Sunday, November 16, 2025
Homeగ్యాలరీBeauty Tips: మెరిసే చర్మం కోసం 5 చిట్కాలు.. ఫాలో అయితే అందం మీసొంతం..!

Beauty Tips: మెరిసే చర్మం కోసం 5 చిట్కాలు.. ఫాలో అయితే అందం మీసొంతం..!

Face Beauty Tips:ముఖం నిగారింపు, స్పష్టమైన స్కిన్ టోన్ కోసం చాలామంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.. అయినప్పటికీ, ఎలాంటి మార్పు కనిపించదు. అందమైన, స్పష్టమైన స్కిన్ టోన్ కోసం ఆహారంలో మార్పులు చేసుకోవాలని బ్యూటీషియన్లు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

అందమైన స్కిన్‌ టోన్‌ కోసం ప్రతి ఒక్కరూ 5 ఆరోగ్య నియమాలను పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. ఇందులోని విటమిన్ సి ముఖంపై వృద్ధాప్య ఛాయలను, మొటిమలను తగ్గిస్తుంది.
నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించి చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది.
చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపించి ముఖం నిగారించేలా చేస్తుంది.
ద్రాక్షల్లో ప్రోయాంతో సైనిడిన్ యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది సూర్యుడి హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని కాపాడి ప్రకాశవంతంగా చేస్తుంది.
కివిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad