Monday, September 16, 2024
Homeఓపన్ పేజ్The ways to stop rapes: అత్యాచారాలకు పరిష్కారం లేదా?

The ways to stop rapes: అత్యాచారాలకు పరిష్కారం లేదా?

మహిళలపై నేరాలను నిరోధించడమనేది కుటుంబం నుంచే, పెంపకం నుంచే ప్రారంభం కావాలని సామాజిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పిల్లలకు చిన్నతనం నుంచే సరైన శిక్షణనివ్వాలని, పిల్లల పెంపకంలోనే వారి దృక్పథంలో మార్పు తేవాలని, తల్లితండ్రులే సంస్కరణలు చేపట్టాలని వారు సామాజిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం సామాజిక శాస్త్ర పరిశోధన విభాగానికి చెందిన ఆచార్యులు, అధ్యాపకుల అధ్యయనం ఒకటి ఇటీవల వెలుగు చూసింది. నేరాలన్నిటిలో అత్యాచారం అనేది మరింత ఘోరమైన నేరం. దేశంలో మహిళలపై అటువంటి ఘోరమైన నేరం రోజు రోజుకూ పెరగడం తీవ్రంగా ఆందోళన కలిగిస్తోంది. మహిళలను నీచంగా చూడడం, వారి నిస్సహాయ స్థితిని అవకాశంగా తీసుకుని వారి మీద రాక్షసత్వం ప్రదర్శించడం దేశానికి సిగ్గుచేటైన విషయాలు.
గతంలో ఇటువంటి అత్యాచార సంఘటనలు, ఇతర నేరాలు చాల తక్కువగా వెలుగులోకి వచ్చేవి. అయితే, ప్రస్తుతం ఇటువంటి కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నందువల్ల ఎక్కువగా బయటపడుతున్నందు వల్ల మహిళలు చైతన్యవంతు లవుతున్నారు. ప్రజల్లో సామాజిక స్పృహ పెరుగుతోంది. వీటిపై తక్షణం చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని, నిందితులను కఠినంగా శిక్షించాల్సిన అవసరాన్ని ప్రజలు, పాలకులు కూడా గుర్తించడం జరుగుతోంది. నిజానికి, 2016-22 మధ్య కాలంలో దేశంలో పిల్లలపై అత్యాచారాలు 96 శాతం పెరగడం ఆందోళన కలిగించే విషయం. 2016లో 19,765 కేసులు నమోదు కాగా, 2017లో 27,616 కేసులు నమోదయ్యాయి. 2021 నాటికి ఈ సంఖ్య ఎకాయెకిన 36,381కు పెరిగింది. ఒక్క 2021లోనే మహిళల మీద గంటకు 49 చొప్పున అత్యాచారాలు జరిగాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అత్యాచారాలు జరిగినప్పుడు దాన్ని వెంటనే పోలీసులకు లేదా సమాజానికి తెలియజేయాలని మహిళలు భావిస్తుండడం, అత్యాచార సంఘటనను బయటికి తెలియజేయడానికి అనేక మార్గాలు అందుబాటులోకి రావడం వల్ల ఈ విధంగా కేసులు సంఖ్య ఎక్కువగా కనిపిస్తోందని అర్థం చేసుకోవచ్చు. ఇదివరకటి మాదిరిగా కాకుండా బాధితులు ఇప్పుడు హెల్ప్‌ లైన్లను, సహాయ సంస్థలను ఎక్కువగా ఆశ్రయించడం జరుగుతోంది. అత్యాచార నిందితులను వెంటనే పోలీసులకు పట్టివ్వాలనే తపన కుటుంబ సభ్యుల్లో కూడా పెరుగుతోంది.
అత్యాచారం అనేది సమాజంలోని అనేక లోపాలకు, లొసుగులకు అద్దం పడుతుంది. ఆధిపత్యం, అధికారం చెలాయించాలని, తనదే పైచేయిగా నిరూపించుకోవాలని, మహిళలు తమకు అణగి మణగి ఉండాలనే తాపత్రయం సమాజంలోని పురుషుల్లో ఎక్కువగా ఉందన్నది ఇది తేటతెల్లం చేస్తోంది. ఇది ఒక రకమైన ప్రతికూల ధోరణి. సమాజంలో పురుషాధిక్యత తారస్థాయికి చేరుకుంది. తమ సుఖ సంతోషాల కోసం, తమకు ఊడిగం చేయడం కోసమే మహిళలు ఉన్నారనే ధోరణి నుంచి పురుషులు బయటపడలేకపోతున్నారు. ఈ ధోరణి ముసుగులో పురుషులు ఏం చేసినా చెల్లిపోతోంది కూడా. కుటుంబాల్లో బాలికలను ద్వితీయ శ్రేణివారుగా పరిగణించడమనేది సమాజంలో అనాదిగా కొనసాగుతోంది. రకరకాల రూపాల్లో అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఉదార భావాలు కలిగిన కుటుంబాలు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. ఇందులో సందేహం లేదు. అయితే, ఒక్కోసారి అక్కడ కూడా బాలికలు లేదా మహిళలు తమ ప్రతిభా పాటవాలను ఉపయోగించు కోవడానికి అవకాశం లేకపోవడమో, వారు తమ కలలను సాకారం చేసుకోలేకపోవ డమో జరుగుతూనే ఉంటోంది.
సామాజిక లోపాలు
