DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే జీతాలు భారీగా పెరగనున్నాయి. ఈసారి 4శాతం డియర్నెస్ అలవెన్స్ పెరిగే అవకాశాలు న్నాయి. ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రీయల్ వర్కర్స్(AICPI-IW) మే నెలలో 0.5 పాయింట్ల మేర పెరిగి 144కు చేరింది.
AICPI మార్చి నెలలో 143 వద్ద ఉండగా.. ఏప్రిల్లో 0.5 పాయింట్లు పెరిగి 143.5కు చేరింది. ఇక మేలో 0.5 పాయింట్లు పెరిగి 144కు చేరుకుంది. జూన్ నెలలో కూడా 0.5 పాయింట్లు పెరిగితే డీఏ 3శాతం నుంచి 4శాతం వరకు పెరుగుతుందని అంచనావ వేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం జూలై 2025 నుండి 4శాతం డీఏ పెంచితే, ప్రస్తుతం ఉన్న 55 శాతం డీఏ 55 శాతానికి పెరుగుతుంది. ఈ నిర్ణయం ఉద్యోగులకు పెద్ద ఉపశమనం కలిగించవచ్చు. దీపావళి పండుగ కానుకగా డీఏ పెంపు ప్రకటన వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
డీఏ ప్రకటన ఎప్పుడు ఉంటుందనేది ప్రభుత్వం నుండి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ డీఏ పెంపు నిర్ణయం సెప్టెంబర్- అక్టోబర్ సమయాల్లో తీసుకుంటుంది. దీపావళికి ముందు ఈ ప్రకటన చేస్తే కొత్త డీఏ జూలై 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. చివరిసారి కూడా డీఏ నిర్ణయాలు జనవరి 1, 2025 నుండి అమల్లోకి వచ్చాయి.
ఇదిలా ఉంటే ఇటీవల 8వ వేతన సంఘానికి సూత్రప్రాయంగా కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే కమిటీ ఇంకా ఏర్పాటు కాలేదు. ఆగస్టు 2025 చివరి నాటికి కమిటీ ఏర్పాటు అవుతుందని భావిస్తున్నారు. అంతా షెడ్యూల్ ప్రకారం జరిగితే 8వ వేతన సంఘం సిఫార్పులు 2027 మధ్య నాటికి అమలు కావచ్చు.
8వ వేతన సంఘం అమల్లోకి వస్తే జీతాలు, అలవెన్సులు, పదోన్నతిలో పెద్ద మార్పులు జరిగే అవకాశం ఉంది. మొత్తానికి 2025 ద్వితీయార్థంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఉపశమనం కలిగే వార్తలు అందనున్నాయి.