కొన్ని రకాల కూరగాయలు పచ్చిగా తింటేనే పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని వండినట్లైతే అందులో ఉండే పోషకాలను కోల్పోతామని చెబుతున్నారు. ఆలా పచ్చిగా తినాల్సిన కూరగాయల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రోకలీ: బ్రోకలీని వండకుండానే పచ్చిగా తిన్నట్లయితే ఆరోగ్యానికి పూర్తి లాభాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది విటమిన్ సి, కాల్షియం, ప్రోటీన్ మంచి మూలం. దీనిని సలాడ్ల లో పచ్చిగా చేర్చి తినడం మంచిది.
కీర దోసకాయ: కిరా దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. కావున దీని పచ్చగానే తినడం ఆరోగ్యానికి మంచిది. ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్లకు ఇది చాలా మంచిది.
క్యారెట్: క్యారెట్ లో విటమిన్ సి, పొటాషియం మంచి మూలం. దీని వండినప్పుడు ఈ అంశాలు నశిస్తాయి. కావున వీటిని పచ్చిగానే తినడం ఆరోగ్యానికి మంచిది.
టమోటా: టమోటా ను కూడా పచ్చిగా తినవచ్చు. ఎందుకంటే ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.