Saturday, May 25, 2024
HomeతెలంగాణMP Ravichandra at Medaram: మేడారంలో ఎంపీ రవిచంద్ర ఫ్యామిలీ

MP Ravichandra at Medaram: మేడారంలో ఎంపీ రవిచంద్ర ఫ్యామిలీ

మేడారం శాశ్వత దాత, కమిటీ సభ్యులుగా ఉన్న ఎంపీ

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు విచ్చేసి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఎంపీ రవిచంద్ర తన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, అనుచరులు శ్రేయోభిలాషులు, అభిమానులతో కలిసి గద్దెలపై కొలువైన అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. ఎంపీ వద్దిరాజు సమ్మక్క-సారలమ్మ ఆలయం సర్వతోముఖాభివృద్ధిలో భాగస్వామ్యులై శాశ్వత దాతగా, ప్రభుత్వం ప్రకటించిన కమిటీ సభ్యులుగా అమ్మవార్ల సేవకు అంకితభావంతో ముందుకు సాగుతుండడం తెలిసిందే.

- Advertisement -

ఎంపీ వద్దిరాజు విచ్చేసిన సందర్భంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ ఛైర్మన్, సభ్యులు ఆయన, వారి కుటుంబ కుటుంబ సభ్యులకు కండువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. ఎంపీ రవిచంద్ర, వారి కుటుంబ సభ్యులు సమ్మక్క-సారలమ్మ తల్లులకు నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.

బంగారం ముద్దలను నెత్తిమీద పెట్టుకుని గద్దెల చుట్టు ప్రదక్షణ చేశారు. దేశ ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని ఎంపీ రవిచంద్ర, వారి కుటుంబ సభ్యులు అమ్మవార్లను వేడుకున్నారు. ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ, వద్దిరాజు కిషన్-శశిరేఖ, వద్దిరాజు దేవేందర్ -ఇందిరమ్మ, వద్దిరాజు వెంకటేశ్వర్లు-ఉమా మహేశ్వరి, వద్దిరాజు మోహన్-వాసవి, వద్దిరాజు పెద్ద వెంకటేశ్వర్లు,వద్దిరాజు శ్రీనివాస్ -శిల్ప, వద్దిరాజు సాయి నిఖిల్ చంద్ర-అనీల, వద్దిరాజు నాగరాజు -అర్చిత, వద్దిరాజు ప్రీతమ్, వద్దిరాజు గిరినందన్, డాక్టర్ జేఎన్ వెంకట్-సునీత, బొరిగం విజయ్-మాధవి, సుశ్రుత్,సాన్విత్, సహశ్రిక, సమర్థ్ లు అమ్మవార్లను దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు వెంట సన్నిహితులు పూల రవీందర్, సర్థార్ పుట్టం పురుషోత్తం రావు, రౌతు కనకయ్య, ఆకుల రజిత్, ఆకుతోట ఆదినారాయణ, మరికల్ పోత సుధీర్ కుమార్, నాడెం శాంతికుమార్, శీలంశెట్టి వీరభద్రం, చామకూరి వెంకటనారాయణ, జెన్నాయికోడే జగన్మోహన్, సమీప బంధువులు ఉన్నారు. కాగా, వేం యాకూబ్ రెడ్డి విందు, వద్దిరాజు శ్రీనివాస్ అమ్మవార్ల దర్శన ఏర్పాట్లను దగ్గర ఉండి పర్యవేక్షించారు.

వద్దిరాజు దంపతులకు మంత్రి నూతన వస్త్రాలు

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర-విజయలక్మీ పుణ్య దంపతులకు మంత్రి సీతక్క నూతన వస్త్రాలు బహుకరించారు. సమ్మక్క-సారలమ్మ ఆలయ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ శాశ్వత దాతగా, ప్రభుత్వం నియమించిన ఆలయ కమిటీ సభ్యులుగా ఉన్న ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు మహాజాతరకు విచ్చేసిన సందర్భంగా మంత్రి సీతక్క వారికి ఆత్మీయ స్వాగతం పలికి నూతన వస్త్రాలు బహుకరించారు. ఎంపీ రవిచంద్ర ఆలయ సమీపాన ఉన్న వాచ్ టవర్ పైనుంచి జాతరకు విచ్చేసిన భక్తకోటిని పరిశీలించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News