మిసెస్ ఇండియా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ 2025 గ్రాండ్ ఫినాలే ఫ్యాషన్ షో ఆద్యంతం ఆసక్తిగా సాగింది.
వివాహిత మహిళల కోసం అతిపెద్ద వేదిక అయిన మిసెస్ ఇండియా తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్, మమతా త్రివేది ఆధ్వర్యంలో 2025 గ్రాండ్ ఫినాలే ఫ్యాషన్ షో హైదరాబాద్ నగరంలో ఘనంగా సాగింది. మిసెస్ ఇండియా తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ 2025 ఫ్యాషన్ షోలో బ్యూటీలు తమ క్యాట్ వాక్ తో వావ్ అనిపించుకున్నారు.
70 మంది బ్యూటీస్ మధ్య
మూడు కేటగిరీలలో జరిగిన ఈ మిసెస్ ఇండియా తెలంగాణ-ఏపీ పోటీల్లో 70 మంది బ్యూటీలు పోటీ పడ్డారు. ఈ ఫ్యాషన్ థీమ్ ఉమెన్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ కావటం హైలైట్. గద్వాల్ చీర భారతదేశం లోని మహబూబ్ నగర్ జిల్లాలో తయారవుతున్న సాంప్రదాయక సారీస్ ని, గద్వాల్ చేనేత కార్మికులకు మద్దతు ఇవ్వడం కోసమే చేనేత వస్త్రాలతో ఈ ఈవెంట్ నిర్వహించినట్టు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డి.కె. అరుణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మిసెస్ ఇండియా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విజేతలు:
శ్రీమతి కేటగిరీ – లక్ష్మి తేజ, క్లాసిక్ కేటగిరీ – మైత్రేయి అమృత సారంగి, సూపర్ క్లాసిక్ కేటగిరీ – డా. రష్మీ కండ్లికర్ తెలంగాణ నుండి ఇతర కిరీట విజేతలు సాక్షి జైన్, డా. సుష్మా రెడ్డి, సుదీప్తా డాష్, నిత్య సోని, మితాలీ ఆగ్రావాల్ కొనకంచి, అర్పితా మజుందార్, ప్రియాంక తారే, శ్రుతి జె, డా. పి సీత, మనోరంజని శ్రీమతి భారతదేశం ఆంధ్రప్రదేశ్ విజేతలు, శ్రీమతి కేటగిరీ – పులిపాటి విశాలాఖ్మి, క్లాసిక్ కేటగిరీ – డా. యక్కల రాజ్యలక్ష్మి ఏపీ నుండి ఇతర కిరీట విజేతలు, కావ్య మండవ, డాక్టర్ విజయ స్పందన తెలంగాణ, దేవగుప్తపు లలిత భారతదేశం , ఎన్‌ఆర్‌ఐ విజేతలు వర్గం – సానియా ఆరిఫ్ షేక్, క్లాసిక్ కేటగిరీ – బిందు ప్రియా జైస్వాల్ విజేతలుగా నిలిచారు.