Friday, November 22, 2024
Homeఫీచర్స్Preserving fruits & Veg: పళ్లు, కూరగాయలు ఫ్రెష్ గా..

Preserving fruits & Veg: పళ్లు, కూరగాయలు ఫ్రెష్ గా..

సీల్డ్ బ్యాగులో బ్రెడ్ ను పెట్టి ఫ్రీజర్ లో ఉంచితే మూడు నెలలు ఉంటుంది

వంటింటి వస్తువులు ఇలా భద్రం చేద్దాం…

- Advertisement -

ఇంట్లోని పండ్లు, కూరగాయలు, పప్పుదినుసులు, సుగంధద్రవ్యాలు వంటివి పాడవకుండా ఉండాలంటే వాటిని భద్రం చేసే టిప్ప్ కొన్ని ఉన్నాయి. వీటిని ఎక్కడ, ఎలా భద్రం చేయాలో తెలుసుకుందాం.

యాపిల్ పండ్లను రిఫ్రిజిరేటర్ అరలో అలాగే భద్రం చేస్తే మూడు వారాల వరకూ ఉంటాయి. అవకెడో ముక్కను రిఫ్రిజిరేటర్ అరలో భద్రం చేయొచ్చు. దీని గుజ్జుపై నిమ్మరసం పిండి ప్లాస్టిక్ కాగితంలో చుట్టి పెడితే అది తాజాగా ఉంటుంది. సిట్రస్ పండ్ల విషయానికి వస్తే వీటిని కాగితం, ప్లాస్టిక్ కవర్స్ లో చుట్టబెట్టకుండా రిఫ్రిజిరేటర్ అరలో రెండు వారాలు భద్రం చేయొచ్చు. ద్రాక్ష పండ్లను పెర్ఫొరేటెడ్ ప్లాస్టిక్ బ్యాగులో ఉంచి రిఫ్రిజిరేటర్ అరలో ఉంచితే వారం నుంచి పది రోజులు ఉంటాయి. ఖర్బూజా కాయను కోసి ప్లాస్టిక్ కవర్లో చుట్టి రిఫ్రిజిరేటర్ అరలో పెడితే ఆ పండు ముక్క పాడవదు. పియర్ పండు బాగా పండిన తర్వాత నాలుగు రోజులు ఉంటుంది. దీన్ని ప్లాస్టిక్, పేపరు కవర్లు వేటిల్లోనూ చుట్టబెట్టకూడదు. పండిన అవకెడోను రిఫ్రిజిరేటర్లో అలాగే ఉంచితే నాలుగురోజుల పాటు పాడవకుండా ఉంటుంది.

అరటి పండ్లను కూడా అలాగే వదిలేస్తే మూడు రోజులు ఉంటాయి.  బెర్రీలను రిఫ్రిజిరేటర్ అరలో పెట్టొచ్చు. ఇవి మూడు నుంచి ఐదు రోజుల పాటు పాడవకుండా ఉంటాయి. తరిగిన సిట్రస్ పండ్ల ముక్కలను ప్లాస్టిక్ కవరులో చుట్టి రిఫ్రిజిరేటర్ అరలో ఉంచితే రెండు లేదా మూడు రోజులు బాగుంటాయి.  కూరగాయల విషయానికి వస్తే బెల్ పెప్పర్ ని ప్లాస్టిక్ బ్యాగులో ఉంచి రిఫ్రిజిరేటర్ అరలో పెడితే వారం రోజులు ఎంతో బాగా ఉంటాయి. క్యాబేజీని ప్లాస్టిక్ కవరులో చుట్టి రిఫ్రిజిరరేటర్ అరలో పెడితే రెండు వారాలు ఉంటుంది. కాలిఫ్లవర్ ని కూడా ప్లాస్టిక్ కవరులో చుట్టి రిఫ్రిజిరేటర్ అరలో పెడితే ఐదు రోజులు తాజాగా ఉంటుంది. కీరకాయను ప్లాస్టిక్ కవరులో చుట్టి రిఫ్రిజిరేటర్ అరలో ఉంచితే వారం రోజుల పాటు పాడవకుండా ఉంటుంది. తరిగిన అల్లం ముక్కలను డ్రై పేపర్ టవల్ ఉన్న ప్లాస్టిక్ బ్యాగులో ఉంచి రిఫ్రిజిరేటర్ అరలో ఉంచితే ఒకటి నుంచి రెండు వారాలు ఉంటుంది.

బ్రొకోలీలాంటి దానిని ప్లాస్టిక్ కవరులో చుట్టి రిఫ్రిజిరేటర్ అరలో ఉంచితే ఐదు రోజులు తాజాగా ఉంటుంది. క్యారెట్లను కూడా ప్లాస్టిక్ కవరులో చుట్టి రిఫ్రిజరేటర్ అరలో ఉంచితే మూడు వారాల పాటు పాడవకుండా ఉంటాయి. ఆకుకూరలను డ్రై పేపర్ టవల్ ఉన్న ప్లాస్టిక్ బ్యాగులో పెడితే ఒక వారం పాటు బాగా ఉంటాయి. అల్లం గడ్డను అలాగే ఫ్రిజ్ లో పెడితే నెల రోజులు ఉంటుంది. పుట్టగొడుగులను పేపర్ బ్యాగులో భ్రదం చేసి రిఫ్రిజిరేటర్ అరలో పెడితే మూడు రోజులు ఉంటాయి. చిలకడదుంపలను చీకటిగా ఉన్న చోట పేపర్ బ్యాగులో ఉంచి భద్రం చేస్తే రెండు వారాలు నిల్వ ఉంటాయి. వంటల్లో వాడే తులసి, కొత్తిమీర, రోజ్ మేరీ ఆకులు, షీవ్ వంటి వాటిని రిఫ్రిజిరేటర్ అరలో భద్రం చేయొచ్చు. అయితే కొత్తిమీరను ప్లాస్టిక్ కవరులో గట్టిగా పెట్టి ఫ్రిజ్ లో ఉంచాలి. రోజ్ మేరీని కూడా ప్లాస్టిక్ కవర్ లో గట్టిగా చుట్టి రిఫ్రిజిరేటర్ అరలో ఉంచితే రెండు వారాల పాటు బాగా ఉంటుంది. చివరిగా మాంసం, గుడ్లు, చేపలు వంటివాటిని భద్రం గా ఉంచుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

మాసం వంటి వాటిని సీల్డ్ కవరులో ఉంచి గాలి చొరబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేస్తే రెండు వారాలు ఉంటాయి. లేదా గాలి చొరబడని బ్యాగుల్లో పెట్టి ఫ్రీజర్ లో దీన్ని భద్రం చేయాలి. గుడ్లను రిఫ్రిజిరేటర్ అరలో ఉంచొచ్చు. పచ్చి చేపలను గాలి చొరబడని సీల్డ్ బ్యాగులో పెట్టి ఫ్రీజర్ లో ఉంచితే మూడు నుంచి ఆరు నెలలు ఉంటాయి. పచ్చి మాంసాన్ని గాలి చొరబడని సీల్డ్ బ్యాగులో పెట్టి ఫ్రీజర్ లో ఉంచితే మూడు నుంచి ఆరు నెలలు ఉంటుంది. స్మోక్డ్ ఫిష్ ను గాలి లేని సీల్డ్ బ్యాగులో ఉంచి రిఫ్రిజిరేటర్ అరలో ఉంచాలి. కవరు ఓపెన్ చేయకుండా అలాగే ఉంచితే అవి రెండు వారాలు ఉంటాయి. కవరు ఓపన్ చేస్తే ఐదు రోజులు ఉంటాయి. వీటిని గాలి చొరబడని సీల్డ్ కవర్లో పెట్టి ఫ్రీజర్ లో ఉంచితే ఆరు నెలలు ఉంటాయి. గాలి చొరబడని సీల్డ్ బ్యాగులో బ్రెడ్ ను పెట్టి ఫ్రీజర్ లో ఉంచితే మూడు నెలలు ఉంటుంది. సీల్డ్ బ్యాగులో పెట్టి బయటే ఉంచితే మూడు రోజలు ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News