ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్న పాప ఎవరో గుర్తుపట్టగలరా.. ? ఆమె ఇప్పుడు హీరోయిన్గా తెలుగులో నటిస్తోంది. కానీ ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఆమెకు ఓ రేంజ్ ఫాలోయింగ్ వచ్చేసింది. టాలీవుడ్ లో అవకాశాలు విపరీతంగా వస్తున్నాయి.
అయితే ఈమె తమిళంలో హీరోయిన్ గా తొలి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయంది.
ఈ హీరోయిన్ మరెవరో కాదు.. తమిళ నటి దివ్య భారతి. ‘బ్యాచిలర్’ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ హీరోగా నటించాడు. తొలి చిత్రంలోనే ఈమె రొమాంటిక్ సీన్స్ లో నటించింది.
ఇప్పుడు ఈమె సుడిగాలి సుధీర్ సరసన ‘గోట్’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే ఓ రేంజ్ ఫాలోయింగ్ తెచ్చుకుందీ ముద్దుగుమ్మ.