Sunday, November 16, 2025
Homeఫీచర్స్Financial Strategies: ధనవంతులను మరింత డబ్బున్న వారిగా మార్చే ఆరు పనులు ఇవే..

Financial Strategies: ధనవంతులను మరింత డబ్బున్న వారిగా మార్చే ఆరు పనులు ఇవే..

సంపన్నులు టన్నుల కొద్దీ డబ్బు ఆదా చేయడానికి అనుసరించే మార్గాలు మామూలుగా కనిపించినా, అవి చాలా ప్రభావవంతంగా ఉంటాయి. వారి జీవనశైలి విలాసవంతంగా ఉంటూనే, ఈ ఆర్థిక వ్యూహాలు వారికి శాశ్వత సంపదను కలిగిస్తాయి. వాటిలో కొన్ని ఏంటో తెలుసా

- Advertisement -

వ్యూహాత్మక పెట్టుబడులు: సంపన్నులు ఆరోగ్య పొదుపు ఖాతాలను ఉపయోగించి పన్ను తగ్గింపు ప్రయోజనాలు పొందుతూ పెట్టుబడులను వ్యూహాత్మకంగా నియమించుకుంటారు. అంతేకాకుండా ఎక్కడ పెట్టుబడులు పెట్టినా ఆలోచించి పెడుతారు.

రివార్డ్స్ ప్రోగ్రామ్‌లు: ధనవంతులు తక్కువ ధరలో కొనుగోళ్లు చేయడంలో ప్రావీణ్యం సాధిస్తారు. క్రెడిట్ కార్డులు, ట్రావెల్ రివార్డ్స్ ప్రోగ్రామ్‌లను వినియోగించి వారి ఖర్చులను తగ్గించుకుంటారు.

ప్రాధాన్యత: ఇల్లు, కార్లు వంటి ఆస్తుల రక్షణకు రక్షణ చర్యలు చేపట్టి, భవిష్యత్తులో భారీ ఖర్చులను నివారిస్తారు.

పన్ను ప్రణాళిక: పన్ను మినహాయింపు సాధనాల ద్వారా వారి ఆదాయాన్ని ప్రణాళికాబద్ధంగా నియంత్రించుకుంటారు. ఫైనాన్షియల్ సలహాదారుల సహకారంతో పన్ను బాధ్యత తగ్గించుకుంటారు.

చాలా మంది పన్ను భారం తగ్గించడానికి ట్రస్ట్‌లు, చారిటబుల్ గివింగ్ స్ట్రాటజీల వంటి సాధనాలను ఉపయోగిస్తారు. దీర్ఘకాలిక పొదుపులను సృష్టిస్తూ సంపద మరింత పెంచుకుంటారు.

ఆటోమేటిక్ పొదుపులు: పొదుపులు, పెట్టుబడులపై ఆటోమేటిక్ బదిలీలను అమలు చేసి, క్రమశిక్షణతో పొదుపు అలవాట్లను పెంపొందించుకుంటారు.

లైఫ్ స్టైల్ ఆప్టిమైజేషన్: అధిక నాణ్యత గల వస్తువుల్లో పెట్టుబడి పెట్టడం, అనుభవాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా విలువను పెంచుకుంటారు. ఈ వ్యూహాలన్నీ సంపద పెంపుకు ఉపయోగపడే స్థిరమైన మేధావి మార్గాలు. ఈ చిట్కాలను అనుసరిస్తే, మీ జీవితంలో ఆర్థిక ప్రగతి సాధ్యమే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad