Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Telugu literature: మానవీయ పంటలకు రాబడి బాట మధుపాళీ… కవనం

Telugu literature: మానవీయ పంటలకు రాబడి బాట మధుపాళీ… కవనం

కలం విలువ అందరికంటే ఎక్కువగా ముందుగా ఒక అధ్యాపకుడీకే తెలుస్తుంది

అంతర్జాల మానవ యాంత్రిక యుగంలో మనిషి ఊహలు, ఆలోచన విధానం రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతున్న నేటి కాలంలో నిర్మా ణాత్మక విజయతీరం కోసం మనిషి కృషి చేయకుండా తన జీవన చదరంగంలో చేస్తున్న తప్పిదాలైన.. మసకబారు తున్న మానవీయ విలువలు, యువతలో ఆత్మవిశ్వాసం లోపించటం లాంటి విషయాలకు పరిష్కార దిశగా డాక్టర్‌ బుర్ర మధుసూదన్‌ రెడ్డి కవనం ప్రత్యేకంగా కొనసాగు తుందని చెప్పవచ్చు.
‘మధుపాళీ‘ కలం పేరుతో రచనలు కొనసాగిస్తున్న మధుసూదన్‌ సాహితీ ప్రపంచానికి, పాఠక లోకానికి పత్రి కా ముఖంగా తన రచనలతో సేవలు అందిస్తున్నారు. కరీం నగర్‌ వాస్తవ్యులైన లయన్‌ కెప్టెన్‌ డాక్టర్‌ బుర్ర మధు సూదన్‌ రెడ్డిరసాయన శాస్త్ర ఆచార్యుడుగా మూడున్నర దశాబ్దాలు, ఎన్సిసి అధికారిగా రెండు దశాబ్దాలు, పాఠ్య పుస్తక రచయితగా మూడు దశాబ్దాలు, ప్రధానాచారిగా ఐదు సంవత్సరాలు ఇలా సుదీర్ఘ అనుభవాలతో మరెన్నో కావ్యాలను రచించి సాహితీ లోకంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. తను ఇటీవలే వెలువరించిన మధుపాళీ మధు క(వితా)వనం లోని కవనాలను పరిశీలిస్తే….
పెకిలిన కలం గళం కవితలో….
అక్షరాభ్యాసంతో ఆరంభమై
అంతిమ ఘడియల దాకా
విజ్ఞాన వికాస సిరా ఊట బాయి
అంగి జేబుకే అంగమైన కలం!
(కలం విలువ అందరికంటే ఎక్కువగా ముందుగా ఒక అధ్యాపకుడీకే తెలుస్తుంది. అనీ చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ అధ్యాపకుడే కవి అయితే విజ్ఞానం అంటే ఏమిటో చెప్పాకమానడు )
మానవీయ పంటలు కవితలో….
బంధాలు బంధనాలై..
-బంధుత్వాలు దూర భారాలై..
స్నేహాలు ఎండమావిలో బింధువులై…
బిడ్డలు ఆస్తిపాస్తులకే వారసులై.. అమ్మనాన్నలు అవస రాన్ని తీర్చే బొమ్మలై…
బూటకమైంది నరుడి గరళ రుధిర నరం !
(మానవ బంధాలను ఒక కోణం లో పరిశీలిస్తే…..
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నారో తత్త్వవేత్త. అంటే అనుబంధాల కంటే ఆర్థిక పరమైన అంశా లకే ఎక్కువ విలువిస్తారన్నది దాని అర్థం. డబ్బు ఒక్కోసారి జీవితాలనే ప్రభావితం చేస్తుంటుంది
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే మాట మరోసారి గుర్తు చేస్తుంది. ఈ కవనం )
స్మార్ట్‌ మాయలోడు..! కవితలో
శరీరంలో మరో అంగమై..
జేబులో దర్జాగా దూరేసి..
పుస్తకానికి చెదలు పట్టించేసి..
ఉత్తరాన్ని పొట్టన పెట్టుకొంది సెల్లు !
(ఇప్పటి ప్రపంచంలో ఏది లేకున్నా నడుస్తుంది కానీ చరవాణి లేకుంటే మరి ఊహించుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి తెలుస్తుంది. ఒకవైపు చేతి రాతను కూడా కను మరుగయ్యేట్లు చేస్తుంది. డిజిటల్‌ ప్రభావం మానవ జీవి తంలలో ముఖ్యంగా చరవాణి ఓ ప్రత్యేకతను లాభలతో పాటు సోమరి తనాన్ని కూడా అంతే మొత్తంగా అంది స్తున్న మాయ లోకం అన్నట్లు గా ఆధునిక సాంకేతికత ప్రభావం గురించి తెలియజేసిన కవిత )
హృదయ రాగం..! కవితలో
పరిష్ట ఎముకల గూట్లో..
బహు భద్రం హృదయ గదులు
స్టెతస్కోపులకే వీనుల విందులు
విశ్రాంత లాబ్‌ డబ్‌ ల శబ్దాలు…
ఆగితేనే కదా అంతిమ యాత్రలు
(యాంత్రిక ప్రపంచంలో మనిషి తన యొక్క మను గడ కోసం పాటుపడే నడకలో భాగంగా జీవితం మీద ఉన్న తీపిని తెలియజేస్తుంది ఈ కవనం )
అక్షరమే ఆయుధం..! కవితలో
గీతల సమాహారమే కాదు అక్షరం
తలరాతలు మార్చే ఆయుధమైతది! అక్షరంలో సరస్వతిని చూస్తే..
నిన్ను నీకు పరిచయం చేస్తది!
మానవ జీవితానికి అర్ధమే కాదు పరమార్ధం కూడా ప్రసాదిస్తది !
(అక్షరం సిలువను మరోసారి తెలియజేస్తూ….. మని షి మేధస్సును ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దుటకు ఆక్షరంతో ఒక మనిషి ప్రయాణం ఉన్నత చైతన్యానికి నాంది పలుకు తుందని తెలియజేశారు.)
అమ్మ – ఆకాశమంత ప్రేమ కవితలో…
అమృతానంద పదం అమ్మ
అవిశ్రాంత శ్రమజీవి అమ్మ
త్యాగానికి ప్రతిరూపం అమ్మ
ప్రేమకు చిరునామా అమ్మ
స్పర్శకు మారు పేరేగా అమ్మ !
( సాహితీ ప్రపంచంలో అమ్మ పై కవిత రాయని కవి ఎక్కడా ఉండడు. దేవతలకు అమృతం దొరికితే వాళ్లే తాగు తారు కానీ అమ్మ నాన్నలకు దొరికితే మాత్రం మొదటగా తమ పిల్లలను త్రాగించే గొప్ప వాళ్ళు అమ్మా నాన్న ల అమృతత్వపు హృదయంలోని భావాన్ని కవి ప్రత్యేకంగా తెలపడం, ఒకరకంగా చెప్పాలంటే సాంఘిక పరంగా నేటి సాంకేతిక మానవ యుగానికి మాతృత్వం విలువలు తెలియజేసినాడు.)
మధుపాళీ… మధు క(వితా)వనం కవితా సంపుటి నందు ప్రేమంటే, గతుకుల బతుకు, అమ్మలు పునర్జన్మ లు, కార్పొరేట్‌ కాపురాలు, జీవితమే సప్తవర్ణ శోభిత హోలీ, ఆత్మ సౌందర్యం, పురపోరు, కరోనా రేఖ దాటద్దు, గ్రామ దేవత, జీవన సాఫల్యత వైపు,మానవీయ పంటలు, శాంతి ఒప్పందం, బోనమెత్తిన తెలంగాణ, గల్లీ గల్లీల బోనాలు, ధరణి ధమనులు, స్త్రీ చైతన్యం, అన్వేషణ, పండుటాకులు, గ్రామ గురుకుల గుత్తులు, మానవ జీవన వేదం, అన్వేషణ, భారత్‌ కు నీరాజనం,. ఇలా 124 కవితలతో రచించి పొం దుపరిచిన ఇట్టి కవితా సంపుటి లోని అనేక కవితా పం క్టులు హృదయాలను తాకెట్టుగా, ప్రత్యేకమైన వస్తు వైవి ధ్యంతో రచించినారు. మధుసూదన్‌ వైవిద్య భరితమైన అనుభవాల సేవలను గుర్తించి ఇందిరాగాంధీ ఉత్తమ జాతీ య సేవా పథక అవార్డు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా 2014లో అందుకున్నారు. 2000 సంవత్సరంలో ఉత్తమ అధ్యాపక అవార్డు అప్పటి ముఖ్యమంత్రి నారా చం ద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. డాక్ట ర్‌ బుర్ర మధుసూదన్‌ రెడ్డి కలం నుండి ముందు ముందు మరిన్ని సమాజ హిత రచనలు రావాలని కాంక్షిస్తూ తన సృజనాత్మక ప్రతిభకు శుభాకాంక్షలు అందజేస్తున్నాను.

- Advertisement -

-డా.చిటికెన కిరణ్‌ కుమార్‌
ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు
9490841284

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News