Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Rise in rape cases: హద్దులు మీరుతున్న అత్యాచారాలు

Rise in rape cases: హద్దులు మీరుతున్న అత్యాచారాలు

నిర్భయ కేసు తర్వాత అత్యాచారాల నిరోధానికి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. అత్యాచారానికి ఒడి గట్టినవారికి కఠిన శిక్షలు విధించడానికి అవకాశం కల్పించే విధంగా అనేక రాష్ట్రాలు కూడా ఎన్నో చర్య లు తీసుకున్నాయి. 2012 డిసెంబర్‌ 16న ఢిల్లీ బస్సులో ఒక యువతిపై సామూహిక అత్యాచారం సం ఘటన తర్వాత దేశవ్యాప్తంగా కొత్త చట్టాలు, కొత్త శిక్షలు, కొత్త పోలీస్‌ స్టేషన్లు వెల్లువెత్తే సరికి, ఇక నుం చి దేశంలో అత్యాచారాలకు ఆస్కారం లేదని, కనీసం ఇటువంటివి గణనీయంగా తగ్గిపోతాయని అంతా భావించారు. ఇది జరిగి ఒక దశాబ్దం కావస్తోంది. ఈ దశాబ్ద కాలంలో అత్యాచారాల పరిస్థితి ఏ స్థాయిలో ఉందని సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. నిర్భయ అత్యాచారం జరిగిన ఏడాది లోపే అత్యాచార నిరోధక చట్టాలను సవరించడం జరిగింది. లైంగిక దాడికి సంబంధించిన నిర్వచనాన్ని విస్తరించారు. అ త్యాచారాల కేసుల్లో నిందితులకు వేసే శిక్షలను మరింత కఠిన తరం చేశారు. ‘రెండు వేళ్ల పరీక్ష’ అశాస్త్రీ యంగా ఉందని దాన్ని తొలగించారు. పోలీస్‌ స్టేషన్లలో ఎటువంటి ఆలస్యాలు, బాదరబందీలు లేకుండా నేరాలను నమోదు చేయడానికి అవకాశం కల్పించారు. కాగితాల మీద అయితే, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి.
పదేళ్ల తర్వాత ఈ పరిస్థితిని సమీక్ష చేసినప్పుడు ఒళ్లు గగుర్పొడిచే విషయాలెన్నో బయటపడ్డాయి. నిర్భయ కేసు తర్వాత అత్యాచారాలకు సంబంధించిన కేసుల సంఖ్య రెట్టింపయింది!. ఇటువంటి కేసు లు బాగా తగ్గిపోతాయని భావించినవారికి ఇది అశనిపాతమే అవుతుందనడంలో సందేహం లేదు. నేషన ల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో అందజేసిన వివరాల ప్రకారం, 2021 ఈ కేసుల సంఖ్య 4,28,278కి పెరిగిపో యింది. 2012లో ఈ కేసుల సంఖ్య 2,44,270 మాత్రమే. ఇవి అధికారిక సంఖ్యలనే విషయం మరచి పోకూడదు. అనధికారికంగా ఈ సంఖ్య ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందనడంలో సందేహం లేదు. అత్యాచారం జరిగినప్పుడు ఎక్కువ సందర్భాలలో బాధితులు గానీ, బాధితుల కుటుంబాలు గానీ పోలీసు లకు ఫిర్యాదు చేయడం అనేది చాలా తక్కువ. అందరూ చులకనగా చూస్తారనో, బయటికి చెప్పుకుంటే సిగ్గు చేటనో, నేరస్థులను చూసి భయపడో, తమను సమాజం అంటరానివారిగా చూస్తుందనో, పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లినా, కోర్టుకు వెళ్లినా కేసు తేలి, నిందితులకు శిక్ష పడడానికి, తమకు న్యాయం జరగడానికి ఏళ్లూ పూళ్లూ పడుతుందనో ఇటువంటి కేసులు ఫిర్యాదుల వరకూ వెళ్లవు.
విచిత్రమేమిటంటే, 2012లో నిర్భయ కేసు జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ‘నిర్భయ నిధి’ పేరుతో ఒక సహాయ నిధిని ఏర్పాటు చేసింది. కోర్టుకు వెళ్లే బాధితులకు న్యాయ సహాయం అందించడం దీని ప్రధాన లక్ష్యం. అయితే, ఈ నిధిని 30 శాతానికి మించి ఎవరూ ఉపయోగించుకోలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. మహారాష్ట్రలో అయితే, శాసనసభ్యుల భద్రతకు ఈ నిధిని వినియోగించారు. 2021 వర కూ కూడా శిక్షల సంఖ్య 28 శాతాన్ని మించలేదు. అంటే, మొత్తం కేసుల్లో 28 శాతం కేసులను కూడా విచారించడం జరగలేదు. సంస్థాగతంగా ఉన్న లోపాలు, దర్యాప్తు జరపడంలోని లోపాలు, ప్రాసిక్యూషన్‌ బలహీనతలు వంటివి ఇందుకు కారణాలు. సంస్థాగత వైఫల్యాలని చెప్పడమంటే, ఈ కేసుల విచారణ లో తిరోగమనమే ఎక్కువగా ఉన్నట్టు లెక్క. అత్యాచారం జరిపిన వ్యక్తినే వివాహం చేసుకోమని బలవం తం పెట్టడం ఒక ఎత్తయితే, రాజకీయ నాయకులు కల్పించుకుని, రాజీ కుదర్చడం, పరిహారం ఇప్పించ డం, ఏదో విధంగా కేసులు మాఫీ చేయించడం మరో ఎత్తు. ప్రభుత్వం మీద బాగా ఒత్తిడి వచ్చే పక్షం లో అక్కడక్కడా ఎన్‌ కౌంటర్లు కూడా జరిగాయి.
ఇళ్లలోనే ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్నాయని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో వెల్లడించింది కానీ, చట్టాలు ఈ విషయంలో ఎక్కువగా మౌనంగానే ఉంటున్నాయి. భర్తలే ఇంట్లో అత్యాచారాలకు పా ల్పడుతున్నట్టు న్యాయస్థానాల దృష్టికి వచ్చినా, వాటి విషయంలో కోర్టులు, చట్టాలు చేయగలిగింది ఏమీ లేదని అర్థమవుతోంది. వైవాహిక సంబంధమైన అత్యాచారానికి చట్టాల్లో స్థానం లేదు. మహిళల భద్రత రాను రానూ తీసికట్టుగా ఉంటోందని కూడా ఇది రుజువు చేస్తోంది. 2015 నుంచి 2020 మధ్య దళిత మహిళలు, బాలికల మీద అత్యాచారాలు 45 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. కుల నిబంధనలను ఉల్లం ఘించినందుకు వారిపై ఇటువంటి అత్యాచారాలు జరుగుతుంటాయని పోలీసులు భోగట్టా. ఇప్పుడు సాన మూహిక అత్యాచారమనేది కొత్త ధోరణి అని క్రైమ్‌ బ్యూరో తెలిపింది. ఈ పదేళ్ల కాలంలో అనేక మా ర్పులు చేర్పులు చోటు చేసుకున్న మాట నిజమే కానీ, ఆ మార్పు మరింత దయనీయ స్థితికి చేరుకుంది.
-జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News