Sunday, July 7, 2024
Homeహెల్త్Cinnamon benefits: చెక్క తినండి, తాగండి

Cinnamon benefits: చెక్క తినండి, తాగండి

దాల్చిన చెక్క ప్రయోజనాలు చాలా ఎక్కువ

దాల్చినచెక్క అందరి వంటింట్లో అందుబాటులో ఉండే మసాలా దినుసు. దీని వల్ల పొందే ఆరోగ్య లాభాలు ఎన్నో. ఇటీవల చేసిన ఒక స్టడీలో దాల్చినచెక్క నీళ్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తేల్చింది. ఉదయం లేచిన వెంటనే దాల్చిన చెక్క నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ సరిగా జరగడమే కాదు పొట్టకు సంబంధించిన అనారోగ్య సమస్యలను కూడా దాల్చిన చెక్క నీళ్లు తగ్గిస్తాయి. దాల్చినచెక్క నీళ్లు తాగడం వల్ల రుతుస్రావం కూడా క్రమపద్థతిలో జరుగుతుంది. నిత్యం దాల్చినచెక్క
నీళ్లు తాగడం వల్ల పిసివొ లక్షణాలు తగ్గుతాయి. దాల్చినచెక్క నీళ్లు తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా
ఉంటుంది. అంతేకాదు ఈ నీళ్లు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. గుండె జబ్బుల రిస్కును కూడా తగ్గిస్తాయి.
లావు తగ్గాలనుకుంటే క్రమం తప్పకుండా దాల్చినచెక్క నీళ్లు తాగితే మీ బరువు నియంత్రణలో ఉంటుంది.
దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిని సైతం మెరుగుపరుస్తుంది. బ్లడ్ షుగర్ ప్రమాణాలను క్రమబద్ధీకరిస్తుంది. బ్లడ్ షుగర్ ప్రమాణాలు పెరగడం, తగ్గడం వంటివి జరగకుండా కూడా దాల్చిన చెక్క నీళ్లు నియంత్రిస్తాయి.

- Advertisement -


దాల్చినచెక్క నీళ్లు తయారుచేయడం చాలా సింపుల్ సులభం కూడా. కొన్ని దాల్చినచెక్క ముక్కలను
తీసుకుని నీళ్లల్లో వేసి పది నిమిషాల పాటు ఉడికించి బాగా చల్లారనివ్వాలి. రుచి కోసం ఆ నీళ్లల్లో సరిపడినంత తేనె లేదా నిమ్మరసం వేసి కలిపి తాగితే చాలా బాగుంటుంది. మనల్ని బాధిస్తున్న ఎన్నో శరీర బాధల నుంచి సంతృప్తికరంగా సాంత్వననిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News