పప్పుధాన్యాలను ఎల్లప్పుడూ ప్రోటీన్ మంచి వనరుగా పరిగణిస్తారు. బలంగా ఉండటానికి వీటిని ఆహారంలో చేర్చుకుంటారు. అందులో మూంగ్ పప్పు ఒకటి. ఇది మంచి ప్రోటీన్ మూలం. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే పెసర పప్పును కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు వీటిని తింటే ఆ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి.
అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు ఉంటే, ముంగ్ బీన్స్ తినడం మానేయాలి. ఇందులో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు ఉన్నవారికి హానికరం.
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు పెసర పప్పు తినకూడదు. పెసల్లో ఆక్సలేట్లు ఉంటాయి. ఇవి కిడ్నీలో రాళ్ల సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.
పెసలు ఎక్కువగా తినడం వల్ల కొంతమందిలో గ్యాస్, ఉబ్బరం వస్తుంది.అంతేకాదు పెసలు మొలకలు వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పికి కారణమవుతుంది. అయితే, ఈ సమస్యను నివారించడానికి పెసలను సరిగ్గా నమలడం ముఖ్యం.
తరచుగా షుగర్ డౌన్ అయ్యే సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటె మూంగ్ పప్పును తినడం మానుకోవాలి. ఈ పప్పులో మీ రక్తంలో చక్కెరను తగ్గించే కొన్ని అంశాలు ఉంటాయి.