ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించి ఔషధ వినియోగాన్ని, చికిత్స నాణ్యతను పెంచడానికి ఔషద కంపెనీలు కృషి చేయను న్నాయని హైదరాబాద్‌కు చెందిన కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల్లో కృత్రిమ మేధ, మెషిన్‌లెర్నింగ్‌ వంటి టెక్నాలజీలు ఔషధ అభివృద్ధి సమయాన్ని తగ్గించి త్వరగా మార్కెట్‌లోకి తీసుకువచ్చేం దుకు దోహదం చేయనున్నాయి. ఈ రంగంలో ప్రభుత్వ ప్రోత్సహము ఎంతో అవసరము.
లెక్కకు మించి ప్రభుత్వ ప్రైవేట్‌ విద్య సంస్థలతో ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద విద్య సంస్థలను కలిగి ఉన్న దేశం మనది విద్య పరిశోధన రానగలు విస్తరిస్తున్న నాణ్యమైన విద్య ఉపయోగపడే పరిశోధనల్లో మన దేశం వెనుకబడే ఉంది. శాస్త్రీయ పరిశోధనకు విజ్ఞాన సృష్టికి ప్రోత్సాహకాలు అందిచడములో లోపమే దీనికి కారణ మూ ఈ లోపాన్ని సరిదిద్దడములో కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు కలిసి నడిస్తే తప్ప సమగ్ర పరిసోధన సాధ్యం కాద ని శాస్త్రవేత్తల మాట 51,000కు పైగా సంస్థలు, విశ్వ విద్యాలయాలతో భారతదేశ ఉన్నత విద్యారంగం ప్రపం చంలోనే అతిపెద్దది. పరిశోధకులకు రివార్డులు లేకపోవ డం భారతీయ సంస్థల పేలవమైన పరిశోధన పనితీరుకు ప్రధాన కారణం. ప్రచురణలు పెరిగినప్పటికీ, ప్రతి డాక్యు మెంటుకు ప్రచురణ హక్కులు సంపాదించుకోవటంలో సూచించిన విధంగా తక్కువ ప్రభావం భారతీయ పరిశో ధనా పత్రాలలో నాణ్యత లోపాన్ని సూచిస్తుంది.
డాక్టర్‌ కృష్ణ సామల్ల
ప్రొఫెసర్‌ & ఫ్రీ లాన్స్‌ జర్నలిస్ట్‌

  • 9705890045
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News