Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Great Purge: ప్రపంచ కమ్యూనిస్టు చరిత్రలో స్టాలిన్ ప్రస్థానం

Great Purge: ప్రపంచ కమ్యూనిస్టు చరిత్రలో స్టాలిన్ ప్రస్థానం

సూపర్ పవర్ ఆర్థిక వ్యవస్థగా రష్యాని తీర్చిదిద్దాడు

రష్యాలో కమ్యూనిస్టు విప్లవజ్వాలని రగిలించి, రష్యన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం చేసిన విప్లవ యోధుడు. మార్క్ లిస్ట్ సిద్ధాంతాలను అధ్యయనం చేసి రష్యాలో సామ్యవాద సిద్ధాంతాన్ని అమలుపరచిన అపారమైన పరిపాలన అనుభవజ్ఞుడు స్టాలిన్. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థకి ప్రవేటికరణకి స్వస్తి చెప్పి కమ్యూనిజం స్వామివాదం సిద్ధాంతాలకు పునాదులేసినటువంటి పరిపాలకుడు స్టాలిన్.
జోసెఫ్ విస్సారియోనోవిచ్ స్టాలిన్ 1878 సంవత్సరంలో జార్జియాలోని గోరి లో ఒక పేద కుటుంబంలో జన్మించాడు. తల్లి ప్రోత్సాహంతో అతను ఒక సెమినార్లో క్రిస్టియన్ ఆధ్యాత్మిక విద్యను చదువుకున్నప్పటికీ అతనికి మతానికి సంబంధించిన విద్య ఇష్టం లేకపోతే 1899వ సంవత్సరంలో సెమినార్ నుంచి బయటకు వచ్చి కార్లు మార్క్స్ బుక్స్ ని బాగా చదివి సామ్యవాద భావాలను వృద్ధి చేసుకొని రష్యన్ సోషలిస్టు ఉద్యమంలో భాగస్తుడయ్యాడు. 1905లో స్టాలిన్ మొదటిసారిగా రష్యన్ జార్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధంలో పాల్గొన్నారు. 1906 కెటేవాన్ స్వానిజే యువతని వివాహం చేసుకున్నప్పటికీ ఆమె మరణానంతరము 1907 నుంచి స్టాలిన్ పూర్తి జీవితాన్ని రష్యా విప్లవానికి రష్యాని పరిపాలించడానికి అంకితం రష్యన్ సివిల్ వార్ స్టాలిన్ నేతృత్వంలో రష్యన్ కమ్యూనిస్టు విప్లవం విజయవంతమై రష్యా మొదటి ప్రపంచ యుద్ధం నుంచి తప్పుకొని రష్యా ఆర్థిక ఎదుగుదలకు బాటలు వేసిన లెనిన్ బాటలోనే నడిచాడు స్టాలిన్.లెనిన్ మరణం తరువాత, స్టాలిన్ తన ప్రత్యర్థులను ఓడించి సోవియట్ కమ్యూనిస్టు పార్టీ యొక్క నాయకుడిగా అవతరించాడు. అతను వేగవంతమైన పారిశ్రామికీకరణ మరియు సమిష్టికరణ కార్యక్రమాలను ప్రారంభించాడు, దీని ఫలితంగా లక్షలాది మంది ప్రజల మరణం సంభవించింది. అతను రాజకీయ అణచివేతలను కూడా ప్రారంభించాడు, దీనిలో లక్షలాది మంది ప్రజలు శిబిరాలకు పంపబడ్డారుకొంతమంది కాల్చివేయబడ్డారు. 1924 రష్యా అధ్యక్షుడిగా పదవి చేపట్టిన తర్వాత మార్క్స్టి సిద్ధాంతాన్ని బలంగా ప్రచారం చేశారు. సోవియట్ యూనియన్ ని బలంగా చేయడమే తన లక్ష్యం అని భావించాడు. స్టాలిన్ ఒక సంక్లిష్టమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ఒకవైపు రష్యన్ అభివృద్ధికై పంచవర్ష ప్రణాళికలను అమలుచేసి రష్యాని వ్యవసాయపరంగా పారిశ్రామిక పరంగా అభివృద్ధి చెందటానికి కావలసిన బాటలు వేశాడు. రష్యాలో ఉన్న భూమి మొత్తాన్ని సమీకరించి సమిష్టి వ్యవసాయాన్ని ప్రోత్సహించాడు. అనేక పరిశ్రమలను స్థాపించి బొగ్గు ఇంధనం స్టీలు ఉత్పత్తులను పెంచి రష్యాన్ని అత్యంత వేగంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేశాడు. 1930 వ సంవత్సరంలో పరిపాలనాపరమైన విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ రష్యా అభివృద్ధిలో స్టాలిన్ తనదైన చరిత్ర సృష్టించాడు 1940 కాలంలో ప్రపంచం మొత్తం ఆహార ఉత్పత్తిలో 40% సోవిత్రస్య భాగస్వామ్యం అంటే రష్యాని వ్యవసాయపరంగా ఏమేరకు అభివృద్ధి చేశారు స్టాలిన్ పరిపాలనబట్టి అర్థం అవుతుంది. 1939-45 మధ్యకాలంలో జరిగిన రెండో ప్రపంచ యుద్ధాన్ని విజయవంతంగా ఎదుర్కోవటంలో స్టాలిన్ ప్రముఖ పాత్ర వహించారు నాటి నాజీ సైన్యాన్ని ఎదుర్కొని నాజీలో రష్యన్ పంట భూములు మీద చేసిన విధ్వంసక దాడులను తిప్పికొట్టి రష్యా పంట భూములను పరిరక్షించుటలో ప్రముఖ పాత్ర వహించాడు స్టాలిన్. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలోనే ఒక సూపర్ పవర్ ఆర్థిక వ్యవస్థగా రష్యాని తీర్చిదిద్దాడు స్టాలిన్. 1945 నుంచి 1991 వరకు నాలుగు దశాబ్దాలుగా రష్యా ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా సూపర్ పవర్ ఉన్న స్వామివాద దేశంగా ప్రపంచంలో నిలబడిందంటే అందుకు పునాదులు వేసింది స్టాలిన్ అని చెప్పుటలో ఎలాంటి సందేహము లేదు.
స్టాలిన్ సోవియట్ యూనియన్ ను ఒక వ్యవసాయ సమాజం నుండి ఒక శక్తివంతమైన పారిశ్రామిక శక్తిగా మార్చడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు. అతను రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాల విజయానికి కూడా కీలక పాత్ర పోషించాడు. అయితే, అతని పాలన భయానకమైన హింస మరియు అణచివేతలతో ముడిపడి ఉంది.వివాదంస్టాలిన్ చరిత్రలో అత్యంత వివాదాస్పద వ్యక్తులలో ఒకడు. అతని పాలన యొక్క హింస మరియు అణచివేతలను చాలా మంది ఖండిస్తున్నారు. అయితే, ఇతరులు అతన్ని సోవియట్ యూనియన్ ను ఒక ఆధునిక శక్తిగా మార్చడంలో ఒక ముఖ్యమైన నాయకుడిగా చూస్తారు.స్టాలిన్ 20వ శతాబ్దంలో ఒక ముఖ్యమైన వ్యక్తి. అతను సోవియట్ యూనియన్ మరియు ప్రపంచంలో శాశ్విత సామ్యవాద దేశంగా రష్యాని తీర్చిదిద్దరు స్టాలిన్ చిరస్మరణీయుడు. నేటికీ రష్యా పెట్టుబడి దారి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ అభివృద్ధి పథంలో నడుస్తుంది అంటే దీనికి కారణం స్టాలిన్ చేసిన పరిపాలనాపరమైన విధానాలు రష్యాతో పాటు అనేక ప్రపంచ దేశాలు గుర్తించటం రష్యాన్ సామ్యవాదానికి కమ్యూనిజానికి కార్లు మార్క్స్ సిద్ధాంతాలకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఒక సోషలిస్ట్ శక్తి స్టాలిన్.

- Advertisement -

కవి సాహితీ విశ్లేషకులు
పూసపాటి వేదాద్రి
9912197694 మార్చి 5 స్టాలిన్ వర్ధంతి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News