వేసవికాలంలో మామిడి పండ్ల కోసం ఎంతగా ఎదురు చూస్తామో, శీతాకాలంలో కూడా చాలామంది సీతాఫలాల కోసం అలానే వేచి చూస్తుంటారు. దీనిని చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు తినడానికి ఎంతో ఇష్టపడతారు. ఇది కొనడానికి ధరలో తక్కువగానే ఉన్న సీతాఫలంలో ఉండే పోషకాలు అనేకం. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణ సమస్యలు ఉన్నవారు సీతాఫలం అసలు తినకూడదు. ఎందుకంటే దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కావున దీనిని తినడం వల్ల కడుపు ఉబ్బరం, కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి
సీతాఫలం ఆరోగ్యమైనప్పటికీ, దాని విత్తనాలు విషపూరితమైనవి. కావున ఈ పండును తినేటప్పుడు విత్తనాలను తొలగించి, మింగకుండా తినాలి.
సీతాఫలం ఐరన్ కు మంచి మూలం అయినప్పటికీ, వీటిని అధికంగా తీసుకుంటే శరీరంలో ఎన్నో స్థాయిలను పెంచుతుంది. అందువల్ల కడుపునొప్పి, వికారం, మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చు.
సీతాఫలం తిన్న తర్వాత దురద, దద్దుర్లు, చికాకు లేదా ఇతర అలర్జీ లక్షణాలు కనిపిస్తే తినకపోవడమే మంచిది.