అమ్మ క్యాంటీన్ అమ్మ రేషన్ అమ్మ ఇడ్లీ అమ్మ పెరుగన్నం అమ్మ సాంబార్ అన్నం అమ్మ స్టాల్స్ అమ్మ ఫార్మసీ అమ్మ నీళ్లు అమ్మ బేబీ కిడ్స్ అమ్మ లాప్టాప్స్ అమ్మ బ్రాండ్ స్టాల్స్ అమ్మ సిమెంట్స్ అమ్మ కళ్యాణ మండపం అమ్మ స్కూల్ బ్యాగ్స్ ఇందు కలదు అందులేదని సందేహము వలదు తమిళనాడులో కూడా అమ్మే కలదు. అమ్మ ఆ పదం తమిళ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే పదమే జయలలిత. ఆమె చిరునవ్వు కోట్లాది మందికి ఓదార్పు తన చల్లని చూపులు తమిళ ప్రజలకు కొండంత ధైర్యం. ఎన్నో అవమానాలను ఆశీర్వాదంగా భావించి జీవితంలో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని, సినిమా రంగ కథానాయక దగ్గర నుంచి తమిళనాడు రాజకీయ నాయకురాలుగా ఎదిగారు అమ్మ జయలలిత. తమిళ్ సినిమా కళామతల్లి ముద్దుబిడ్డ తమిళ్ ప్రజల కంచంలో అన్నమయ్యేంతవరకు ఎన్నో కష్టాలను కడగండ్లను ఎదుర్కొని కోట్లాదిమంది తమిళ ప్రజల హృదయాలలో కొలువుతీరిన దేవత తమిళ రాజకీయ రణరంగంలో శివంగిలాగా ఇరుసుకుపడి మూడు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని ప్రజల సంక్షేమ కెరటమై ఎగసేపటి పేద ప్రజల క్షేమానికై అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తమిళ ప్రజల హృదయాలలో అఖండ జ్యోతిగా వెలుగుతున్న అమ్మ జీవిత ప్రస్థానం. 1948 ఫిబ్రవరి 24న మైసూర్ లో జన్మించింది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన జయలలిత తల్లి చాటు బిడ్డగా పెరిగి సినిమా రంగంలో ప్రవేశించి 1961 నుంచి 1980 వరకు దాదాపుగా తెలుగు తమిళ్ కన్నడ భాషలలో 140 చిత్రాలకు పైగా నటించిన ప్రేక్షకులను మెప్పించింది. 1965లో కథానాయకుని కథ మనసులు మమతలు 19605లో కన్నెపిల్ల 66 లో గూడాచారి 116 గోపాలుడు భూపాలుడు 1967లో చిక్కడు దొరకడు బ్రహ్మచారి సుఖదుఃఖాలు సినిమాల్లో నటించారు 1969లో శ్రీరామ కథ ఆదర్శ కుటుంబం కదలడు వదలడు కొండవీటి సింహం 1970లో కోటీశ్వరులు 1972లో భార్యాబిడ్డలు డాక్టర్ బాబు 1980లో నాయకుడు వినాయకుడు మొదలైన చలనచిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన పాత్రను చెరిగిపోని చలనచిత్ర పాత్రలు ఎన్నో పోషించి తదుపరి జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసింది అమ్మ జయలలిత.ఈమె, 1982లో రాజకీయాలలోకి ప్రవేశించి, చివరి శ్వాస వరకు తన జీవితాన్ని ప్రజ సేవకే అంకితం చేసింది.1982లో ఎం.జి.రామచంద్రన్ (ఎం.జి.ఆర్) స్థాపించిన అన్నా డీఎంకే పార్టీలో చేరారు.ఎం.జి.ఆర్ మరణానంతరం 1989లో పార్టీ నాయకురాలిగా ఎన్నికయ్యారు. 1991, 2001, 2011, 2016 ఎన్నికలలో తమిళనాడు ముఖ్యమంత్రిగా గెలిచారు.2016 లో మరణించే సమయానికి ఆమె ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. 1989 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలు, 1991 నాటి రాజీవ్ గాంధీతో కలిసి కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదిరించుకొని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి 164 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని తమిళనాడుముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1998లో భారతీయ జనతా పార్టీ వాజ్పేయితో కలిసి 18 లోక్సభ స్థానాలను గెలుచుకొని కేంద్రంలో బిజెపి ప్రభుత్వ ఆవిర్భావానికి పూనుకున్నారు. 2001 మే నెలలో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో 132 స్థానాలను గెలుచుకొని మరొకసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. 2011 ఏప్రిల్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 150 స్థానాలను గెలుచుకొని ప్రజాసేవలో మరింత ప్రభావితంగా భాగస్తులయ్యారు. 2014 లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ పొత్తుతో 37 లోక సభ స్థానాలను తెలుసుకొని మూడవ అతిపెద్ద పక్షంగా అవతరించింది. 2016 శాసనసభ ఎన్నికలలో 134 స్థానాల్లో విజయం సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు 2016 సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికలలో 13 రాజ్యసభ సీట్లు 37 లోక్సభ సీట్లతో మొత్తం 50 మంది తమిళనాడు పార్లమెంట్ సభ్యులుగా ఉండటం జయలలిత రాజకీయ ప్రతిభకు గర్వకారణం.
