‘మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’ అంటూ పతనం అంచున ఊగిసలాడుతున్న మానవ సంబంధాల పట్ల ఓ కవి ఆవేదనకు అక్షర రూపం పై వాక్యాలు. సమాజంలో నానాటికి పెరిగిపోతున్న నేరాల తీవ్రతను చూస్తే వాటి వెనుక వున్న నేపధ్యాలు పరిశీలిస్తే మనిషి ప్రవర్తనపట్ల ఒకింత జుగుప్ప కలగక మానదు, ఓ చోట భర్తను చంపిన భార్య అని, మరోచోట కీచక అధ్యాప కుడంటూ, ఇంకొక చోట ఆస్తి కోసం, అమ్మను, నాన్నను, అన్నను, తమ్ముడిని హతమార్చినట్లు పతాక శీర్షికలు వెరసి పైన జరుగుతున్న నేరాలు ఒక ఎత్తు మరో వైపు నా నాటికి మహిళలపై పెరుగుతున్న లైంగికపరమైన వేదిం పులు, తద్వారా మహిళల భవిత కొంతమేర ప్రశ్నార్ధకం అవుతోంది. పనిచేసే చోట, చదువుకునే చోట, ఇతర బహి రంగ స్థలాల్లో, ఏది ఏమైనప్పటికీ ఇంత అభివృద్ధి సాధిం చిన మానవుడు తిరిగి మళ్ళి ఆదిమ సమాజాల వాసన వదలకపోవటం కడు శోచనీయం. అనాగరిక సమాజంలో ఒక మనిషి మరొక మనిషిపై, ఒక జాతి మరొక జాతి పై ఆదిపత్యం చెలాయించడం కోసం జరిగే ఘర్షణలో హింస చెలరేగి వందలు, వేలు చనిపోయినట్లు నాగరికతలే ద్వం సం ఐనట్లు చరిత్రలో చదువుకున్నామ్. మనిషి మెదడులో వచ్చిన మానవ వికాసం క్రమేణ మార్పు చెందటం నాటి పశు ప్రవృత్తిని వదులుకొని ఆటవిక దశ నుండి సంఘ జీవనం వైపు మల్లటం చరిత్ర పరిణామం. కాని నేడు అక్క డక్కడ మళ్ళి అలాంటి సంఘటనలే జరగటం ఇన్ని సంవ త్సరాల నాగరికతా పరిణామ క్రమంలో మానవుడు సాధిం చినదేమిటి అనేది ఆలోచించాల్సిన విషయం నాడు చీకటికి వర్షానికి భయపడ్డ మానవుడు నేడు చీకటి ఎందుకు వస్తుంది, వర్షం ఎప్పుడు కురుస్తుంది ఎంతమేర జన జీవ నంపై ప్రభావం చూపుతుందని ముందస్తుగానే హెచ్చరిక చేసి అప్రమత్తం చేసే సాంకేతిక పరిజ్ఞానం కనిపెట్టి నష్ట నివారణ నియంత్రించగల్గుతున్నాడు.
ప్రపంచంలో ఏదో ఒక మూలనతయారవుతున్న ఏ వస్తువు ఐనా కూడా బహిరంగ మార్కెట్‌లో వినియోగ దారుడికి అందుబాటులో ఉంటున్న ఈ తరుణంలో నేడు అక్కడక్కడ జరుగుతున్న సంఘటనలు చూస్తు ఉంటే చాలా బాదేస్తుంది. ఆ మధ్య కాలంలో ఓ ప్రొఫెసర్ భార్య ప్రియుడి మోజులో పడి భర్తను దారుణంగా హతమార్చి అండర్ బ్రిడ్జి క్రింది దహనం చేసిన సంఘటన ఎవరు మర్చిపోయి ఉండకపోవచ్చు. ఫలితం భార్య కటకటాల పాలు పిల్లలు అనాధ శరనాలయం పాలు, వెరసి ఇందులో లోపం ఎవరిది భర్తదా, భార్యదా అనే మీ మాంస కన్నా భవిష్యత్తులో జరుగబోయే పరిణామాలు ఊహించి ఉంటే ఇలాంటి క్షణికమైన సంఘటనలు జరిగేవి కావు అనేది నా అభిప్రాయం.
ఇక రెండో సంఘటన ఇటీవలి హైదరాబాద్ లోని ఓ పేరున్న పాఠశాల బస్సు డ్రైవర్ అభం శుభం తెలియని చిన్నారులపట్ల అసభ్యంగా ప్రవర్తించి పాఠశాలను మూసి వేసే స్థాయికి తీసుకెళ్ళిన సంఘటనను కూడా అప్పుడే మర్చిపోలేం. అలానే ఓ చోట తండ్రి కొడుకులు కలిసి ఈత పందెం పెట్టుకొని మొదలు తండ్రి చెరువులోనికి దిగి ఈత కొడ్తుండగా అతని కుమారులు గట్టుపై నిలబడి వీడియో తీస్తు ఆనందించటం అనంతరం తండ్రి నీటిలో మునుగు తున్నా పట్టించుకోకుండా ఊర్లోకి వెళ్లి ఏమితెలియనట్లు వ్యవహరించటం అందరిని విస్మయానికి గురిచేసింది. ఎటు నుండి మొదలైన మనిషి ప్రయాణం ఎటుగా వెళ్తుం దనేది ప్రశ్న. ఇక ఇటీవలి జరిగిన నవీన్ రెడ్డి మెడికో విద్యా ర్ధిని వైశాలికి సంబంధించిన ఎపిసోడ్ అందరికి తెలిసిన విషయమే, అలానే ఇటీవలే హైదరాబాద్‌లో ప్రేమించిన అమ్మాయి దక్కలేదని తల్లి కూతురుపై దాడిచేసి అనంతరం ప్రియుడు ఆత్మ హత్యకు పూనుకున్న సంఘటన ఒకటి. అలానే నిన్న జనగామ మండలం మరిగడి గ్రామానికి చెందిన కూరాకుల రమణమ్మ అనే 55 సం.రాల తల్లిని ఆమె కుమారుడు (కన్నప్ప) ఆస్తి తగాద విషయంలో తలా మొండెం వేరుచేసి గ్రామంలో వీరంగం సృష్టించిన సంఘ టనతో అక్కడి వారందరు ఉలిక్కిపడ్డారు ఇలా నిత్యం ఎక్కడో ఒక చోట, ఎదో ఒక సందర్భంలో ఇలాంటివి జరగటం చూస్తూనే ఉన్నాం.
