ప్రస్తుతం ఉన్న వాయి, శబ్ద కాలుష్యానికి నగరాలు, పట్టణాల్లో నివసించడం కష్టతరమే కాదు.. ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఉరుకుల, పరుగుల జీవితంలో వారానికో, నెలకోసారో స్వచ్ఛమైన గాలిని ప్రశాంతంగా పీల్చుకోవాలని ఉంటుంది. భారత్‌లోని అలాంటి ప్రశాంతమైన ప్రదేశాల జాబితా మీకోసం..
మణిపూర్‌లోని ఇంఫాల్ గొప్ప సంస్కృతితో పాటు స్వచ్ఛమైన గాలి కలిగిన అరుదైన పట్టణ ప్రాంతం. ఉద్యానవనాలు, లోక్తక్ సరస్సు, కల్చరల్ హాట్‌స్పాట్, మీరు కాంగ్లా కోట ఇక్కడి పర్యాటక ప్రాంతాలు.
తమిళనాడు ఊటీలోని నీలగిరి పర్వత రైల్వే, సుగంధ ద్రవ్యాలతో కూడిన ప్రభుత్వ బొటానికల్ గార్డెన్, ఊటీ సరస్సులో బోటింగ్‌ను ఆస్వాదించవచ్చు.
కర్ణాటకలోని ఉడుపి.. ఇక్కడి బీచ్‌లలో ప్రశాంతమైన, స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించవచ్చు. ఐకానిక్ శ్రీ కృష్ణ ఆలయం, పురాతన పుణ్యక్షేత్రాలు, మాల్పే బీచ్, సుందరమైన సెయింట్ మేరీస్ ద్వీపం, మీకు ఆహ్లాదకరమైన విహారయాత్రను అందిస్తుంది.
మిజోరంలోని ఐజ్వాల్ దుర్ట్లాంగ్ కొండలు, మిజోరం స్టేట్ మ్యూజియం మీకు ఉత్సాహభరితమైన టూర్ అనుభవాన్ని అందిస్తుంది.
త్రిపురలోని అగర్తలలో సరస్సు ఒడ్డున ఉజ్జయంత ప్యాలెస్, సెపాహిజల వన్యప్రాణుల అభయారణ్యం, డంబూర్ సరస్సులో పడవ ప్రయాణాలతో మీరు బిజీ లైఫ్ నుంచి ఉపశమనం పొందవచ్చు.
అస్సాంలోని గౌహతి నుంచి 4 గంటల ప్రయాణం చేస్తే జోర్హాట్లో ప్రఖ్యాత మజులి ద్వీపం, బ్రహ్మపుత్ర, గిరిజన సంస్కృతి మీకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది.