బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్. 2025 నవంబర్ 1 నుంచి బ్యాంక్ ఖాతాదారులకు అనుకూలంగా ఆర్బీఐ పలు సవరణలు చేసింది.
సెక్షన్లు 10, 11, 12, 13 నిబంధనల ప్రకారం.. డిపాజిట్ ఖాతాలు, సురక్షిత కస్టడీలో ఉన్న వస్తువులు, బ్యాంకులు నిర్వహించే భద్రతా లాకర్ల విషయాలకు సంబంధించిన నామినేషన్ల విధానంలో మార్పులు చేసింది.
బ్యాంక్ ఖాతాలు, లాకర్లకు నలుగురి వరకు నామినీలను ఎంచుకునేలా ఆర్బీఐ సవరణలు చేసింది. దీనివల్ల క్లెయిమ్ పరిష్కారం సులభతరం అవుతుందని ఆర్బీఐ పేర్కొంది.
డిపాజిట్ ఖాతాలకు ఏకకాలంలో లేదా వరుసగా నామినేషన్లు చేసుకునేలా మార్పులు చేసింది. ప్రతి నామినీకి వాటా లేదా అర్హత శాతాన్ని పేర్కొనవచ్చు, మొత్తం 100 శాతానికి సమానంగా ఉండేలా చూసుకోవాలి,
సేఫ్ కస్టడీ, సేఫ్టీ లాకర్లలో ఉన్న వస్తువులకు నామినేషన్ విషయానికొస్తే, వరుసగా నామినేషన్లు మాత్రమే అనుమతించనుంది.
బ్యాంకింగ్ వ్యవస్థ అంతటా క్లెయిమ్ పరిష్కారంలో ఏకరూపత, సామర్థ్యాన్ని నిర్ధారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది.