Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Sanskrit: సంస్కృతం దేవభాషా?

Sanskrit: సంస్కృతం దేవభాషా?

అతి పురాతన భాష అయినటువంటి సంస్కృతం దేవ భాష అనే అభిప్రాయం చాలా ఏళ్లుగా భారతీయుల మనసుల్లో వేళ్లు పాతుకుపోయి ఉంది. ఈ అభిప్రాయం కారణంగా ఈ భాష పామరులకు దూరమై, కేవలం పండితులకే పరిమితం అయింది. అయితే, చారిత్రక పరిశోధకులు, భాషా శాస్త్రవేత్తలు ఈ భాష పూర్వాపరాలను లోతుగా అధ్యయనం చేసి, ప్రపంచంలో ఏ భాషా దేవ భాష కాదని, ప్రతి భాషా మాతృ భాషేనని తేల్చి చెప్పారు. ‘మానవ భాషలు, దేవ భాషలని రెండు రకాల భాషలుండవు. ఉన్నవన్నీ మాతృ భాషలే అని వారు కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, మాతృ భాషలన్నీ దేవ భాష లేనని కూడా నొక్కి చెప్పారు. సంస్కృతమంటే సంస్కరించిన భాష అని అర్థమే తప్ప, దీనికీ, దైవత్వాని కీ ఎటువంటి సంబంధమూ లేదని భాషా శాస్త్రవేత్తలు నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు.
దేవుడున్నాడా అనే చర్యలాంటిదే సంస్కృత భాష దేవ భాషేనా అనే చర్చ కూడా. కాగా, ఈ భాష దే వ భాషా, కాదా అన్నది తేల్చడానికి అమెరికాలో ఇటీవల ఒక కొత్త భాషా విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ అంశం మీద జరిగే అధ్యయనానికి ‘బయో లోగోస్‌’ అని పేరు పెట్టారు. సంస్కృతంతో సహా ప్రపం చ భాషల్లో ఏ భాషా దేవ భాష కాదనీ, దేవుడి భాష పూర్తిగా ఇందుకు భిన్నమైందనీ, అయితే గియితే దేవుడి భాషంటూ లభ్యమైతే దాన్ని డీకోడ్‌ చేయాల్సిన అవసరం ఉందనీ, అమెరికాకు చెందిన ఒక ప్ర సిద్ధ భాషా శాస్త్రవేత్త ఈ బయోలోగోస్‌ సంస్థ సమావేశంలో వాదించారు. నిజానికి ఫ్రాన్సిస్‌ కోలిన్స్‌ అనే ఈ భాషా శాస్త్రవేత్త జన్యు శాస్త్ర నిపుణుడు కూడా. మన నమ్మకాల్లో శాస్త్రీయత’ అనే పేరుతో ఒక పరి శోధన గ్రంథాన్ని కూడా ఆయన రచించారు.
దేవుడికి అర్థమయ్యే భాష
ఇంతకూ ఏది దేవ భాష? దేవుడి భాష భిన్నంగా ఉంటుందా? మనం మాట్లాడే భాష దేవుడికి అర్థం కా దా? ఆయన సంస్కృతం మాట్లాడితేనే అర్ధం చేసుకుంటాడా? ఇవన్నీ ఆలోచించాల్సిన, అధ్యయనం చేయాల్సిన ప్రశ్నలే. దేవుడికి ప్రత్యేకంగా భాషంటూ ఏమీ లేదనేది చాలామంది అభిప్రాయం. ప్రపంచ భాషల్లో ఏ భాషలో మాట్లాడినా దేవుడు అర్థం చేసుకుంటాడని ఆస్తికులు కూడా వాదిస్తుంటారు. జోరా స్టరునీ, క్రీస్తునీ, అల్లానీ, బుద్ధుడినీ, పలువరు హిందూ దేవతా మూర్తులనీ ప్రపంచవ్యాప్తంగా అంద రూ పూజిస్తుంటారు. ఆరాధిస్తుంటారు. తమదైన మార్గాలలో కొలుస్తుంటారు. ఎవరు ఏ భాషలో మా ట్లాడినా దేవుడు స్పందిస్తాడనే అంతా నమ్ముతారు. దేవుడి మీద భక్తికి, భక్తుడి మీద దేవుడి అనుగ్రహా నికి భాష అనేది అడ్డంకి కానే కాదు. ఏ వ్యక్తి ఎక్కడివాడైనప్పటికీ, ’దేవుడా నన్ను అనుగ్రహించు’ అని మాతృ భాషలోనే కోరుకుంటాడు. ఇందుకు విరుద్ధంగా దేవుడు ఆయా దేశాల్లోని పురాతన భాషల్లోనే మాట్లాడుతాడు, మాతృ భాషలో మాట్లాడడం వల్ల ఉపయోగం లేదని అనుకోకూడదు. దేవ భాష అని ఒక భాష మీద ముద్ర వేసి, మాతృభాషలను కించపరచడం మంచిది కాదని బయోలోగోస్‌ సంస్థ భా విస్తోంది.
ఒక భాషా జాతీయుల సంస్కృతి వారి భాషను బట్టి, అక్కడి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు జీవన స్థితిగతులు, వాతావరణం వగైరాలను బట్టి, అక్కడి పాలనా విధానాలను బట్టి ఏర్పడుతుంది. వీటన్నిటినీ దిగుమతి చేసుకోలేం. ముఖ్యంగా వాతావరణాన్ని దిగుమతి చేసుకోవడమనేది అసాధ్యం. వీటివల్లే పదాలు పుట్టుకు వస్తాయి. వీటివల్లే భాష రూపుదిద్దుకుంటుంది. పరిపుష్టం అవుతుంది. అం దువల్ల ఒక భాషను దేవ భాషగా భావించి, ప్రత్యేకంగా చూడలేం. సంస్కృత భాషలోని పదాల కారణ ౦గా ద్రావిడ భాషలు అభివృద్ధి చెందిన విషయాన్ని కాదనలేం. కానీ, ద్రావిడ భాషల్లోని పదాలు కూడా సంస్కృతంలోకి వెళ్లాయని భాషా శాస్త్రవేత్తలు, చరిత్ర పరిశోధకులు నిరూపించిన విషయాన్ని కూడా కా దనలేం. యూరోపియన్‌ భాషలకు చెందిన సుమారు 350 పదాలు రుగ్వేదంలో కనిపించాయని ఎఫ్‌. బి.జె. క్వీపర్‌ అనే పరిశోధకుడు కనుగొన్నాడు.
ఇక రుగ్వేద కాలంలోనే భారతదేశంలో ద్రావిడ భాషలున్నట్టు చరిత్రకారులు నిరూపించారు. అంటు ద్రావిడ భాషల్లోంచి కూడా కొన్ని పదాలను సంస్కృతం తీసుకుందనడానికి కూడా ఆధారాలు ఉన్నాయి. నిజానికి, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ జి.వి. పూర్ణచందు అన్నట్టు, ఏది దేవ భాష అనే ప్ర శ్నకు ఒక్కటే సమాధానం ఉంది. కష్టం కలిగినప్పుడు మనసు ఏ భాషలో రోదించి సహాయం అర్ధిస్తుం దో, సంతోషం కలిగినప్పుడు మనసు ఏ భాషలో సంతృప్తి వెళ్లబుచ్చుకుంటుందో, భావోద్వేగం కలిగిన ప్పుడు మనసు ఏ భాషలో ఆరాటపడుతుందో అదే దేవ భాష! అదే మన భాష.
– జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News