Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Terrorism: ఎవరికీ పట్టని ఉగ్రవాదం

Terrorism: ఎవరికీ పట్టని ఉగ్రవాదం

ఉగ్రవాదంపై పోరాటంలో ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉంది. ఉగ్రవాదం మీద పోరాడడానికి దాదాపు అగ్రరాజ్యాలన్నీ చేతులు కలుపుతున్నప్పటికీ చైనా మాత్రం ఏ దేశంతోనూ కలవకపోగా, ఈ విషయంలో తన దోవ తనదేనని వాదిస్తోంది. ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయడంపై భారతదేశం నిర్వహించిన ఒక అంతర్జాతీయ సదస్సుకు ఇతర అగ్రరాజ్యాలతో పాటు హాజరైన చైనా ఎడ్డెం అంటే తెడ్డెం అన్న ధోరణి లోనే వ్యవహరించింది. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి భారతదేశంతో సహా వివిధ దేశాలు సూచించిన పద్ద తులకు, కార్యాచరణకు మద్దతునివ్వడానికి చైనా బహిరంగంగానే ససేమిరా అంది. ముఖ్యంగా భారత్ సూచించే పద్ధతులలో ఒక్కదానితో కూడా తాము ఏకీభవించే ప్రసక్తే లేదని అది స్పష్టం చేసింది.
ఉగ్రవాదం కారణంగా అత్యధికంగా అవస్థలు పడుతున్నది భారతదేశమేనని, ఉగ్రవాదాన్ని నిరోధించడానికి తాము చేస్తున్న ప్రయత్నాలకు ప్రధానంగా నాలుగు ఆటంకాలు ఎదురవుతున్నాయని ఈ సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. మొదటగా, కొన్ని దేశాలు, ముఖ్యంగా సరిహద్దు దేశాలు ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం అందజేయడమనేది అడ్డూ ఆపూ లేకుండా కొనసాగు తోందని ఆయన వెల్లడించారు. రెండవది- లక్ష్యసాధనలో ప్రపంచ దేశాలు ఒకే తాటి మీద నడవడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మూడవది-ఉగ్రవాద వర్గాలకు ఆశ్రయమిస్తున్న దేశాలలో ఉగ్రవాదులకు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉంటున్నాయని, వారిని రాజకీయాలకు వాడుకోవడం జరుగుతోందని ఆయన తెలిపారు. నాలుగవది ఉగ్రవాదులు సైతం డ్రోన్లు, ఆధునిక టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారని ఆయన తెలియజేశారు.
ఉగ్రవాదంపై పోరాటం జరుపుతున్న దేశాలు ఈ పరిణామాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని పరిష్కారం ఆలోచించాలని ఆయన కోరారు. ఉగ్రవాదానికి ఆశ్రయం, మద్దతు ఇస్తున్న దేశాలపై సెప్టెంబర్ 9 తర్వాత విధించిన ఆర్థికపరమైన ఆంక్షలు చెల్లాచెదురైపోయాయని, ఆ ఆంక్షలను ఏ దేశమూ సీరియస్ గా తీసుకోవడం లేదని జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యులుగా ఉన్న అమెరిగా, బ్రిటన్లు 2021లో అఫ్ఘానిస్థాన్ నుంచి నిష్క్రమిస్తూ, తాలిబన్లతో చర్చలు జరపడం, వారికే అక్కడ అధికారాన్ని అప్పగించడం ఆంక్షలకు పెద్ద విఘాతమని ఆయన పేర్కొన్నా రు. ఇక పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద వర్గాలను వర్గీకరించడానికి, వాళ్లకు స్థాయిలను గుర్తించడానికి చైనా తదితర దేశాలు అంగీకరించడం లేదు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల కు పాకిస్థాన్ బహిరంగంగానే మద్దతునిస్తున్నా, తమకు పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తోంద ని ఆ సంస్థల నాయకులే ప్రకటిస్తున్నా చైనా మాత్రం వాటిని ఉగ్రవాద సంస్థలుగా గుర్తించడానికి ఇష్టపడడం లేదు.
అంతేకాదు, ఉగ్రవాదంపై పోరాటానికి ప్రపంచ దేశాలన్నీ ఒకే తాటి మీద నిలబడి, ఒక ఉమ్మడి అజెండాను, కార్యక్రమాన్ని రూపొందించాలని 1996లోనే భారత్ ఒక ప్రతిపాదన చేసినప్పటికీ, చైనా, దాని మిత్ర దేశాలు దానికి దూరంగా ఉంటూ వచ్చి, ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి సంబంధించి మాత్రం ర ష్యాకు మద్దతుగా ఒకే తాటి మీదకు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో తమ రెండేళ్ల పదవీ కాలం పూర్తి కావడాన్ని పురస్కరించుకుని భారత్ ‘ఉగ్రవాద వ్యతిరేక’ సదస్సును, ఇంటర్పోల్ సదస్సును నిర్వహించింది. ఉగ్రవాదాన్ని అరికట్టాలన్న పక్షంలో మొదటగా ఉగ్రవా దులకు, ఉగ్రవాద వర్గాలకు, ఉగ్రవాద సంస్థలకు నిధులు రావడాన్ని నిలువరించాలని భారత్ ఈ సద స్సుల్లో పదే పదే విజ్ఞప్తి చేసింది. సాధారణంగా ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో సందర్భం ఉన్నా లేకపోయి నా భారత్ మీద ఎదురు దాడికి దిగే పాకిస్థాన్ విదేశాంగ మంత్రి భిలావల్ భుట్టో జర్దారీ ఈ సదస్సుల సందర్భంగా కూడా జైశంకర్తో తీవ్ర వాదోపవాదాలకు దిగారు.
ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్ ప్రధాన స్థావరంగా తయారవుతోందని జైశంకర్ విమర్శించినప్పు డు, భిలావల్ భారత ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా విమర్శించడం ప్రారంభించారు. 2002 నా టి గోద్రా అల్లర్లను కూడా ప్రస్తావించారు. లాహెూర్లో అల్లర్లు జరగడానికి, హింసా విధ్వంసకాండలు చేలరేగడానికి భారత్ కుట్రే కారణమని కూడా ఆయన ఆరోపించారు. ప్రధాన అంశాన్ని దారి మళ్లించడానికి ఆయన ఈ విధంగా అనేక రకాలుగా ప్రయత్నించారు. ప్రభుత్వం ఈ విధమైన ఆరోపణలకు జవాబు చెప్పే పనిలో పడకుండా, ఉమ్మడి పోరాటం కోసం, ఉమ్మడి కార్యాచరణ కోసం ప్రయత్నాలను కొనసాగించడమే శ్రేయస్కరంగా కనిపిస్తోంది. ఉగ్రవాద వర్గాలు వివిధ దేశాలలో చివరికి సామాన్య పౌరు లపై కూడా దాడులు చేయడం మొదలు పెట్టిన నేపథ్యంలో ప్రపంచ దేశాలను కూడగట్టడం భారత్కు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News