Saturday, November 23, 2024
Homeఫీచర్స్Ginger storage: అల్లం నిల్వ చేయటం ఎలా?

Ginger storage: అల్లం నిల్వ చేయటం ఎలా?

అల్లాన్ని పేస్టులా చేసి ఫ్రీజర్ లో పెడితే ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది

అల్లం ఇలా భద్రం…

- Advertisement -

టొమాటోలు, పచ్చిమిరపకాయలతో పాటు అల్లం ధర కూడా ఇటీవల బాగా పెరిగిన విషయం మనకు తెలిసిందే. నిత్యం వంటకాల్లో అల్లం వినియోగం తప్పనిసరి కాబట్టి ఎక్కువ కాలం అల్లం భద్రపరుచుకునే చిట్కాలు కొన్ని పాటిస్తే అల్లాన్ని వ్రుధాచేయకుండా, పాడుకాకుండా పొదుపుగా ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు అల్లాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉండేలా నిల్వ ఉంచుకోగలుగుతాం కూడా. అలాంటి చిట్కాలలో ఒకటి పేపరు టవల్ లో అల్లాన్ని భధ్రంచేయడం. దీనికి ముందు అల్లాన్ని బాగా కడిగి ఆరబెట్టాలి. ఆ తర్వాత దాన్ని పేపర్ టవల్ లో ఉంచి గాలి సోకని డబ్బాలో భద్రపరచాలి. అల్లానికి తేమ
అంటకుండా, గాలి తగలకుండా ఉండాలంటే ఆ డబ్బాను ఫ్రీజర్ లో పెట్టాలి. ఇంకొక చిట్కా ఏమిటంటే అల్లంపై ఉండే తొక్క తీసేసి అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని వెనిగర్ పోసిన చిన్న కంటైనర్ లో వేసి ఉంచాలి. వెనిగర్ కు బదులు నిమ్మరసం లేదా ఎసిడిక్ లిక్విడ్ ను కూడా వాడొచ్చు. ఇలా చేయడం వల్ల బాక్టీరియా, పురుగు పుట్ర, అతిసూక్ష్మక్రిములు లాంటివి అల్లానికి పట్టకుండా చాలాకాలం అది శుభ్రంగా ఉంటుంది.

అల్లాన్ని ఎక్కువ కాలం భద్రంగా ఉంచుకునే మరొక చిట్కా ఏమిటంటే అల్లాన్ని పేస్టులా చేసి ఫ్రీజర్ లో పెడితే ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. ఇందుకు మొదట చేయాల్సింది అల్లాన్ని శుభ్రంగా కడిగి పైన ఉండే తొక్కను పూర్తిగా తీసేయాలి. అల్లం ముక్కలకు కొద్దిగా ఉప్పు చేర్చి పేస్టులా చేయాలి. ఆ పేస్టును
గాలి చొరబడని కంటైనర్ లో ఉంచి ఫ్రిజ్ లో పెడితే ఎక్కువ కాలం అల్లం సువాసన పోకుండా తాజాగా ఉంటుంది. అల్లంలోని నీటిని తీసేసి పొడిగా చేస్తే కూడా అల్లం ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. అల్లం తొక్కను తీసేసి దాన్ని పేపర్ టవల్ లో ఉంచితే అందులోని అదనపు నీరు బయటకు వచ్చేస్తుంది. అది క్రిస్పుగా అయ్యేవరకూ బేక్ చేయాలి. అలా క్రిస్పుగా అయిన అల్లం ముక్కలను పొడిగా చేయాలి. ఈ పొడిని అవసరమైనపుడల్లా వాడుకోవచ్చు. దాని అల్లం సువాసన పోదు.

ఇంకొక ముఖ్యమైన చిట్కా ఏమిటో తెలుసా అల్లం తొక్కలను కూడా భద్రం చేసుకుంటే వాటితో సైతం ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం తొక్కలను బాగా శుభ్రం చేసి కడిగి ఆరబెట్టాలి. వీటిని టీ, సోడా, ఇతర డ్రింకుల్లో వాడొచ్చు. అల్లం సువాసనలను ఇవి చిందిస్తాయి. అల్లం తొక్కులను పేస్టులా కూడా చేసి భద్రం చేయొచ్చు. మెరినేడ్స్ లో దీన్ని వాడొచ్చు. అల్లాన్ని వ్రుధా చేయకుండా పూర్తిగా వాడుకోవాలంటే దాన్ని జాగ్రత్తగా కట్ చేయాలి. అల్లాన్ని కుళాయి నీళ్ల కింద పెట్టి బ్రష్ తో దాని తొక్కలకు ఉన్న మట్టిని శుభ్రం చేయాలి. తర్వాత అల్లం తొక్కను స్పూనుతో గికితే పలుచని పొరలా కండ పోకుండా, వ్రుధా కాకుండా తొక్క వచ్చేస్తుంది. అల్లం తొక్కను గీకిన తర్వాత ఆ అల్లాన్ని మీ అవసరాలకు తగ్గట్టు ముక్కలుగా చేసుకోవచ్చు. పేస్టులా తయారు చేసుకోవచ్చు కూడా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News