Thursday, November 21, 2024
Homeఫీచర్స్Urfi Javed: మల్లికా షెరావత్ + రాఖీ సావంత్ + లేడీ గాగా= ఉర్ఫీ...

Urfi Javed: మల్లికా షెరావత్ + రాఖీ సావంత్ + లేడీ గాగా= ఉర్ఫీ జావేద్

ఆమె పిక్ సెన్సేషన్, ఆమె మాటలు క్రూడ్ బాంబులే.. “వెదర్ యు లవ్ ఆర్ హేట్ బట్ అయామ్ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ లైక్ దిస్” అని పదేపదే చెప్పే ఆమెకు ఇండియాలో పరిచయం అక్కర్లేదు. “నేను హై హీల్స్ తప్ప మామూలు చొప్పులతో నడవలేను” అని వయ్యారంగా మాట్లాడే ఉర్ఫీ చాలా ఇన్నోసెంట్ గా కూడా కనిపిస్తుంటారు. సెక్స్ బాంబ్, సెక్స్ సింబల్స్ గా పాపులర్ అయిన మల్లికా షెరావత్, రాఖీ సావంత్ ఫేడవుట్ అయ్యాక ఆ స్థాయిలో పాపులర్ అయినది ఎవరంటే అది ఉర్ఫీ మాత్రమే అని చెప్పాలి. ముస్లిం అయిన ఉర్ఫీపై ఫత్వా జారీ చేసినా ఆమె మాటలు, చేతల్లో మార్పు రాలేదు.

- Advertisement -

‘ఇండియన్ లేడీ గాగా’గా ఉర్ఫీ జావేద్ ను ఆమె ఫాలోయర్స్ కామెంట్స్ చేస్తుంటే ఉర్ఫీ మాత్రం దాన్ని ఓ కాంప్లిమెంట్ గా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నట్టు గర్వంగా చెబుతుంటారు.  అబ్సీన్ యాక్ట్ కింద లీగల్ ట్రబుల్స్ లో పడటం ఈమెకు చాలా ఇష్టమైన వ్యాపకం.  లేటెస్ట్ గా ఇదిగో ఈ కింద పిక్ చూశారుగా ..ఈ గెటప్ లో కనిపించి మళ్లీ హ్యాపీగా చిక్కుల్లో పడ్డారు ఉర్ఫీ. ఇలా హిందువులను, హిందువుల సెంటిమెంట్స్ ను దిగజార్చేలా చేయటమంటే ఈమెకు మహదానందం.

హాలోవిన్ పార్టీ కోసమట

హిందీ సినిమా భూల్ బులయ్యా సినిమాలోని ఛోటా పండిట్ అనే కామెడీ క్యారెక్టర్ గెటప్ లో తాను హాలోవిన్ పార్టీకి వెళ్లేందుకు రెడీ అయి.. లాస్ట్ లో ఆ పార్టీకి అటెండ్ కాలేకపోయినట్టు..,దీంతో ఇలా వీడియో చేసి వదులుతున్నట్టు ఉర్ఫి ఇన్స్టాలో పోస్ట్ చేయటం.. ఇదంతా క్షణాల్లో వైరల్ అయ్యేలా చేసింది.

సినిమాల్లో చిన్న రోల్స్

హిందీ బిగ్ బాస్ తోపాటు పలు టీవీ షోలు, మ్యూజిక్ ఆల్బమ్స్ లో కనిపించిన ఉర్ఫీ అడపాదడపా సినిమాల్లో చిన్న రూల్స్ ప్లే చేశారు.  కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె దూసుకుపోతున్నారు.  ఉర్ఫీ ఏదైనా అప్లోడ్ చేసిందంటే మాత్రం ఇక సోషల్ మీడియాలో రచ్చ స్టార్ట్ అయినట్టే లెక్క.  ఈమెపైన ఎన్ని విమర్శలు వచ్చినా, మీమ్స్, ట్రోల్స్ ఇలాంటి ఎంత నెగటివ్ రియాక్షన్ వచ్చినా డోన్ట్ కేర్ అనే ఉర్ఫీ అసలు ఇలాంటి రియాక్షన్ కోసమే ఇవన్నీ చేసి, సెన్సేషనల్ క్వీన్ అనిపించుకుంటూ క్రేజీ ఇన్ఫ్లూయెన్సర్ గా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.

ట్రైన్డ్ కథక్ డ్యాన్సర్ కూడా..

నిజానికి ఉర్ఫీ ఏమీ టాలెంట్ లేని వ్యక్తికాదు..ఆమె ట్రైన్డ్ కథక్ డ్యాన్సర్ కూడా.  కానీ ఇలాంటివేవీ ఆమెకు స్పెషల్ సెలబ్రిటీ అనే ట్యాగ్ ను తెచ్చిపెట్టలేకపోయాయి.  అందుకే తనదైన స్టైల్ క్రియేట్ చేసేందుకు ఆమె చిత్ర విచిత్రమైన గెటప్స్ వేయటం, వాటిని పోస్ట్ చేసి, వాటిపై అంతకంటే చిత్రమైన కామెంట్స్, రైటప్స్ పెట్టి చాలా తక్కువ టైంలోనే అందరి దృష్టిలో పడ్డారు. 

టీవీ నటి

హెయిర్ స్టైల్, బట్టలు, మేకప్ ఇలా ఏవైనా డిఫరెంట్ గా ఉండేలా ప్లాన్ చేసుకునే ఉర్ఫీకి క్రేజీ స్టార్ కావాలనే ఉబలాటం ఎక్కువ.  గతంలో టీవీ సీరియల్స్ లో నటించిన ఈమెకు వచ్చిన పాపులారిటీ ఏమాత్రం సరిపోలేదని, మోడల్ కూడా అయిన తనకు యునిక్ స్టైల్ సెన్స్ ఉందని చెప్పుకుంటూ ఇలాంటి వేషాలు వేస్తుంటారు.

హిందూ పండుగలే టార్గెట్

ఇక ఈమెకు హిందూ పండుగలే అసలు టార్గెట్.  దసరా, దీపావళి వంటి పండుగలు వస్తే ఆమె వేసే వేషాలు చిరాకు తెప్పించి, కొన్ని సంస్థలు ఆమెపై న్యూసెన్స్ కేసులు వేసేవరకూ పోతాయి. అయినా ఆమె ప్రవర్తనలో మాత్రం మార్పు లేదు, రాదు.  అదేమంటే నేనింతే అంటారు ఉర్ఫీ.  నచ్చకపోతే అన్ ఫాలో చేయ్ అని గట్టిగా చెప్పేసి చేతులు దులుపుకుంటుంది. 

టాప్లెస్ క్వీన్

జస్ట్ అందాలు ఆరబోసే టాప్లెస్ పిక్స్ కు ఈమె కేరాఫ్ గా మారారు.  దీంతో కుర్రకారు ఈమెను బాగా ఫాలో అయిపోవటంతో ఉర్ఫీ సెలబ్రిటీ అయిపోయి, చేతినిండా సంపాదించేస్తూ, సెలబ్రిటీ ఇమేజ్ ఎంజాయ్ చేసే ఛాన్స్ కొట్టేశారన్నమాట. 

గూగుల్ సీఈవో సుందర్ పిచ్చకంటే జీతమెక్కువ!

కానీ ఈమె ఒక ఎపిసోడ్ లో యాక్ట్ చేసేందుకు కనీసం 40 వేలకు పైగా ఛార్జ్ చేసేంత డిమాండ్ ఉన్న నటి.  చాలా తక్కువ మందికి తెలిసిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇది.  గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చయ్ కంటే నెలకు ఇంకా ఎక్కువ జీతం సంపాదించే ఉర్ఫీ చాలా పెద్ద డ్రీమ్స్ తో ఊరిస్తుంటారు.  తాను బేసికల్లీ చాలా హాట్ అని చెప్పుకునే ఈమెకు గ్లోబల్ ఇమేజ్ ఉండటం మరో ఆసక్తికరమైన విషయం.  కొరియన్ పాప్ స్టార్స్ కూడా ఈమెను ఫాలో అవుతారు అంతేకాదు అక్కడ కూడా ఈమె ఓ సెలబ్రిటీ తెలుసా.

తానో హాట్ స్టార్ అని, తన ఒంటిపై బట్టలు నిలవవని చాలా బోల్డ్ గా కామెంట్స్ చేస్తూ, ఇంటర్వ్యూలు ఇస్తూ ఐటెం బాంబ్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్న ఉర్ఫీ త్వరలో ఓ ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఆల్బం ద్వారా గ్లోబల్ స్టార్ అయ్యే పనుల్లో బిజీగా ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News