జయలలిత పాలన యొక్క ప్రధాన విజయాలు:
గ్రామీణాభివృద్ధి ‘గ్రామ సుధారణ పథకం’ ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు.మహిళా సాధికారత ‘పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ‘మహిళావిద్య’ఉచిత ల్యాప్‌టాప్ పథకం’ ద్వారా విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందించారు.ఆరోగ్యం ‘అమ్మ మెడికల్ స్కీమ్’ ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యం అందించారు.
జయలలిత వివాదాలు
అవినీతి ఆరోపణలు అధికార దుర్వినియోగంనియంత పాలన పేరుతో 2014 సెప్టెంబర్ 27న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టై 2015 మే 11న నిర్దోషిగా విడుదలై మే 23న సీఎం గా తన పదవి బాధ్యతలను చేపట్టారు.జయలలిత వారసత్వం.తమిళనాడు రాజకీయాలలో ఒక శక్తివంతమైన మహిళా నాయకురాలిగా గుర్తింపు పొందారు. దీనికి గల కారణము తన రాజకీయ గురువు తత్వవేత్త తన అభిమాన హీరో సహనటుడు అయినా ఎం జి.ఆర్ ప్రోత్సహంగా తను ఎప్పుడు చెబుతుండేది. ఎంజీఆర్ పేద ప్రజల ఆశయ సాధనలో స్థాపించిన ఆల్ ఇండియా అన్న ద్రావిడ మున్నేట్ర కజగం పార్టీ కార్యదర్శులు నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగి అన్న దొరై ఆశయ సాధన తో పేద ప్రజలకు ఉపయోగపడే పరిపాలన చేశారు. పేదలు, గ్రామీణ ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా మేలు చేశారు.తమిళనాడు అభివృద్ధికి తనదైన కృషి చేశారు.జయలలిత ఒక సంక్లిష్టమైన వ్యక్తి, ఒకేసారి ప్రశంసలు, విమర్శలకు గురైంది. అయినప్పటికీ, తమిళనాడు రాజకీయాలలో ఒక శక్తివంతమైన శక్తిగా ఆమె చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. తమిళనాడులో ఏ అసెంబ్లీలో అయితే తన చేరకొంగును లాగి చెప్పులను వేసి అవమానించారో అదే అసెంబ్లీలో ఘనవిజయం సాధించి ప్రజలను మెప్పించి ప్రజాక్షేమమే తన సంక్షేమంగా భావించి అత్యంత శక్తివంతమైన బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తమిళ ప్రజల హృదయాలలో స్థిరస్థాయిగా నిలిచిపోయిన అమ్మ జయలలిత పురచ్చి తలైవి (విప్లవనాయకురాలుగా) తమిళ ప్రజలు తెలుసుకోవడం ఆమె యొక్క రాజకీయ చైతన్యానికి ధీరత్వానికి చిహ్నం. ఆమె యొక్క సినిమా కళ నైపుణ్యానికి గాను 1972 సంవత్సరంలో తమిళనాడు ప్రభుత్వము “కళ్లైమామణ్ “బిరుదుతో సత్కరించింది. అయినప్పటికీ ఆమె జీవితంలో బిరుదులు అవమానాలు రెండిటిని సమానంగా స్వీకరించి ఆ మధ్యేయము ఆశయము మొత్తము తమిళనాడు అభివృద్ధి తమిళ ప్రజల జీవితాలలో వెలుగులను నింపేందుకై తన చివర ప్రాణం వదిలేంతవరకు అంటే 2016 డిసెంబర్ 5 అర్థరాత్రి 11 గంటల వరకు కూడా ప్రజాసేవకై తన శ్వాస సైతం తపించింది అంటే జయలలిత నిజంగా తమిళ ప్రజల ఆరాధ్య దైవంగా నిత్యం వారి హృదయాలలో అఖండ జ్యోతిలా వెలుగొందుతూనే ఉంది. (ఫిబ్రవరి 24 జయలలిత జయంతి సందర్భంగా)
కవి సాహితీ విశ్లేషకులు
పూసపాటి వేదాద్రి
9912197694