Intresting facts about Malala Yousafzai: నోబెల్ శాంతి అవార్డు గ్రహీత మలాలా యూసుఫ్‌జాయ్ దినోత్సవం సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర వియాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆమె 11 సంవత్సరాల వయసులో తాలిబాన్ పాలనలో జీవితం గురించి గుల్ మకాయ్ అనే మారుపేరుతో బీబీసీకి ఓ బ్లాగ్ రాశారు. తాలిబాన్ పాలనలో విద్యను పొందలేకపోవడం వల్ల కలిగే భయాల గురించి ఆమె అందులో చక్కగా వివరించారు. 2020లో మలాలా యూసఫ్‌జాయ్ జీవితం గురించి ‘గుల్ మకాయ్’ అనే పుస్తకం విడుదలైంది.
మలాలా నోబెల్ శాంఎతి బహుమతితో సహా 50కి పైగా అవార్డులు, గౌరవాలను అందుకున్నారు. ఇందులో ముఖ్యంగా 2011లో జాతీయ యువ శాంతి బహుమతి, 2013లో అంతర్జాతీయ పిల్లల(నోబెల్) శాంతి బహుమతి, 2015లో గ్రామీ ఫర్ బెస్ట్ చిల్డ్రన్స్ అవార్డులు ఉన్నాయి.
మలాలా చిన్నప్పటి నుంచీ రాజకీయ అవినీతిని చూశారు. వాలి అని పిలువబడే ప్రాంతీయ గవర్నర్లు స్వాత్ లోయలో నది వెంబడి కొత్త రోడ్లు నిర్మించేవారు. అయినప్పటికీ పెషావర్ ప్రాంతీయ అసెంబ్లీకి ఎన్నికైన చాలా మంది రాజకీయ నాయకులు ఎన్నికైన వెంటనే అదృశ్యమవ్వడం మలాలాను ఆలోచింపచేసింది.
ముఖ్యంగా ఈద్ సెలవుల్లో కుటుంబ పర్యటనలలో ఆమె ఎక్కువగా నకిలీ వివాహాలు ఆటలు ఆడుకునేవారు. ఇందులో ఆటగాళ్ళు రెండు గ్రూపులుగా ఏర్పడి పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయిని ఎంపిక చేసుకునేవారు.
ఇక వాతావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్, తుపాకీ నియంత్రణ ప్రచారకర్త ఎమ్మా గొంజాలెజ్ ఇద్దరూ మలాలా యూసఫ్‌జాయ్ సన్నిహితులు.
తన తండ్రి ప్రోత్సాహంతో మలాలా బిబిసి ఉర్దూ కోసం గుల్ మకై అనే కలం పేరుతో ఒక పత్రిక రాయడానికి అంగీకరించారు. తాలిబాన్ పాలనలో ఏడవ తరగతి పాకిస్తానీ పాఠశాల విద్యార్థినిగా తన అనుభవాలను పంచుకున్నారు. తాలిబన్లు వందలాది బాలికల పాఠశాలలు, విద్యా సంస్థలను ఎలా నాశనం చేస్తున్నారో బీబీసీకి వివరించేవారు.
లౌకికవాదాన్ని ప్రోత్సహించినందుకు యుక్తవయసులో ఉన్నప్పుడు తాలిబన్లు మలాలాను కాల్చారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌కు తరలించారు. ఈ క్రమంలో ముస్లిం మెజారిటీ దేశంలో మహిళలను ప్రోత్సహించేందుకు మలాలా తన వంతు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. పాకిస్తాన్ దివంగత ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో స్థానాన్ని భర్తీ చేసేలా పాక్ ప్రధాని అయ్యేందుకు మలాలా కలలు కంటున్నారు.