ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే(Valentines Day)ను జరుపుకుంటారు. ఇది ప్రేమను ప్రకటించుకునేందుకు, మనసులోని భావాలను పంచుకునేందుకు అద్భుతమైన రోజు. ఇక ప్రేమికులకు వాలెంటైన్ వీక్ ఓ పండుగ లాంటిది. వాలెంటైన్స్ వీక్ అనేది ఏడు రోజుల వేడుక. ఒక్కో రోజు ఒక్కో రకమైన ఎక్స్‌ప్రెషన్‌తో తమ ప్రేమను చాటుకునే అవకాశాన్ని అందిస్తుంది. చివరగా గ్రాండ్ డే ఆఫ్ లవ్ వాలెంటైన్స్ డే కు జరుపుకుంటారు.
తొలి రోజు (ఫిబ్రవరి 7)న వాలెంటైన్స్ వీక్ ప్రారంభం అవుతుంది. ఈరోజు ప్రేమికులు తమ పార్ట్‌నర్స్‌కు వివిధ రకాల రోజ్ పూలతో ఫీలింగ్స్‌ను ఎక్స్‌ప్రెస్ చేస్తారు. ఒక్కో రంగు పువ్వుకు ఒక్కో అర్థం ఉంటుంది. ఆ పువ్వులను ఇచ్చి తమ మనసులోని మాటను వ్యక్తం చేస్తారు ప్రేమికులు.
ప్రపోజ్ డే: వాలెంటైన్స్ వీక్‌లో రెండో రోజైన ప్రపోజ్ డే (Propose Day) గా జరుపుకుంటారు. హృదయంలో గూడుకట్టుకున్న ప్రేమను వ్యక్తపరచడానికి ధైర్యం చేయాల్సి రోజు ఇదే. తమ పార్ట్‌నర్‌గా లేదా జీవిత భాగస్వామిగా ఉండమని కోరుతూ ప్రపోజ్ చేసుకునే అందమైన రోజు. ఇది వాలెంటైన్ వీక్ లో ఎంతో ప్రత్యేకమైన రోజు. ప్రేమ ఎప్పుడూ, ఎక్కడా, ఎలా పుట్టిందో చెప్పడం కష్టం.. కానీ దాన్ని ఎలా వ్యక్తపరిచామన్నది చాలా ముఖ్యం. ప్రేమించే వ్యక్తిని ఎలా ఇంప్రెస్ చేశామన్నదే ఈ రోజు స్పెషల్.
ప్రేమను వ్యక్తీకరించడం, ప్రియమైన వ్యక్తి మనసును గెలుచుకోవడం సులభమైన పని కాదు. నిజానికి, ప్రేమను ఒప్పించడం ఒక కళ. అందుకే ఈరోజు లవర్స్ కి ఎంతో ప్రత్యేకం. ప్రేమ అనుభూతి మాటల్లో చెప్పలేనిది, కానీ ప్రతి ఒక్కరూ దీనికి అతీతులు కారు. ఈ ప్రపోజ్ డే రోజున, మన హృదయంలోని ప్రేమను వ్యక్తపరచడానికి అనేక మార్గాలున్నాయి. ప్రియమైన వారికి ఇష్టమైన ప్రత్యేకమైన బహుమతి ఇవ్వడం లేదా కవిత పాట రూపంలో తమ ప్రేమను తెలియజేయడం. లేదా ఏదైనా ఆర్ట్ గీసి ప్రేమను వ్యక్త పరచడం చేయవచ్చు. ఇంకా ఇంకా క్రియేటివ్‌గా మీకు నచ్చిన సినిమా పాటను కోట్ చేస్తూ వాట్సాప్ మెసేజ్ ద్వారా ప్రేమను వ్యక్తపరచవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ భావాలను మీకు ఇష్టమైన వారి ముందు ఉంచి ఈ ప్రత్యేకమైన రోజును ఆస్వాదించండి.