వేసవిలో కాటన్ దుస్తులు సౌకర్యవంతంగా ఉంటాయి, అవి చెమటను గ్రహించే లక్షణం కలిగి ఉండటం వల్ల చాలా ప్రజల మన్ననను పొందాయి. కానీ, మార్కెట్లో అనేక రకాల నకిలీ కాటన్ దుస్తులు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల, అసలైన కాటన్‌ను ఎలా గుర్తించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
బర్నింగ్ టెస్ట్ (కాల్చే పరీక్ష): కాటన్ దుస్తుల చిన్న ముక్కను తీసుకొని కాల్చండి. అసలైన కాటన్ దుస్తులు కాగితంలాగా కాలిపోతాయి. చెక్క లేదా కాగితంలాగా వాసన వస్తుంది. కానీ నకిలీ కాటన్ దుస్తులు ప్లాస్టిక్ లాగా కాలిపోతాయి.
టచ్ అండ్ ఫీలింగ్ టెస్ట్ (తాకి చూసే పరీక్ష): అసలైన కాటన్ మృదువుగా, చల్లగా అనిపిస్తుంది. నకిలీ కాటన్ జిడ్డుగా లేదా గరుకుగా ఉండవచ్చు, వేడి వాతావరణంలో శరీరానికి అంటుకుంటుంది.
వాటర్ అబ్సార్ప్షన్ టెస్ట్ (నీటిని గ్రహించే పరీక్ష): కాటన్ దుస్తులు నీటిని త్వరగా గ్రహిస్తాయి. అయితే, నకిలీ కాటన్ దుస్తులు నీటిని స్లోగా గ్రహిస్తాయి లేదా జారిపోతాయి.
దారాన్ని లాగి చూడండి: కాటన్ దారాన్ని లాగినప్పుడు అది సులభంగా తెగిపోతుంది. కానీ, నకిలీ కాటన్ దుస్తులు లాగినప్పుడు సాగేలా ఉండి తెగిపోదు.
లేబుల్స్, ధర: “100% కాటన్” అని ఉన్న లేబుల్స్ చూసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అసలైన కాటన్ ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది, అయితే నకిలీ కాటన్ సింపుల్, తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది.