సుగంధ ద్రవ్యాల్లో సోంపు గింజలు ఒకటి. వీటి వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మనలో చాలామంది భోజనం చేసిన తర్వాత కాస్తంత సోంపును నోట్లో వేసుకుని నమలుతారు. ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. ఈ గింజలు నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. అందుకే మౌత్ ఫ్రెషనర్ గా సోంపును వాడుతారు. ఈ నేపథ్యంలో రోజూ సోంపు నీరు తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
సోంపు నీళ్లు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరచి, డయాబెటిస్ అదుపులో ఉంచుతుంది.
సోంపు నీటిలో విటమిన్ సి, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహవపడుతాయి. ఈ నీటిని క్రమం తప్పకుండా తాగడం ద్వారా శరీర రక్షణ బలపడుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి కూడా దోహదపడుతుంది.
ఈ నీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేస్తుంది. దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి ఈ డ్రింక్ ఎంతో మేలు చేస్తుంది.
సోంపు నీళ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇవి శరీరంలోని మెటబాలిజంను పెంచుతుంది. దీంతో కొవ్వు త్వరగా కలుగుతుంది. అంతేకాకుండా ఈ నీళ్లు తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీని ద్వారా ఎక్కువ ఆహారం తినకుండా నివారించవచ్చు.
సోంపులో ఫైబర్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఈ పానీయం కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను తొలగిస్తుంది. ఆహారం తిన్న తర్వాత కొన్ని సోంపు గింజలు నమలడం లేదా సోంపు నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.