ప్రతి ఒక్కరికీ జీవితంలో మరుపురాని రోజు పెళ్లి రోజు. ఆ రోజు అందంగా కనిపించాలని ఏ వధువైనా కోరుకుంటుంది. ముఖ్యంగా ముఖంపై మచ్చలు, మొటిమలు, యాక్నే సమస్యలు ఎదురుకాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. యాక్నే సమస్య రాకుండా ఉండాలంటే మీరు తీసుకునే డైట్ విషయంలో కూడా కొన్ని టిప్స్ పాటించాలి. అవేమిటంటే…
*పర్పుల్ కలర్ అంటే బీట్ రూట్ రంగున్న ఫుడ్స్ తింటే యాక్నే పాలబడరు. అందుకే ఆ రంగులో ఉండే ప్లమ్స్, బీట్ రూట్, పర్పుల్ క్యాబేజీ, పర్పుల్ క్యారెట్, బ్లూబెర్రీస్ లాంటి వాటిని బాగా తినాలి. వీటిల్లో విటమిన్ ఎ, ఇ, జింకులు పుష్కలంగా ఉంటాయి. పర్పుల్ రంగులో ఉండే పండ్లు, కూరగాయలు బాగా తీసుకోవాలి. వీటిల్లో యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు యాంటాక్సిడెంట్లు కూడా వీటిల్లో బాగా ఉంటాయి. ఇవి యాక్నేని, మచ్చలను తగ్గిస్తాయి. అందుకే పెళ్లి రోజుకు కొన్ని రోజుల ముందర నుంచే వీటిని తినడం మొదలుపెట్టాలి. టెట్రా ప్యాక్స్ లో ఉన్న జ్యూసులను తాగొద్దు. ఎందుకంటే వాటిల్లో ప్రిజర్వేటివ్స్ కలుపుతారు.
*బంగాళాదుంపల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అయితే సల్ఫర్, ఫాస్ఫరస్, క్లోరిన్ లు ఉడకబెట్టని పచ్చి బంగాళాదుంపల్లోనే ఉంటాయి. అందుకే ఒక పచ్చి బంగాళా దుంపను తీసుకుని ముక్కలుగా చేసి అందులో పావు కప్పు కొత్తిమీర రసం కలిపి జ్యూసులా చేసుకుని తాగితే ముఖంపై మచ్చలు ఉంటే తగ్గుతాయి. ఈ రసాన్ని మచ్చలున్న చోట రాసినా అవి మెల్లగా పోతాయి. మలబద్ధకం వల్ల కూడా ముఖంపై మచ్చలు వస్తాయి. పచ్చిబంగాళాదుంపలో కొత్తిమీర రసం వేయడం వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకు పోతాయి. ఈ రసం తాగడం వల్ల ముఖంపై మచ్చలు తగ్గుతాయి.
* ప్రోసెస్డ్ కార్బోహైడ్రేట్లను అంటే చక్కెర, మైదా, వైట్ బ్రెడ్, క్యాండీస్, సుగర్ కోటెడ్ చాక్లెట్లు, సాఫ్ట్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి ఎండోక్రైన్ హార్మోన్లలో సమతుల్యతను దెబ్బతీస్తాయి. స్త్రీలలో పిసి ఒడి, పిసివొ లకు కారణం ఇదే. బియ్యం, ప్రాసెస్డ్ మీల్స్ కాకుండా మల్టీ గ్రెయిన్సును ఆహారంగా తీసుకుంటే మంచిది. రిఫైన్డ్ షుగర్స్ స్థానంలో నేచురల్ షుగర్స్, బెల్లం వంటి వాటిని వాడాలి.
- యాక్నేను పోగొట్టే స్పెషల్ టీ ఉంది. దాన్ని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఒక టీస్పూను ధనియాలు, ఒక టీస్పూను జీలకర్ర, ఒక టీస్పూను సోంపు గింజలను 300 ఎంఎల్ నీళ్లల్లో వేసి మరగబెట్టాలి. అలా మరిగిన నీళ్లను వొడగొట్టి ఆ నీళ్లను కప్పులో పోసుకుని తాగాలి. ఈ టీ యాక్నే మచ్చలను తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యకరంగా పనిచేసేట్టు చేస్తుంది. శరీరంలోని దోషాలను పోగొడుతుంది.
* మంచినీరు, కూరగాయలు, పండ్ల రసాలు బాగా తీసుకోవాలి. గ్రీన్ టీ, హెర్బల్ టీ లు తాగాలి. వీటి వల్ల శరీరంలోని విషతుల్యమైన పదార్థాలు బయటకు పోతాయి. అరవై కేజీల బరువున్న వ్యక్తి రోజుకు రెండు లీటర్ల నీళ్లను తాగాల్సి ఉంటుంది. మంచినీటితోపాటు పైన చెప్పినట్టు పడ్లరసాలు, కూరగాయరసాలు కూడా తీసుకోవాలి. కాఫీ, ఆల్కహాల్ లకు దూరంగా ఉండాలి. ఇవి శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి.
- మలబద్దకం సమస్య తలెత్తకుండా జాగ్రత్తపడాలి. జీర్ణవ్యవస్థలో విషపదార్థాలు ఉంటే యాక్నే తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఒక కప్పు వేడి నీళ్లల్లో ఒక టీ స్పూను ఆమ్లా పొడిని కలిపి రాత్రి నిద్రపోయేముందు తాగాలి. అలాగే ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాసు తాజా కలబంద జ్యూసు తాగాలి. లేదా ఒక టీ స్పూను అలొవిరా గుజ్జు తీసుకుని అందులో బంగాళాదుంప లేదా వేరేదైనా కాయగూర జ్యూసు చేర్చి ఆ మిశ్రమాన్ని నీళ్లల్లో కలిపి రోజులో ఎపుడైనా తాగొచ్చు.
*వారానికి ఒకసారి శెనగపిండి ఫేస్ ప్యాక్ రాసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ శెనగపిండిలో పెరుగు, పసుపు వేసి పేస్టులా చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లనినీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. ఫేస్ వాష్ తర్వాత ముఖానికి రోజ్ వాటర్ టోనర్ రాసుకోవాలి. ఆయిల్ లేని మాయిశ్చరైజర్ ని కూడా ముఖానికి పట్టించుకోవాలి. యాక్నే వచ్చే చర్మం ఉన్న వారు రాత్రి పడుకోబోయే ముందు శాండల్ వుడ్ పౌడర్ లో రోజ్ వాటర్ కలిపి లైట్ పేస్టులా చేసి దాన్ని యాక్నే మీద రాసుకోవాలి. శాండల్ వుడ్ లో యాంటీసెప్టిక్, యాంటి బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. అందువల్ల ఇది యాక్నేతో పాటు మచ్చలను కూడా పోగొడుతుంది.
* పైన చెప్పినవాటితో పాటు నిత్యం ప్రాణాయామ, వ్యాయామాలు, శ్వాస బాగా తీసుకుని వదలడం వంటివి చేయాలి. బాగా నిద్రపోవాలి. వీటిని చేయడం వల్ల కూడా యాక్నే బారిన పడరు.