సెల్ ఫోన్ లేనిదే ముద్ద దిగదు. ఉదయం నిద్ర లేచింది మెుదలు రాత్రి పడుకునే దాక మెుబైల్ చూడనిదే రోజు గడవదు. అర నిమిషం పాటు కూడా ఫోన్ విడిచి ఉండలేం. వేలకు వేలు పెట్టి కొనుగోలు చేస్తాం. చిన్న పిల్లాడి కంటే ఎక్కువగానే జాగ్రత్తగా చూసుకుంటాం.
ఆ మెుబైల్ కి చార్జింగ్ (charging) లేకుంటే మాత్రం మనకు ప్రాణం పోతుంది. అంతలా గోల చేస్తాం. అమ్మో చార్జింగ్ లేదు. రెండు పాయింట్లే ఉంది త్వరగా పెట్టాలి అని స్విచ్ బోర్డు కోసం ఎదురు చూస్తాం. ఇలా ప్రతి నిమిషం ఫోనే ప్రపంచం అయింది. మన ప్రపంచమంతా మెుబైల్లోనే చూస్తున్నాం కాబట్టి అంతా జాగ్రత్త తీసుకుంటుున్నాం.
ఇదే సరే కానీ రోజుకు మెుబైల్ కి ఎన్ని సార్లు చార్జింగ్ పెట్టుకోవాలో తెలుసా? ఇది తెలియక చాలా మంది నానా ఇబ్బందులు పడుతుంటారు. చార్జింగ్ విషయంలో పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటారు నిపుణులు. ఏవి పడితే ఆ చార్జర్లలతో చార్జింగ్ ఎక్కించకూడదు. ఏ మెుబైల్ వాడుతున్నామో దానికి సంబంధించిన చార్జర్ ని మాత్రేమే వాడాల్సి ఉంటుందని చెబుతున్నారు.
అలా వాడకపోతే మొబైల్ ఫోన్లు పేలడం జరుగుతాయని అంటున్నారు. మరి అలాంటి ఫోన్లను రోజుకు ఎన్నిసార్లు చార్జింగ్ పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిపుణుల ప్రకారం, మొబైల్ ఫోన్ కి రోజుకు నాలుగు, ఐదుసార్లు వరకు చార్జింగ్ పెట్టవచ్చు. అంతకంటే ఎక్కువ సార్లు చార్జింగ్ చేయడంవల్ల ఫోన్ బ్యాటరీ త్వరగా దెబ్బతింటుంది. చార్జింగ్ విషయంలో ప్రస్తుత కాలంలో 100వాట్స్ పవర్ తో కూడిన ఛార్జర్స్ దొరుకుతున్నాయి.
ఇవి కేవలం 10 నిమిషాల్లోనే చార్జింగ్ ఫుల్ చేస్తున్నాయి. దీని ప్రకారం, బ్యాటరీ ఛార్జింగ్ 20-30% మధ్య ఉన్నప్పుడు ఛార్జ్ చేయాలి. అలాగే 100% అయ్యాక వెంటనే చార్జింగ్ స్విచ్ ఆఫ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల బ్యాటరీ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుందనన్నారు. ఫోన్లు కూడా ఎక్కువ పేలకుండా ఉంటాయని చెబుతున్నారు.
అలాగే చార్జింగ్ తక్కువ ఉన్న సమయంలో చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడడం కూడా చాలా ప్రమాదకరం అని చెబుతున్నారు. చార్జింగ్ అయిన తర్వాత ఫోన్ మాట్లాడాలని సూచిస్తున్నారు. మెుబైల్ చార్జింగ్ కెపాసిని బట్టి మనం చార్జింగ్ పెట్టుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.