చలికాలంలో బూడిదగుమ్మడి నీళ్లు చేసే మేలెంతో…
బూడిద గుమ్మడికాయ తెలియనివారుండరు. కానీ చలికాలంలో ఈ కాయ అందించే లాభాలు ఈతరం వాళ్లకు అంతగా తెలియదనే చెప్పాలి. బూడిద గుమ్మడికాయలో 96 శాతం నీళ్లు ఉంటాయి. ఇది సూపర్ హైడ్రేటింగ్ కాయ. శరీరంలోని ఫ్లూయిడ్స్ ప్రమాణాలను ఇది బాగా సంరక్షిస్తుంది.
దీన్ని ‘వింటర్ మిలన్’ అని కూడా అంటారు. దీంతో పీతా అనే స్వీటు చేస్తారు. ఈ స్వీటు చాలా ఫేమస్. బూడిద గుమ్మడికాయతో సబ్జీలు, చట్నీలు, వడియాలు కూడా చేస్తారు. భారతదేశం తూర్పు, దక్షిణ ప్రాంతాల ప్రజలు ఈ సీజనల్ వెజిటబుల్ తో ఎన్నో రెసిపీలు చేస్తారు. అంతేకాదు చాలామంది బూడిదగుమ్మడి కాయను ఆర్యోకరమైన ఆహారంగా కూడా భావిస్తారు. దీంట్లో ఆరోగ్యకరమైన పదార్థాలు ఎన్నో ఉన్నాయి. బూడిదగుమ్మడి కాయను పలు డిటాక్స్ డ్రింకుల్లో, జ్యూసుల్లో కూడా బాగా వాడతారు. ఇంకా మరిన్నో వంటకాల్లో కూడా ఈ కాయను వాడతారు. బూడిద గుమ్మడికాయ వేసిన డిటాక్స్ డ్రింకు శరీరాన్ని బాగా శుద్ధి చేస్తుంది. ఇందులో నీటి శాతం ముందు చెప్పుకున్నట్టు అత్యధికంగా ఉండి శరీరం డీహైడ్రేషన్ పాలబడకుండా, చర్మం పొడారనివ్వకుండా చూస్తుంది. అంతేకాదు శరీరంలోని నీటి ప్రమాణాలను సంరక్షిస్తుంది కూడా.
బూడిద గుమ్మడికాయలో కాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాదు ఆ కాయ శరీరంలోని నీటి ప్రమాణాలు హరించిపోకుండా తోడ్పడతుంది. దీంతో శరీరం మొత్తం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది . బూడిద గుమ్మడికాయలో తగినంత సొల్యుబుల్ ఫైబర్ తో పాటు విటమిన్ బి2, విటమిన్ సిలు ఉన్నాయి. అంతేకాదు ఈ కాయలో రిబోఫ్లేవిన్ కంటెంట్ కూడా బాగా ఉందని డైటీషియన్లు చెపుతున్నారు. ఇది థైరాయిడ్ గ్లాండుతో పాటు స్ట్రెస్ హార్మోన్లు సరిగా పనిచేసేలా సహకరిస్తుంది. మొత్తం శరీరాన్ని బాగా శుద్ధి చేసి ఆరోగ్యంగా ఉండేలా బూడిద గుమ్మడికాయ పనిచేస్తుంది. బూడిద గుమ్మడికాయ నీళ్లు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కాయలో అధికంగా విటమిన్ సి ఉందని చెప్పుకున్నాం. అలాగే 96 శాతం నీళ్లు ఉన్నాయని కూడా చెప్పుకున్నాం. ఈ నీళ్లల్లో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో అదనంగా చేరిన మలినాలు, విషతుల్య పదార్థాలను బూడిద గుమ్మడికాయ నీళ్లు బయటకు పంపేస్తాయి.
