Tuesday, January 21, 2025
Homeహెల్త్Sprouts: మొలకలు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

Sprouts: మొలకలు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందాలంటే.. రోజూ మొలకలు తినడం మంచిదని వైద్యులు చెబుతుంటారు. మొలకల్లో విటమిన్స్, యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ సమృద్ధిగా ఉండి కొవ్వులు, కేలరీలు తక్కువగా ఉంటాయని చెబుతారు. మొలకెత్తిన గింజలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని పెద్దలు కూడా చెబుతుంటారు. రాత్రి పప్పును బాగా కడిగి.. ఓ గుడ్డలో చుడితే.. ఉదయాన్నే తింటే ఆరోగ్యంగా ఉంటాం. ప్రోటీన్ అధికంగా ఉండే ఈ మొలకలను తూర్పు ఆసియా దేశాలలో విరివిగా ఉపయోగిస్తారు.

- Advertisement -

మొలకెత్తిన పెసల్లో ఫైబర్, రౌగేజ్ మాత్రమే కాకుండా, ఫోలేట్, విటమిన్ సి, అనేక ఖనిజాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా మొలకెత్తిన పెసల్లో విటమిన్ కె ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అనేక విధాలుగా పనిచేస్తుంది. మొలకెత్తిన పంటలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు సంరక్షణకు చాలా బాగా తోడ్పడతాయట. ఇందులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, బీటా కెరోటిన్ మరియు ఫైబర్ ఉంటుంది. ఇక మొలకలు తినడం ద్వారా శరీరానికి రోజువారీ అవసరమైన విటమిన్లు అందుతాయి. అంతేకాక, శరీరానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు కూడా ఇందులో ఉంటాయి.

వీటిలో ఉండే విటమిన్ ఏ కంటిశుక్లాలు, రేచీకటి వంటి కంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. మొలకెత్తిన పెసర, శనగ, పెసలు మరియు మినుములు ఉన్నాయి. ఇక బీన్స్ ను సులభంగా పచ్చిగా తినవచ్చు. దీన్ని పచ్చిగా తినడానికి ఇష్టపడని వారు అవియల్ కూడా తినవచ్చు. ఇక ఉదయాన్నే వ్యాయామం చేసేవారికి, యోగాసనాలు వేసేవారికి, బరువు తగ్గాలనుకునేవారికి ఈ మొలకలు శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తాయి.

ఈ మొలకల ద్వారా బాడీలో హెచ్‌డిఎల్ స్థాయి పెరుగుతుంది. అంటే.. శరీరంలో ‘మంచి కొలెస్ట్రాల్’ పెరగడానికి ఈ మొలకలు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగు పడుతుందంటున్నారు. అలాగే.. రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుందని సూచిస్తున్నారు. అదేవిధంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయంటున్నారు. మొలకలతో శరీర బరువును మెయింటైన్ చేయడంతో పాటు అవసరమైన పోషకాలను సులభంగా పొందవచ్చు. రోజువారీ ఆహారంలో మన శరీరానికి అవసరమైన పోషకాలు అందాలంటే ఈ మొలకలు తినడం చాలా అవసరం. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News