పైవన్నీ పరిశీలించి చూస్తే మనిషిలో సహజంగా ఉండేటటువంటి క్రూరమైన ప్రవర్తనకు ఎదో ఒక అంశం (ప్రేమ, ఆస్తి, అక్రమ సంబంధాలు) అడ్డుగా రావటం వెరసి మానసిక భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేక పోవటం దాని ఫలితంగా క్షణికమైన నిర్ణయాలు తీసుకొని హింసకు పాల్పడటం ఇందులో మనం తీవ్రంగా పరిగణిం చాల్సిన విషయం. ప్రేమికులు ఐనా, తండ్రి కొడుకులు ఐనా, విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడు ఐనా వారి మానసిక స్థితి సరిగ్గా వున్నట్లయితే నేర ప్రవృత్తికి సంబంధించిన పని చేయాలనుకున్నప్పుడు దాని తర్వాత జరగబోయే పరిణామాలు ఆలోచించలేకపోవటం మూలంగా జరుగుతున్న నేరాలు.
సమాజం ఇంతగా చైతన్యం చెందుతున్న ఈ రోజుల్లో కూడా అనాధ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు పెరగటం అనేది సీరియస్‌గా పరిగణించాల్సిన విషయం. ఇక మరొక విషయం ఇక్కడ ప్రస్తావించాలి ప్రసిద్ధి చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ రేమ్‌ండ స్థాపకులు ఐనా విజయ్ పత్ సింఘానియా గారి ఒక్కనొక కుమారుడు గౌతమ్ సింఘాని యాకు ఆస్తి మొత్తం బదిలీచేస్తే వృద్ధాప్యంలో పడుతున్న ఇబ్బందులను మరియు నెలవారీ ఖర్చుల కోసం కుమారు డిని ఆదేశించాలని కోర్టు మెట్లు ఎక్కడం అందరిని ఆలో చింపజేసే సంఘటన ఇది. ఒక మనిషి ఇంకో మనిషిపై ఒక దేశం ఇంకో దేశంపై హింసకు పూనుకోవడం అనేది అనైతికమైన మరియు అసంకల్పితమైన చర్యగానే భావిం చాలి. ప్రముఖ మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ప్రాయిడ్ గారి ‘మనో విశ్లేషణ సిద్ధాతం ప్రకారం మనిషి యొక్క మానసిక ఉద్వేగాలలో అనేక గ్రంధులు క్రీయాశీలక పాత్ర పోషి స్తాయి. అవి అదుపు తప్పిపోవడానికి ఏవైనా ఉత్ప్రేరకాలు (సిగరెట్, గంజాయి, స్టెరాయిడ్స్, డ్రగ్స్, మద్యం మొద లైనవి) తీసుకున్నట్లయితే వాటి పనితీరు అదుపు తప్పే ప్రమాదం ఉంది అంటాడు. విచ్చలవిడిగా మార్కెట్‌లో ‘మద్యం’ మరియు ‘మత్తు పదార్ధాలు’ లభ్యం అవుతున్న ప్పుడు వాటిని తీసుకున్నవారు ఉద్వేగాలను అదుపులో పెట్టుకోలేక ఉన్మాదిగా మారి నేరాలకు పాల్పడే ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి ఉత్ప్రేరకాలు పనిచేస్తున్న వాటిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. మైనర్ పిల్లలకు సిగరెట్ల విక్రయాలు నిషేదించాలి గుట్కాలు, ఇతర పొగాకు ఉత్ప త్తులపై వచ్చే లాభాలకన్న నష్టం ఎక్కువగా వున్నప్పుడు వాటి ఉత్పత్తినే నిలిపివేయటం మంచిదనేది నా అభిప్రాయం.
ఈ విషయంలో పోలీసులు క్రీయాశీలక పాత్ర పోషించాలి బహిరంగ స్థలాలు మరియ మత్తు పదార్ధాలు వాటి ఉత్పత్తులను రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకొని జీవిత కాల శిక్షలుపడే విధంగా చర్యలు తీసుకుంటే కొంతలో కొంతమేర నేరము మరియు నేరాల సంఖ్య తగ్గి ప్రశాంత వాతావరణము నెలకొంటుంది. ఇందులో ప్రతిపౌరుడు తన పరిధి మేరకు వారి దృష్టిలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు మరియు ఇతర అనైతిక కార్య క్రమాలు జరుతున్నట్లుగా గమనిస్తే పోలీసులకు సమా చారం ఇచ్చి జరగబోయే ఉపద్రవాలను నియంత్రించ టంలో క్రియాశీలక పాత్ర పోషించాలి మనిషి అంటేనే మానవత్వాన్ని ప్రదర్శించే వాడు అలాంటి మానవతా విలువలను దిగజార్చకుండా నేర నివారణకు తన వంతు భూమికను పోషించి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగం పంచుకోవాలని ఆశిస్తూ.
డా॥మహ్మద్ హసన్
9908059234.