కానీ శరీరానికి అవసరమైన విశ్రాంతిని ఇవ్వకపోతే, అంతర్గత వ్యవస్థలు దెబ్బతింటాయి. దీని ప్రభావం చాలా దీర్ఘకాలికమైనదిగా ఉంటుందనీ, చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుండి మొదలై తీవ్రమైన వ్యాధుల వరకు మారతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక నిద్రలేమి కారణంగా టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం 36 శాతం వరకు పెరుగుతుందని అధ్యయనంలో వెల్లడైంది.అలాగే, కిడ్నీ పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని, దాదాపు 22 శాతం మందిలో కిడ్నీ డిజార్డర్స్ ఏర్పడే ముప్పు ఉందని చెబుతున్నారు.
కేవలం డయాబెటిస్, కిడ్నీలు మాత్రమే కాకుండా, దాదాపు 92 రకాల వ్యాధులు నిద్రలేమితో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. దీన్నిబట్టి చూస్తే సరైన నిద్ర ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. ఇందులో గుండె సంబంధిత వ్యాధులు, హార్మోన్ అసమతుల్యతలు, జీర్ణ సమస్యలు, అధిక రక్తపోటు, అల్జీమర్స్ వంటి సమస్యలు కూడా ఉన్నాయి.
సరైన నిద్ర లేకపోతే శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తి అధికమవుతుందట. సాధారణంగా ఇవి శరీర రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. కానీ అవి అనవసరంగా అధికంగా తయారవుతుంటే, అది శరీరంలో ఇన్ఫ్లమేషన్ కి సూచనగా తీసుకోవచ్చు.
స్లీప్ డిజార్డర్ ఉన్న వ్యక్తులు ఏకకాలంలో అనేక వ్యాధులకు బలవుతున్నారు. ఈ కారణంగా, నిద్ర సమస్యలను చిన్నవిగా తీసుకోవడం తగదు. సమస్య మొదటి దశలో ఉండగానే పరిష్కారం కనుగొనడం చాలా అవసరం.