అలాగే ఈ కాయలో సొల్యుబుల్ ఫైబర్ పుష్కలంగా ఉంది కాబట్టి ఆకలి తొందరగా వేయదు. కడుపు నిండుగా ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో బరువు పెరగకుండా బూడిద గుమ్మడికాయ ఎంతగానో సహాయపడుతుంది. అందుకే రోజూ ఒక గ్లాసుడు గుమ్మడికాయ నీళ్లు తాగడం వల్ల శరీరంలో పేరుకున్న ఫ్యాట్ తగ్గుతుంది. ఆరోగ్యమైన జీర్ణశయం వల్ల శరీరం ఎంతో హెల్దీగా ఉంటుంది. సాధారణంగా చలికాలంలో తొందరగా జీర్ణకోశం దెబ్బతింటుంది. అజీర్తి వంటి సమస్యలు తరచూ తలెత్తుతాయి. అందుకే ఈ సీజన్ లో బూడిద గుమ్మడికాయ నీళ్లు తాగడం వల్ల జీవక్రియ బాగా జరగడమే కాకుండా, ఆహారం బాగా జీర్ణం అయ్యేలా బూడిదగుమ్మడికాయ ఎంతగానో సహకరిస్తుంది. గుమ్మడికాయలోని యాంటాక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఎ లు శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను శక్తివంతంగా అడ్డుకుంటాయి. అంతేకాదు శరీరంలో రక్తం, ప్రాణవాయువులు సరిగా ప్రవహించేలా చేస్తాయి. అంతేకాదు ఈ కాయ శరీరాన్ని పోషకాలతో నింపేస్తుంది. అలా ఎంతో ఆరోగ్యంగా ఉండేలా శరీరాన్ని నిలబెట్టడమే కాకుండా సీజనల్ జబ్బుల బారిన శరీరం పడకుండా కాపాడుతుంది కూడా.
శరీర జీవక్రియ చక్కగా సాగిపోయేలా సహకరిస్తుంది. బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ ప్రమాణాలను క్రమబద్ధీకరిస్తుంది. ఇంకా మరెన్నో ప్రయోజనాలను శరీరానికి అందిస్తుంది. గుమ్మడికాయ నీళ్లు నిత్యం తాగడం వల్ల శరీరంలోని విషతుల్యమైన పదార్థాలన్నీ బయటకు పోయి శరీరం బాగా శుద్ధి అయి సుతిమెత్తగా తయారవుతుందని పోషకాహారనిపుణులు చెప్తున్నారు. బూడిద గుమ్మడి కాయ నీళ్ల వల్ల కడుపు నిండుగా ఉండి ఆకలి కూడా వేయదు. అయితే బూడిద గుమ్మడి నీళ్ల పరిమాణం విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని డైటీషియన్లు చెపుతున్నారు. అంటే రోజుకు తగినంత మాత్రమే అంటే ఒక గ్లాసుడు బూడిద గుమ్మడికాయ నీళ్లు మాత్రమే తాగితే మంచిదని సూచిస్తున్నారు. మొదట బూడిద గుమ్మడి కాయపై ఉండే తొక్కను తీసేయాలి. తర్వాత ఆ కాయను ముక్కలుగా తరగాలి. అరకప్పు బూడిద గుమ్మడికాయ ముక్కలను తీసుకుని అందులో అరకప్పు నీళ్లను వేసి బ్లెండర్ లో వేయాలి.
అలా బాగా బ్లెండ్ చేసిన నీళ్లను పొడుగైన గాజు గ్లాసులో పోసుకోవాలి. ఆ నీళ్లల్లో ఇంకేమీ కలపకుండా అలాగే తాగాలి. బూడిద గుమ్మడి నీళ్లు మీకందించే సాంత్వన, ఆరోగ్యం, తేమ ఎంతో. బూడిదగుమ్మడి వల్ల జీర్ణశక్తి బాగుండడమే కాదు చలికాలంలో బరువు పెరిగే సమస్యను కూడా ఇట్టే అధిగమిస్తాం. బూడిదగుమ్మడి కాయ నీళ్లను నిత్యం తాగడం వల్ల బరువు బాగా తగ్గుతారు.