ఇంట్లో ఎలుకలతో సమస్య ఎదుర్కొంటున్నారా? ఎలుకలను చంపకుండా ఇంట్లో నుంచి తరిమేయడం చాలా సులభం. కొన్ని సహజ పదార్థాలతో మీరు ఈ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు.
ఉల్లిపాయలు ఎలుకలకు సహించని ఘాటైన వాసనను కలిగిస్తాయి. మీరు కొన్ని ఉల్లిపాయలను కోసి ఇంటి వివిధ ప్రదేశాలలో ఉంచితే, ఎలుకలు ఇంటిని వదిలిపోతాయి. ఇక ఎర్ర కారం ఎలుకల దూరంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో ఎర్ర కారం లేదా కారం పొడి చల్లడం ద్వారా వాటిని బయటికి పంపవచ్చు.
పుదీనా నూనె ఎలుకలను దూరంగా ఉంచడానికి ప్రభావవంతమైన సాధనం. పుదీనా ఆకులు లేదా నూనె వాసన ఎలుకలకు అసహ్యంగా ఉంటుంది. ఇంటిలోని ప్రతి మూలలో, ఎలుకలు ఉండే ప్రదేశాలలో పుదీనా ఆకులను ఉంచండి, దీని వలన అవి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాయి.
అలాగే, లవంగాలను గుడ్డలో చుట్టి ఇంటి ప్రతి మూలలో ఉంచడం ప్రభావవంతంగా ఉంటుంది. లవంగాల గంధం ఎలుకలను వెంటనే పారిపోయేలా చేస్తుంది. ఎలుకలు బయటకు వెళ్లిన తర్వాత ఇంటిని శుభ్రం చేయడం మర్చిపోవద్దు. కిటికీలు, తలుపులు తెరిచి, ఎలుకల వ్యర్థాలను శుభ్రపరచి ఇంటిని శానిటైజ్ చేయడం ద్వారా మీరు వ్యాధుల నుంచి రక్షించవచ్చు.