Trust Issues: బంధం అంటేనే నమ్మకం. ముఖ్యంగా వివాహ బంధంలో నమ్మకం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఒక వేళ ఇద్దరి మధ్య నమ్మకం లేకపోతే ఆ బంధాలు ఎక్కువరోజులు కొనసాగడం కష్టం. అయితే మిమ్మల్ని మీ భాగస్వామి మోసం చేస్తున్నారా.. లేదా అనేది ఇట్టే గుర్తుపట్టొచ్చు. అదెలాగో తెలుసుకుందాం!
- Advertisement -
సాధారణంగా మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేయాలనుకుంటే మీ నుంచి ప్రతి విషయాన్ని సీక్రెట్‌గా ఉంచాలని చూస్తారు.గతంలో మీ ముందే ఫోన్‌ను యూజ్ చేసే మీ భాగస్వామి.. అకస్మాత్తుగా ఫోన్‌కు సీక్రెట్ లాక్స్ పెట్టడం, అర్థరాత్రి మెసేజ్‌లు చేయడం వంటివి చేస్తారు.ప్రతి ఒక్కరూ గోప్యతను కోరుకుంటారు. కానీ మీ భాగస్వామి ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పును మీరు గమనించినట్లయితే వారు మీ నుంచి ఏదో దాస్తున్నారని అర్థం.మీ భాగస్వామి పని సాకుతో తరచుగా ఇంటికి ఆలస్యంగా రావడం ప్రారంభిస్తే.. మీ ఫోన్‌కు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వకపోతే వారు తమ జీవితంలో ఏదో దాస్తున్నారని అర్థం.NOTE: పైన పేర్కొన్న పలు అంశాలు వైద్య నిపుణులు, సామాజిక మాధ్యమాల నుంచి సేకరించినవి మాత్రమే.. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే నిపుణులను సంప్రదించండి. వీటిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు