పప్పు ధాన్యాల్లో పోషకాలు పుష్కంగా ఉంటాయి. అవి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచివి.
పెసరపప్పు మనం రెగ్యులర్గా వాడుకునే పప్పు.చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆ రోగ్యం కూడా మెరుగ్గా మారుతుంది. బీపి తగ్గుతుంది.
ఎర్ర కందిపప్పు ఫైబర్, ప్రోటీన్, ఐరన్, విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. బాడీలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
శనగపప్పు కూడా ప్రోటీన్ ఉంటుంది.కొలెస్ట్రాల్, బీపి తగ్గడమే కాకుండా గుండె ఆరోగ్యం మెరగువుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
రాజ్మాని కూడా చాలా మంది తీసుకుంటారు. కిడ్నీ బీన్స్ అని పిలిచే ఈ పప్పుని తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బ్లడ్ ప్రెజర్ రెగ్యులేట్ అవుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.
మినపప్పు లోని ఫైబర్ జీర్ణ సమస్యల్ని తగ్గించి ఎముకల్ని బలంగా చేస్తాయి. అంతేకాకుండా ఈ పప్పులో రిచ్ మినరల్స్ ఉంటాయి. వీటితోపాటు ఇందులోని ఐరన్, ప్రోటీన్లు ఎనర్జీని పెంచుతాయి.