ర్యాంప్ వాక్‌పై హొయలు పోతూ కుర్రకారు మతి పోగొట్టిన కాశిష్ మెత్వానీ… 24 ఏళ్ల వయసులోనే తుపాకీ పట్టి శత్రు మూకల పని పట్టేందుకు సిద్ధమయ్యారు. మిస్ ఇంటర్నేషనల్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్న కాశిష్ మెత్వానీ.. ఆ తర్వాత భారత సైన్యంలో చేరారు.
2023 మిస్ ఇంటర్నేషనల్ ఇండియాగా నిలిచిన కాశిష్ మెత్వానీ.. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీలో చేరి కఠినమైన శిక్షణను పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు లెఫ్టినెంట్‌గా ఎంపికయ్యారు.
మహారాష్ట్ర పూణెకి చెందిన కాశిష్ మెత్వానీ.. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో పీహెచ్డీ సీటును సైతం ఈమె దక్కించుకున్నారు. అయితే ఆ ఆఫర్‌ను తిరస్కరించి భారత సైన్యంలో చేరు.
కాశిష్ మెత్వానీలో ఈ టాలెంట్లు మాత్రమే కాకుండా సేవా గుణం కూడా ఉంది. 19 ఏళ్ల వయసులో ఉండగానే.. క్రిటికల్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ప్లాస్మా, రక్తం, అవయవ దానం వంటి వాటిని ప్రోత్సహించారు.
చిన్నప్పటి నుంచి సైనిక పాఠశాలలో చదువుకున్న కాశిష్.. కాలేజీలో ఉండగా ఎన్సీసీలో చేరారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో భాగంగా మార్చ్‌లో పాల్గొని.. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా.. ఉత్తమ క్యాడెట్ అవార్డు అందుకున్నారు. అప్పుడే తాను సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఈ ముద్దుగుమ్మ చెబుతోంది.
2024లో సీడీఎస్ పరీక్ష రాసి నేషనల్ లెవల్లో రెండో ర్యాంకుతో సత్తా చాటారు. అనంతరం చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఏడాదిపాటు మెత్వాని శిక్షణ పూర్తి చేసుకున్నారు.