Tuesday, January 28, 2025
Homeఫీచర్స్Golden mat: ఇది బంగారు చాప, ధర 20 వేల పైమాటే!

Golden mat: ఇది బంగారు చాప, ధర 20 వేల పైమాటే!

ఈ ఫోటోలో కనిపిస్తున్నది ‘మదుర్ మాట్’ అంటే చాప (బెంగాల్‌లో మదుర్ అని పిలుస్తారు) భిన్నంగా ఉంటుంది, చాలా ఖరీదైనది. ఇది గోల్డెన్ గ్రాస్ (సన్నని గడ్డి)తో తయారు చేయబడింది, దీనిని పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాలో నైపుణ్యం కలిగిన హస్తకళాకారులు మాత్రమే పెంచుతారు. ఈ చాపను నిద్రపోవడం కోసమే కాక.. గోడ మీద అలంకరణ, విండో కర్టెన్‌లుగా కూడా ఉపయోగిస్తారు. పూజ కోసం ఈ ఖరీదైన చాపను వాడటం సంప్రదాయంగా, ప్రతిష్ఠాత్మకంగా భావించేవారు చాలామంది ఉన్నారు. దీని బరువు దాదాపు 400 గ్రాములు. ఇది చాలా తేలికైనది. 3×6 అడుగుల పరిమాణంలో ఉంటుంది. దీనిపై నెమలి డిజైన్ ఉండగా మనకు కావాల్సిన ఏ డిజైన్ అయినా అల్లుకోవచ్చని శిల్పకారుడు గురుపదో దాస్. దీని ధర ఇరవై వేల రూపాయలు. ఒక చాపను తయారు చేయడానికి దాదాపు 3 నెలలు పడుతుంది.

- Advertisement -

పూజ చాపలకు భలే డిమాండ్

పశ్చిమ బెంగాల్‌లో తయారు చేసే చాపలలో మదుర్ అత్యంత ప్రాచుర్యం పొందింది. హైదరాబాద్ నగరంలో చాలా మంది ప్రజలు తమ పూజా గదుల కోసం వీటిని కొనుగోలు చేయడంతో హైదరాబాద్‌లో ఈ మ్యాట్‌లకు చాలా డిమాండ్ ఉంది. ఇది చాలా మృదువైనది, దాదాపు ఒక ఫాబ్రిక్ లాగా ఉంటుంది.

స్వయంభ నారీ ఎక్స్ పోలో..

నగరంలోని నారాయణగూడలోని YMCAలో ప్రారంభించిన స్వయంభ నారీ ఎక్స్‌పోలో ఈ చాపను ప్రదర్శించారు. ఎగ్జిబిషన్ ఈ నెల 29 వరకు తెరిచి ఉంటుంది.

శాంతినికేతన్ కళాకారులు..

పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్ నుండి అనేక మంది నైపుణ్యం కలిగిన కళాకారులు మహిళలు తమ కళాత్మక పనులు, ఉత్పత్తులు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఎగ్జిబిషన్‌లో వెదురు, అరటి నారతో తయారు చేసిన చీరలు వంటి బట్టలు కూడా ఉన్నాయి. చీరలు, దుపట్టాలు, హ్యాండ్‌బ్యాగ్‌లు, చేతితో పెయింట్ చేసి చాలా సొగసైన, భిన్నమైన వస్త్రాలను వీరు ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. జమదానీ గిరిజన నేత, మెటాలిక్ టిష్యూ సిల్క్, వెదురు జమ్దానీ, సిల్క్, టస్సర్, కాటన్ చీరలు, ప్రత్యేకమైన కాంతా వర్క్ చీరలు, గ్రాస్ మ్యాట్స్, జ్యువెలరీ, బాటిక్ బెడ్ షీట్స్, లెదర్, సీ షెల్ ప్రొడక్ట్స్ ఈ ప్రదర్శనకు వచ్చిన అందరినీ కట్టిపడేస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News