Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్World Alzheimer's day: అల్జీమర్స్‌ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కావచ్చు

World Alzheimer’s day: అల్జీమర్స్‌ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కావచ్చు

ఈ వ్యాధిపై పోరాటంలో అవగాహనే ముఖ్యం

నాడీమండల సంబంధ రుగ్మత (న్యూరొలా జికల్‌ డిజార్డర్‌) మూలంగా మెదడు సంకోచం, మెదడు కణాలు నశించడంతో జ్ఞాపకశక్తిని కోల్పోవడం, ప్రవర్తనలో తేడాలు, ఆలోచనలో విపరీత ధోరిణిలు, సామాజిక నైపుణ్యాల్లో వ్యత్యాసాలతో స్వతం త్రంగా జీవనం గడపలేని ప్రమాదకర అల్జీమర్స్‌ (డెమె న్షియా) రుగ్మత కలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ల ప్రజలు డెమెన్షియాతో బాధ పడుతున్నారని, ఇందులో 70 శాతం వరకు అల్జిమర్స్‌ రోగులు ఉండ వచ్చని అంచనా వేశారు. ఒక్క అమెరికాలోనే 5.8 మిలి యన్ల అల్జిమర్స్‌ వ్యాధిగ్రస్థులు ఉన్నారని, వీరిలో 80 శాతం 75 ఏండ్లు దాటిన వృద్ధులే ఉన్నారని తేలింది. 85 ఏండ్లు దాటిన వృద్ధుల్లో 33 శాతం మందికి అల్జీమర్స్‌ వ్యాధి కనిపిస్తుంది. సరైన శాశ్వత చికిత్స లేకపోయినా, వైద్యంతో కొంత ఆలస్యంగానైనా ఉపశమనం లభించి, తమ పనులను తామే చేసుకోవడానికి వెసులుబాటు కలు గుతుంది. అల్జీమర్స్‌ వ్యాధి ముదిరితే మెదడు కుచించు కొని పోవడం, డీహైడ్రేషన్‌, ఇన్‌ఫెక్షన్‌ కలిగిగి చివరకు మరణం కూడా జరుగవచ్చు.

- Advertisement -


వ్యాధి లక్షణాలు
తాజా సంఘటనలు కూడా మరిచి పోవడం, జ్ఞాపక శక్తిని క్రమంగా కోల్పోవడం, విపరీత ప్రవర్తనలు, స్వతం త్రంగా పనులు చేసుకోలేకపోవడం, దినచర్యను మరిచి పోవడం, మాట్లాడడం/వ్రాయడంలో సమస్యలు, ఇంట్లో వస్తువుల్ని వెతకలేకపోవడం, మనుషుల్ని గుర్తించలేక పోవడం, నిర్ణయాలు తీసుకునే స్థితిని కోల్పోవడం, మాన సిక అస్థిరత్వం, సమూహాలకు దూరంగా జరగడం, నిద్ర అలవాటు మారడం, చికాకు పడడం, ఆవేశ పడడం, మానసిక ఒత్తిడిలో ఉండడం, మెదడు క్రియాశీలత క్షిణిం చడం, మతి మెరుపు ముదరడం లాంటివి అల్జీమర్స్‌ వ్యా ధి లక్షణాలుగా పేర్కొనబడ్డాయి. అతి ప్రమాదకర అల్జి మర్స్‌ వ్యాధి వయోవృద్ధుల్లో అధికంగా కలుగుతుంది. ట్రాఫిక్‌ రణగొణ ధ్వనుల వల్ల కూడా ఈ వ్యాధి కలుగ వచ్చు. జ్ఞాపకశక్తి కోల్పోవడం, తీవ్ర చిత్త వైకల్యం, దిన చర్య నిర్వహణలో ఇతరుల సహాయం అవసరం కావడం లాంటి లక్షణాలు అల్జీమర్స్‌ వ్యాధికి లక్షణాలు అవుతాయి.
అవగాహనతో ఉపశమనం
ఇలాంటి ప్రమాదకర వ్యాధి పట్ల ప్రజల్లో అవగా హన, వ్యాధి లక్షణాలు, వైద్య సదుపాయాలు, వ్యాధి గ్రస్థుల పట్ల సహానుభూతి ప్రదర్శనలు లాంటి అంశాలను ప్రజలకు వివరించే ఉద్దేశంతో ప్రతి ఏట 21 సెప్టెంబర్‌న ‘ప్రపంచ అల్జిమర్స్‌ దినం’ పాటించుట ఆనవాయితీగా మారింది. మనిషి ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ మానసికంగా జ్ఞాపకశక్తిని కోల్పోవడం కనబడుతుంది. ‘బ్లడ్‌-టు-బ్రెయిన్‌ పాత్‌వే’ కారణంగా అల్జీమర్స్‌ వ్యాధి కలుగుతుందని ఇటీవల కనుగొన్నారు. కొన్ని ప్రత్యేక పోషకాహార పదార్థాలు (కూరగాయలు, చిక్కుడు, చేపలు, ఆలివ్‌ ఆయిల్‌, హోల్‌ గ్రేయున్స్‌ సాంటివి) తీసు కోవడం వల్ల మెదడు క్షీణత తగ్గుతూ, అల్జీమర్స్‌ వ్యాధి కొంత వరకు నిరోధించబడుతుంది. కోవిడ్‌-19 వ్యాధితో అల్జీమర్స్‌ వ్యాధి పెరిగిందని కూడా తేలింది. సాధారణ ప్రజానీకం అల్జిమర్స్‌ వ్యాధి పట్ల అవగాహన కలిగి, వ్యాధిగ్రస్థులను సహానుభూతితో చూసుకోవడం, రోగ లక్షణాలను/చికిత్స మార్గాలను తెలుసుకోవడం, రాకుం డా ముందు జాగ్రత్తలు తీసుకోవడం లాంటి జ్ఞానంతో డెమెన్షియాను దూరం చేద్దాం, వృద్ధులను పూలలో పెట్టి చూసుకుందాం.

  • డా: బుర్ర మధుసూదన్‌ రెడ్డి
    9949700037
    (నేడు ప్రపంచ అల్జీమర్స్‌ దినోత్సవం)
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News