Alternative for Eggs: సామాన్యుడికి పౌష్టికాహారం అందిచే ఆహారం ఏదైనా ఉందంటే మొదటగా గుర్తొచ్చేవి కోడి గుడ్లు (Eggs) మాత్రమే. కొంతమంది శాఖాహార ప్రియులు గుడ్లను సైతం తినరు. ఇలాంటి వారి కోసం గుడ్డుతో సమానంగా పోషకాలను ఇచ్చే ప్రత్యామ్నాయ ఆహారాలు కూడా ఉన్నాయి. ఒక్కో గుడ్డులో సుమారు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన 4 సూపర్ ఫూడ్స్ మీకోసం..
శనగలు: అర కప్పు శనిగల్లో దాదాపు 8 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. ఇది అదనపు పోషక విలువలకు సహకరిస్తుంది. సలాడ్లు లేదా సూప్‌లలో చేర్చవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ శనగలను ఉడకబెట్టి తింటారు. వీటిని పిల్లలకు వివిధ రూపాల్లో ఇవ్వడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి.
పనీర్: పనీర్‌లో దాదాపు 12 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీనిని మంచి పవర్‌హౌస్ ఫూడ్‌గా చెప్పవచ్చు. లో కొలెస్ట్రాల్ ఫూడ్ కోరుకునే వారికి ఇది సరిపోతుంది. ఇది పాల పదార్థం అయినప్పటికీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
బాదం: బాదం మంచి ప్రోటీన్లు అందిచడంలో సహాయపడుతుంది. బాదం 2 టేబుల్ స్పూన్లకు దాదాపు 7 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇది గుండెకు మేలు చేస్తుంది. ఇది తీసుకునేటప్పుడు అదనపు రుచి కోసం దాల్చినచెక్క, జాజికాయ, వెనీలా ఎక్స్ట్రాక్ట్ లేదా కరివేపాకు పొడి వంటి వాటిని మిక్స్ చేసి తినవవచ్చు. దీనిని మీరు ఇంట్లో తయారు చేయవచ్చు.
గుమ్మడికాయ గింజలు: గుమ్మడికాయతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీని గింజల ద్వారా చేసుకునే సలాడ్, ఇతర రుచికరమైన ఫూడ్ మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ గుమ్మడికాయ గింజలు షెల్ చేసినప్పుడు ఔన్స్‌కి 8.5 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇందులో జింక్, ఐరన్, రాగి, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి.
పైన చెప్పిన ఆహార పదార్థాలు మీ ఆరోగ్యాన్ని సమతుల్యం చేస్తాయి. గుడ్ల స్థానంలో వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను మీరు పొందవచ్చు.