Green Coffee Benefits: నేటి బిజీ లైఫ్, ఆఫీస్ లో గంటల తరబడి వర్క్ చేయడం.. ఇలా అనేక కారణాల వల్ల చాలా మంది తమ ఆరోగ్యాన్ని పై శ్రద్ధ వహించడం పూర్తిగా మానేశారు. దీని కారణంగానే అనేక సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతోంది. ఏది తిన్నా, తాగినా, అది ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అయితే, వీటన్నింటినీ నివారించాలంటే మన డైట్ లో ఆరోగ్యకరమైన ఆహారాలను చేర్చుకోవడం అవసరం.
చాలా మంది గ్రీన్ టీ తాగుతుంటారు. ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది ఇలా ఉండగా..ఈరోజుల్లో గ్రీన్ కాఫీ ట్రెండ్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. గ్రీన్ కాఫీ సాధారణ కాఫీ కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. గ్రీన్ కాఫీ..కాఫీలా కాకుండా తేలికపాటి రుచిని కలిగి ఉంటుంది. చాలా మంది దీనిని డిటాక్స్ పానీయంగా కూడా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు అనేకమంది ప్రజలు దీనిని తమ దినచర్యలో భాగంగా చేసుకుంటున్నారు. అయితే, ఇప్పుడు గ్రీన్ కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
గ్రీన్ కాఫీలో ఉండే క్లోరోజెనిక్ అనే మూలకం జీవక్రియను మెరుగుపరచడానికి ఎంతో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు గ్రీన్ కాఫీ తాగొచ్చు. ఎందుకంటే దీన్ని తాగడం వల్ల కేలరీలు వేగంగా కరుగుతాయి. దీంతో బరువు తగ్గడం సులభం అవుతుంది.
Also Read: Coffee vs Tea: కాఫీ-టీ ఈ రెండింటిలో ఏది మంచిది.. నిపుణుల సలహా ఇదే..!
డయాబెటిస్ ఉన్నవారు గ్రీన్ కాఫీని డైట్ లో చేర్చుకోవచ్చు. దీన్ని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే, గ్రీన్ కాఫీలో ఉండే క్లోరోజేనిక్ ఆమ్లం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
గ్రీన్ కాఫీ అడిగితే శరీరాన్ని శుభ్రపరుస్తుంది. అంతేకాకుండా శరీరంలోని ఉన్న విష పదార్థాలను తొలగిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సమస్యలను దూరం చేస్తుంది. ఇది జుట్టు ఆరోగ్యంలో కూడా సహాయపడుతుంది.
గ్రీన్ కాఫీ తాగడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త నాళాలు సరిగ్గా పనిచేసేలా చేస్తాయి. రక్తనాళాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే గుండె సంబంధిత వ్యాధులు కూడా దూరంగా ఉంటాయి. దీని వినియోగం గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.


