ఎండు రొయ్యలు..ఈ పేరు వినగానే చాలామందికి నోరూరుతుంది. మరి కొందరికైతే దీనికి దూరంగా ఉంటారు. రొయ్యలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. ఇది ఒక రకమైన సముద్ర ఆహారం. ఇది ప్రోటీన్ అద్భుతమైన మూలం. కేవలం 100 గ్రాముల రొయ్యల్లో దాదాపు 60–80 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో ఉండే అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కొవ్వు ఆమ్లాలు కండరాల బలం, రోగనిరోధక శక్తి, పిల్లల పెరుగుదలను ప్రేరేపించడం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు ప్రయోజనకరంగా ఉంటుంది.
రొయ్యలలో అయోడిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది థైరాయిడ్, గాయిటర్ రోగులకు చాలా ముఖ్యమైనదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఎండు రొయ్యలు అధిక ప్రొటీన్ మూలం. ఇది కండరాలు, చర్మం, ఇతర శరీర కణాల నిర్మాణానికి ప్రయోజనకరంగా ఉంటుంది. రొయ్యల్లో లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
క్రమం తప్పకుండా రొయ్యలను తింటే, కడుపు, ప్రేగుల ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. రొయ్యలు తినడం వల్ల కడుపు, పేగు కణజాలాలకు మేలు జరుగుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఎముకలను బలోపేతం చేయడానికి రొయ్యలు డైట్ లో చేర్చుకోవాలి. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
ఎండు రొయ్యలు బరువును కూడా తగ్గిస్తాయి. వీటిలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి బరువు తగ్గుతారు.