బాల్య వివాహాలు చట్టవిరుద్ధమే అయినప్పటికీ, అవి నిరాటంకంగా, నిర్నిరోధంగా కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలను బానిసలుగా ఉపయోగంచుకోవడం, అప్రధాన వ్యక్తులుగా పరిగణించడం, సొంత వ్యక్తిత్వంతో కాకుండా, కుటుంబానికి సేవ చేసే వ్యక్తిగానే కొనసాగించడం ఒక సహజ వ్యవహారంగా సాగిపోతోంది. మహిళల వల్ల జాతికి, దేశానికి ఏమాత్రం ఉపయోగం లేకుండా చేయడమనేది ఒక సహజ ప్రవృత్తి కింద మారిపోయింది. కుటుంబంలోని బాలికలకు తాము ఎంచుకోగల అవకాశాలు తక్కువగా ఉంటాయి. వారు చేయగలిగిన ఉద్యోగాల సంఖ్య కూడా పరిమితంగా ఉంటుంది. చాలా సందర్భాలలో బాలికల ధ్యేయం, లక్ష్యం పెళ్లి చేసుకోవడం మాత్రమే. తమకు కావలసిన భర్తను ఎంచుకునే స్వాతంత్య్రం కూడా వారికి ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటున్న కుటుంబాల్లో బాలికలు, మహిళలు కూడా తప్పకుండా వ్యవసాయ పనుల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి మహిళలకు అవకాశాలు మరీ తక్కువగా ఉంటాయి. ఎంతో ప్రతిభ కలిగిన యువతులు కూడా చివరికి పెళ్లితో తమ ఉద్యోగావ కాశాలకు స్వస్తి చెప్పడం జరుగుతోంది. కుటుంబాల బాగోగులను చూసుకోవడంతోనే వారి జీవితం వెళ్లమారిపోతుంటుంది. ఇక పట్టణాలు, నగరాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా మహిళలు ఇంటి నుంచే ఉద్యోగం చేసుకోగలిగిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనివల్ల ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం కలుగుతోంది. కోవిడ్‌ తర్వాత ఈ వెసులుబాటు మరీ ఎక్కువైంది. ఒక విధంగా ఈ సాంకేతిక పరిజ్ఞానం మహిళలకు ఒక వరంగా మారింది. ఇటువంటి సందర్భాల్లో కుటుంబాలు తమ ఇంటి మహిళలతో వ్యవహరించే తీరు కూడా మారింది.
దృక్పథంలో మార్పులు
అయితే, ఈ మధ్య కాలంలో మహిళల మీద అత్యాచారాలు పెర గడమే పెద్ద ఆందోళనకర విషయంగా మారింది. అత్యాచార సంఘట నలను ఇప్పటికీ అనేక కుటుంబాలు బయటపెట్టలేని పరిస్థితి కొనసాగుతోంది. నిందితుడిని పోలీసులకు పట్టివ్వడం, నిందితుడి గురించి ఫిర్యా దులు చేయడం వంటి విషయాలకు కుటుంబాలు దూరంగా ఉండడమే ఎక్కువగా జరుగుతోంది. కుటుంబ పరువును దృష్టిలో పెట్టుకుని అనేక కుటుంబాలు మౌనంగా ఉండాల్సి వస్తోంది. అత్యా చార బాధితురాలి విషయంలో సమాజం వ్యవహరించే తీరుతో పాటు, పోలీసులు, న్యాయ స్థానాలు వ్యవహరించే తీరును బట్టి కూడా కుటుంబాలు సహించి, భరించి ఉండడం జరుగుతోంది. అయితే, బాధితురాలి కుటుంబాలు ఇటువంటి కేసులను వెలుగులోకి తీసుకు వచ్చి, బాధితులకు న్యాయం కలిగించడా నికే ప్రయత్నం చేయడం వల్ల సమాజం మారడానికి అవకాశం ఉంటుంది. పోలీసులు, న్యాయస్థానాలు కూడా ఇటువంటి సందర్భాల్లో రహస్యంగా విచారణ జరిపించడమో, త్వరగా విచారణ పూర్తి చేయడమో చేయాల్సి ఉంటుంది.
మహిళలపై నేరాలు జరగకుండా నిరోధించాలన్న పక్షంలో కుటుంబ స్థాయిలోనే సంస్కరణలు చోటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇం ట్లోనూ, తరగతుల్లోనూ బాల బాలికల్లో తప్పకుండా విలువలను పెంపొం దించాల్సిన అవసరాన్ని గుర్తించాలి. సమాజంలో బాలికలు కూడా పురు షులకు సమానులేనన్న భావాన్ని పిల్లల్లో రంగరించిపోయాలి. బాలికలు తమకు కావాల్సిన చదు వుల్ని, వృత్తి, ఉద్యోగాలను ఎంచుకునే స్వేచ్ఛనివ్వాలి. బాలికలు తమ కలలను సాకారం చేసుకోవడానికి, తమ ఆశయాలను నెరవేర్చుకోవడానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో పాటు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కూడా ఇవ్వాలి. ఇది సాధ్యమయ్యే విషయంగా కని పించకపోవచ్చు. కానీ, తప్పనిసరిగా సామాజిక దృక్పథంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. తల్లితండ్రులే పిల్లల్లో చైతన్యాన్ని పెంచి, అవగాహన కలిగించాల్సి ఉంటుంది. కుటుంబ వ్యవహారాలతోనే బాలికలు చదువులు, ఉద్యోగాలు, బాధ్యత, బాధ్యతల విషయంలో సంస్కరణలు ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోని అనేక దేశాలతో పోలిస్తే, ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళల సంఖ్య భారతదేశంలో బాగా తక్కువ. ఈ పరిస్థితిలో మార్పు రావాలన్న పక్షంలో మొదటగా పురుషుల ఆలోచనా ధోరణిలో కూడా మార్పు రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆచార సంప్రదాయాల పేరుతో మహిళలను చిన్నచూపు చూస్తున్న కుటుంబాల తీరుతెన్నులు పూర్తిగా మారాల్సిన అవసరం ఉంది.

  • కె. వెంకట రమణ, చెన్నై
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News