కాల్చిన మొక్కజొన్న రుచితోపాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని పెంచి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి
మొక్కజొన్నలో సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవచ్చు. అందుకే మధుమేహ రోగులు దీనిని పరిమితంగా తినాలి.
మొక్కజొన్నలో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియకు మంచిదే అయినప్పటికీ.. కడుపు ఉబ్బరం, గ్యాస్, లేదా IBS వంటి సమస్యలు ఉన్నవారికి ఇబ్బందులు కలిగించవచ్చు.
మొక్కజొన్నలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు ఎక్కువగా తింటే వారి డైట్ దెబ్బతినవచ్చు. ఇది కేలరీల స్థాయిని పెంచి, బరువు తగ్గడం కష్టతరం చేస్తుంది.
కిడ్నీ రోగులు మొక్కజొన్న మంచిది కాదు. ఎందుకంటే ఇందులో పొటాషియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఇది హానికరం. ఇది కిడ్నీలపై అదనపు ఒత్తిడి పెంచుతుంది.
గుండె జబ్బులు ఉన్నవారు మొక్కజొన్న తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఉప్పు లేదా వెన్నతో తింటే గుండె రోగులకు ప్రమాదకరం. అదనపు సోడియం, కొవ్వు గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.